Bigg Boss Telugu 8: నామినేషన్స్ లో అడ్డంగా దొరికిపోయిన గౌతమ్.. రఫ్ఫాదించిన అవినాష్, విష్ణు ప్రియ..ఇలా ఉంటే గౌతమ్ కష్టమే!

రోహిణి నామినేషన్ వేస్తూ 'ఆరోజు సరదాగా జరిగిన ఫన్నీ టాస్క్ లో నువ్వు ట్రిగ్గర్ అవ్వడం వల్ల హౌస్ హార్మోని దెబ్బ తినింది. నీ ఎమోషన్ ని నేను తప్పుబట్టడం లేదు, కానీ మైక్ విసిరగొట్టి వెళ్లాల్సినంత అవసరం లేదు, అది నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా' అని చెప్పి నామినేట్ చేస్తుంది. అప్పుడు గౌతమ్ 'నేను మైక్ విసిరి అవతల వేయడం కచ్చితంగా తప్పే.

Written By: Vicky, Updated On : October 15, 2024 8:16 am

Bigg Boss Telugu 8(114)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో జరిగిన నామినేషన్స్ ఎంత హీట్ వాతావరణాన్ని తలపించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా రోహిణి గౌతమ్ కి వేసిన నామినేషన్ పాయింట్ పెద్ద రచ్చ లేపింది. అయితే ముగిసిపోయిన గొడవని రోహిణి నామినేషన్స్ లోకి ఒక పాయింట్ గా తీసుకొని రావడం ముమ్మాటికీ తప్పే. మొన్న జరిగినటువంటి ఎంటర్టైన్మెంట్ టాస్క్ లో గౌతమ్ తప్పు లేదు, అవినాష్ తప్పు కూడా లేదు, ఎదో ఆ హీట్ మూమెంట్ లో అలా జరిగిపోయింది. తర్వాత ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు, అక్కడితో మ్యాటర్ ముగిసిపోయింది. కానీ ఎప్పుడైతే రోహిణి దానిని నామినేషన్స్ పాయింట్ కోసం వాడుకుందో, గొడవ మళ్ళీ తారాస్థాయికి చేరుకుంది.

ముందుగా రోహిణి నామినేషన్ వేస్తూ ‘ఆరోజు సరదాగా జరిగిన ఫన్నీ టాస్క్ లో నువ్వు ట్రిగ్గర్ అవ్వడం వల్ల హౌస్ హార్మోని దెబ్బ తినింది. నీ ఎమోషన్ ని నేను తప్పుబట్టడం లేదు, కానీ మైక్ విసిరగొట్టి వెళ్లాల్సినంత అవసరం లేదు, అది నాకు నచ్చలేదు, అందుకే నామినేట్ చేస్తున్నా’ అని చెప్పి నామినేట్ చేస్తుంది. అప్పుడు గౌతమ్ ‘నేను మైక్ విసిరి అవతల వేయడం కచ్చితంగా తప్పే. కానీ నా ఎమోషన్ ని తప్పు అంటే నేను ఒప్పుకోను, ఒక మనిషికి నచ్చని విషయాన్ని పదే పదే పైకి తీసి వెక్కిరించడం కరెక్ట్ కాదు’ అని అంటాడు. దీనికి అవినాష్’నేను ఎక్కడ వెక్కిరించాను. నీకు ‘అశ్వథామ 2.0′ అనే పదం నచ్చదు అనే విషయం నాకు నిజంగా తెలియదు’ అని చెప్పే ప్రయత్నం చేయగా, గౌతమ్ పెద్దగా అరుస్తూ మాట్లాడుతాడు. దీనికి అవినాష్ కూడా గట్టిగా మాట్లాడుతాడు. అలా ఇద్దరి మధ్య గొడవ తారాస్థాయికి చేరుకుంది.

రోహిణి ఆ పాయింట్ తో గౌతమ్ ని నామినేట్ చేయడం కచ్చితంగా తప్పే, కానీ దానిని గౌతమ్ సరైన పద్దతితో హ్యాండిల్ చేయలేదు. అవినాష్ పై అతను గొంతు లేపడం కరెక్ట్ కాదు. నిజంగానే గౌతమ్ తనని అలా పిలవొద్దు అని కేవలం ఒకరిద్దరు కంటెస్టెంట్స్ కి మాత్రమే చెప్పాడు కానీ, అవినాష్ కి ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి చెప్పనప్పుడు అవినాష్ తప్పు చేసాడు అని గౌతమ్ ఎలా అంటాడు?, గౌతమ్ చెప్పిన తర్వాత కూడా అవినాష్ ఆ ప్రస్తావన తీసుకొస్తే తప్పు అనాలి, కానీ ఆ పని అవినాష్ చేయలేదు. ఇక్కడ గౌతమ్ తన పాయింట్స్ ని కరెక్టుగా వాదించుకోలేకపోయాడు అనేది వాస్తవం. ఇది ఇలా ఉండగా సీజన్ 7 గౌతమ్ ఇలా ఉండేవాడు కాదు, పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ వంటి వారిని నామినేషన్స్ లో వణికించేలా చేసాడు. హౌస్ 13 వారాలు ఉంటే ఎన్నో కష్టమైన సందర్భాలు అతనికి ఎదురయ్యాయి, కానీ కంటి నుండి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు, కానీ ఈ సీజన్ లో ఆయన వచ్చిన వారం లోనే రెండు మూడు సార్లు ఏడవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మరోపక్క విష్ణు ప్రియ ని కూడా ఆయన సరైన పాయింట్స్ తో లాక్ చేయలేకపోయాడు, ఆమె కూడా గౌతమ్ ని చెడుగుడు ఆడేసుకుంది. ఎలా ఉండే గౌతమ్ ఇలా అయిపోయాడేంటి అని అని ఆయన అభిమానులు సైతం బాధపడుతున్నారు.