Border Gavaskar Trophy 2024: నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా – టీమిండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తలపడతాయి. గత రెండు సీజన్లో ఆస్ట్రేలియా భారత్ చేతిలో ఓడిపోయింది. అది కూడా స్వదేశంలో.. అయితే ఈ సిరీస్ ప్రారంభానికి ముందు టీమిండియా ప్రత్యేకమైన మ్యాచ్ ఆడుతుంది. దీనిని ఆస్ట్రేలియా లోనే నిర్వహిస్తారు. ఈ సిరీస్ కు పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడానికి ముందు భారత జట్టు శిక్షణ మ్యాచ్ ఆడుతుంది.. ఈ మ్యాచ్ లో రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా భారత్ – ఏ తో తలపడుతుంది.. అయితే సీనియర్ జట్టు ఆస్ట్రేలియా వెళ్లడానికి ముందు.. భారత్ – ఏ జట్టు ఆస్ట్రేలియా చేరుకుంటుంది.. రుతు రాజ్ గైక్వాడ్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. రోహిత్ ఆధ్వర్యంలో టీం ఇండియాలో తలపడేందుకు భారత్ – ఏ జట్టు ముందుగానే అక్కడికి వెళ్లి వార్మప్ చేస్తుంది. ఆ తర్వాత నవంబర్ 15 నుంచి 17 తేదీల మధ్యలో రోహిత్ సేనతో భారత్ – ఏ జట్టు పోటీ పడుతుంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 3 వరకు గ్రేట్ బారియర్ రీఫ్ ఎరినాలో ఇండియా ఏ వర్సెస్ ఆస్ట్రేలియా ఏ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఆ తర్వాత నవంబర్ 7 నుంచి 10 వరకు మేల్పూర్ క్రికెట్ గ్రౌండ్లో రెండవ మ్యాచ్ జరుగుతుంది. అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సంబంధించి టీమిండియాను బిసిసిఐ ఇంతవరకు ప్రకటించలేదు.
త్వరలో న్యూజిలాండ్ జట్టుతో..
బంగ్లాదేశ్ జట్టుతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 2-0 తేడాతో గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన మూడు టి20 మ్యాచ్ ల సిరీస్ ను కూడా 3-0 తేడాతో దక్కించుకుంది. ఇక త్వరలో రోహిత్ ఆధ్వర్యంలో టీమ్ ఇండియా న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో జరిగే మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ కోసం రెడీ అవుతోంది. అక్టోబర్ 16 నుంచి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్ట్ మొదలవుతుంది. రెండో టెస్టు అక్టోబర్ 24 నుంచి పూణేలో జరుగుతుంది. మూడవ టెస్ట్ నవంబర్ 1 నుంచి 5 వరకు ముంబైలోని వాంఖడే మైదానంలో మొదలవుతుంది. ఆ తర్వాత టీమ్ ఇండియా సౌత్ ఆఫ్రికాలో పర్యటిస్తుంది. 4 t20 మ్యాచ్ లు ఆడుతుంది. అక్కడ నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా జట్టుతో ఐదు టెస్టుల సిరీస్ ఆడుతుంది.