https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టేస్టీ తేజా ని దారుణంగా టార్గెట్ చేసిన ఓజీ టీం..హద్దులు దాటేసిన నిఖిల్!

వీళ్లిద్దరి దగ్గర ఎవరీ మీద నామినేషన్స్ పాయింట్స్ దొరకలేదు. యష్మీ కి కేవలం ప్రేరణ మీద నామినేషన్ పాయింట్ దొరికింది. ఆమెని నామినేషన్ చేస్తానని తేజా తో, నిఖిల్ తో, చివరికి ప్రేరణ తో కూడా చెప్పింది. అప్పుడు ప్రేరణ వేరే వాళ్లకు నీ దగ్గర నామినేషన్స్ పాయింట్స్ దొరకలేదా అని అడగగా, లేదు నాకు దొరకలేదు, నీ మీదనే నామినేషన్ వేస్తున్నాను అని చెప్పింది యష్మీ. అయితే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యాక, ప్రేరణ ని నామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్, ఎందుకంటే ఆమె కిల్లర్ లేడీ కాబట్టి.

Written By:
  • Vicky
  • , Updated On : October 15, 2024 / 08:22 AM IST

    Bigg Boss Telugu 8(115)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ లో టేస్టీ తేజా విషయంలో ఓజీ క్లాన్ చాలా టార్గెట్ చేసింది అనే విషయం చూసే ప్రతీ ఒక్కరికి అనిపించింది. నిఖిల్ అయితే టేస్టీ తేజా ని నామినేట్ చేసేంత వరకు పరిగెడుతూ వచ్చి రెడ్ బోర్డు మీద నిల్చుంటునే ఉన్నాడు. తేజా విషయం లో నిఖిల్ ప్రవర్తించిన తీరుని చూసి నిఖిల్ అభిమానులు సైతం ఆశ్చర్యానికి గురి అయ్యారు. కేవలం నిఖిల్ ఒక్కడే కాదు యష్మీ కూడా తేజనే నామినేట్ చేయడానికి ప్రయత్నం చేసింది. వీళ్లిద్దరి తాపత్రయం ఒక్కటే, పృథ్వీ ని నామినేషన్స్ నుండి సేవ్ చేయడం. ఎందుకంటే టేస్టీ తేజా ఈ వారం నామినేషన్స్ లోకి వస్తే, అతనికే అందరికంటే తక్కువ ఓట్లు వస్తాయి కాబట్టి, అతనే ఎలిమినేట్ అయిపోతాడు, పృథ్వీ సేవ్ అవుతాడు అనేదే వాళ్ళిద్దరి లాజిక్.

    అంతే కాకుండా వీళ్లిద్దరి దగ్గర ఎవరీ మీద నామినేషన్స్ పాయింట్స్ దొరకలేదు. యష్మీ కి కేవలం ప్రేరణ మీద నామినేషన్ పాయింట్ దొరికింది. ఆమెని నామినేషన్ చేస్తానని తేజా తో, నిఖిల్ తో, చివరికి ప్రేరణ తో కూడా చెప్పింది. అప్పుడు ప్రేరణ వేరే వాళ్లకు నీ దగ్గర నామినేషన్స్ పాయింట్స్ దొరకలేదా అని అడగగా, లేదు నాకు దొరకలేదు, నీ మీదనే నామినేషన్ వేస్తున్నాను అని చెప్పింది యష్మీ. అయితే నామినేషన్ ప్రక్రియ మొదలయ్యాక, ప్రేరణ ని నామినేట్ చేసే అవకాశం ఇవ్వలేదు బిగ్ బాస్, ఎందుకంటే ఆమె కిల్లర్ లేడీ కాబట్టి. దీంతో ఎవరికీ నామినేషన్ వేయాలో తెలియక, పాపం తేజాతో నామినేషన్ పాయింట్ ని వెతుక్కొని నామినేట్ చేసింది యష్మీ. ఆమె మాట్లాడుతూ ‘మీరు హోటల్ టాస్క్ లో పెద్దగా ఆడినట్టు నాకు అనిపించలేదు. మీకు ఎంటర్టైన్మెంట్ టాస్క్ ఇచ్చారు. మీకు కామెడీ టైమింగ్ ఉన్నప్పటికీ కూడా నవ్వించే ప్రయత్నం కూడా చేయలేదు’ అంటూ నామినేషన్ వేసింది. తన నామినేషన్ పై టేస్టీ తేజా మాట్లాడుతూ ‘హౌస్ లో నేను ఎంత వరకు అయితే ఇవ్వగలనో, అంత వరకు ఇచ్చాను. మీ శరీరానికి 100 శాతం పెడితే టాస్కులు ఆడగలరు, కానీ నేను మీ రేంజ్ లో టాస్కులు ఆడాలంటే 200 శాతం నా శరీరానికి పని చెప్పాలి’ అంటూ తన పాయింట్స్ తో చాలా వరకు వాదించుకున్నాడు.

    నిఖిల్ నామినేషన్ కూడా టేస్టీ తేజా పై ఇదే విషయం మీద ఉంటుంది. ఒకసారి వచ్చి తేజా ని నామినేట్ చేయాలనీ చూసాడు, కిల్లర్ గర్ల్స్ అందుకు అంగీకరించలేదు, రెండవ సారి కూడా ప్రయత్నం చేసాడు, మళ్ళీ బెడిసికొట్టడంతో మూడవసారి కూడా నామినేషన్ వేసేందుకు వస్తాడు. ఇలా ఇన్ని సార్లు రావడంతో టేస్టీ తేజాకి కూడా అర్థం అయిపోయింది. ఓజీ క్లాన్ వాళ్ళు గ్రూప్ గా మాట్లాడుకొని నన్ను నామినేట్ చేస్తున్నారు అనే విషయం అర్థమైంది అని అంటాడు. అప్పుడు నిఖిల్ అది నీ అభిప్రాయం అని అనగా, టేస్టీ తేజ దానికి సమాధానం ఇస్తూ ‘ఇక్కడ వందకి పైగా కెమెరాలు ఉన్నాయి, మీరు ఏమి చేస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు’ అని టేస్టీ తేజా తన పాయింట్స్ తో చాలా చక్కగా వాదించుకున్నాడు.