Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన గత సీజన్ కంటెస్టెంట్ గౌతమ్ రోజురోజుకి తన గ్రాఫ్ ని పెంచుకుంటూ పోతున్నాడు. ముఖ్యంగా అవతల వ్యక్తులను మాస్కులను తీసి వాళ్ళ వాస్తవ రూపాన్ని జనాలకు చూపించడంలో సక్సెస్ అయ్యాడు. నిఖిల్, యష్మీ, ప్రేరణ వంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మాస్కులను తొలగించడం ఎవరి వల్ల కాలేదు, ఒక్క గౌతమ్ మాత్రమే తన మైండ్ గేమ్ తో వాళ్ళ నిజస్వరూపాలు బయటపడేలా చేసాడు. నిన్న జరిగిన నామినేషన్స్ లో ప్రేరణ గౌతమ్ ని అనవసరంగా నామినేట్ చేసింది అని అనిపించింది. ఆమె వేసిన ఒక్కొక్క నామినేషన్ పాయింట్ కి గౌతమ్ సిక్సర్లు కొట్టాడు. దెబ్బకి ప్రేరణకి నోటి నుండి మాట రాలేని పరిస్థితి వచ్చింది. ఇలా ఆమెని సీజన్ మొత్తంలో ఎప్పుడూ చూడలేదనే చెప్పాలి. తన తప్ప ఉన్నా లేకపోయినా, బలమైన వాదన వినిపించే అలవాటు ఉన్న ప్రేరణ, నిన్న మాత్రం ఎందుకో వాదించుకోలేకపోయింది.
ముందుగా ఆమె గౌతమ్ ని నామినేట్ చేస్తూ ‘ఇతని ఆట ఏంటో నాకు అర్థం కావడం లేదు బిగ్ బాస్. ప్రతీ ఒక్కటి ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఆడుతాడు. వాళ్ళు ఏమి అనుకుంటారు, ఎలా ఆడితే జనాల్లోకి వెళ్తుంది, ఇలా బయట నుండి అన్నీ చూసొచ్చి లెక్కలేసి ఆడుతున్నాడు. నాకు అది రియల్ అనిపించలేదు. అదే విధంగా మొన్న రెడ్ టీం గా మేమంతా కలిసి ఆడినప్పుడు , ఆయన టీం గా ఆడినట్టు నాకు అనిపించలేదు. కేవలం తాను మాత్రమే సోలో గా ఆడినట్టు అనిపించింది’ అని చెప్పుకొస్తుంది. దీనికి గౌతమ్ సమాధానం చెప్తూ ‘ నువ్వు ఎదుటి వ్యక్తిని అగౌరవపరుస్తూ మాట్లాడే మాటలు జనాల్లో నీకు తీవ్రమైన నెగటివిటీ ని పెంచుతున్నాయి, కాస్త సరి చేసుకో అని ఒక స్నేహితుడిగా నీకు చెప్పాను. దానిని నువ్వు ఇలా అర్థం చేసుకుంటావని అనుకోలేదు. మొన్న కూడా అగౌరవపరుస్తూ పుడింగి, సిగ్గులేదా లాంటి పదాలు ఉపయోగించావు. అవి నీకు పెద్ద మాటలు కాకపోవచ్చు, మేము తీసుకోలేము’ అని చెప్తాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ఒక టీంలో ప్లేయర్ క్రికెట్ ఆడదానికి దిగినప్పుడు సిక్స్ కొట్టు, ఫోర్ కొట్టు, కవర్ డ్రైవ్ కొట్టు అని పక్కనోళ్లు చెప్తూ ఉంటే అయ్యోమయానికి గురి అయ్యి సరిగా ఆడరు. మీరు చేసిన పని అదే. ఓడిపోయిన తర్వాత నీ వల్లే ఓడిపోయాం అని చెప్పడం టీం మేట్ లక్షణం కాదు, మెగా చీఫ్ లక్షణం అంతకంటే కాదు. బెడ్ టాస్క్ లో నువ్వు, యష్మీ కలిసి ఆడారు, ఓడిపోయారు కదా. మొదటి టాస్క్ లో నేను బాగా ఆడాను, కేవలం 10 సెకండ్స్ తేడాతో ఓడిపోయాము. మధ్యలో ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల, ఇది బాగా ఆడనట్టు వస్తుందా. అలా అయితే అసలు మీరేమి ఆడారు..?, యష్మీ లీడర్ గా ఎన్నో తప్పులు చేసింది. ఆమెని నామినేట్ చేయడానికి నీకు పాయింట్స్ దొరకలేదా, నీ దోస్తు కాబట్టి వదిలేసావా’ అంటూ గౌతమ్ ఒక రేంజ్ కౌంటర్లు ఇచ్చాడు. అయితే లైవ్ లో గౌతమ్ ఇంకా అద్భుతమైన పాయింట్స్ తో ప్రేరణ ని లాక్ చేసాడు. టీవీ టెలికాస్ట్ లో అవన్నీ కట్ చేసారు.