Bigg Boss Telugu 8: బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అని చెప్పలేము కానీ, కొంతమంది సెలెక్టెడ్ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ టీం ఉద్దేశపూర్వకంగా ఓటింగ్ లేకపోయినా కూడా సేవ్ చేస్తూ వస్తుంటారు అని ఆడియన్స్ కి కళ్ళకు కట్టినట్టుగా అర్థం అయిపోతుంది. గత సీజన్ లో శోభా శెట్టి ని అలాగే సేవ్ చేస్తూ వచ్చారు. సోషల్ మీడియా లో ఇంత నెగటివిటీ ఉంది. ఈ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారు అని పోల్ పెడితే అత్యధిక శాతం మంది శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాలని ఓట్లు వేస్తుంటారు. అంతటి నెగటివిటీ సంపాదించుకున్న ఆమె టాప్ 6 కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఎలా నిల్చింది రా బాబు అని అందరూ అనుకున్నారు. కానీ బిగ్ బాస్ షో కి ఆమె కావాల్సినంత కంటెంట్ ఇస్తుంది. ఆమె ఉన్నన్ని రోజులు ఎదో ఒక గొడవ హౌస్ లో జరుగుతూ ఉండేది, అది బిగ్ బాస్ వాళ్లకు కావాలి,అందుకే ఆమెని కొనసాగిస్తూ వచ్చారు.
ఈ సీజన్ లో సోనియా, యష్మీ ని కూడా బిగ్ బాస్ టీం వారు బలవంతంగా లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అని అర్థం అయ్యింది. హాట్ స్టార్ లో ప్రసారమయ్యే లైవ్ లో వీళ్లిద్దరు వేసే వేషాలు చూస్తే హౌస్ లోకి వెళ్లి కొట్టిరావాలి అనేంత కోపం వస్తుంది. కానీ బిగ్ బాస్ వాళ్లకి సంబంధించిన నెగటివ్ కోణాలను మొత్తం కప్పేసి, స్టార్ మా లో ఎడిటెడ్ వెర్షన్ ని టెలికాస్ట్ చేస్తున్నారు. ఇది నిజంగా చాలా అన్యాయం అనే అనిపించింది. ఇక ఈరోజు నాగార్జున సోనియా కి బయట పరిస్థితిని నేరుగానే వివరించి చెప్పాడు. ఇది అతి పెద్ద పొరపాటు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి బయట పరిస్థితులను వివరించడం రూల్స్ ప్రకారం తప్పు. కానీ నాగార్జున సోనియా కి నేరుగా హింట్స్ ఇచ్చాడు.
నువ్వు విష్ణు ప్రియా ని ఇలా కామెంట్ చేసావు, ఆమె ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలిసి కూడా నీచంగా మాట్లాడావు, అంతే కాకుండా ఆమె బట్టలు మీద కూడా కామెంట్స్ చేసావు, ప్రేక్షకుల్లో నీ మీద అభిప్రాయం మారడానికి కేవలం ఒకే ఒక్క సంఘటన చాలు, బయట ప్రేక్షకులు నీ గురించి ఇలా అనుకుంటున్నారు, జాగ్రత్త పడు అంటూ నేరుగా హింట్ ఇచ్చేసాడు నాగార్జున. దీంతో సోనియా అలెర్ట్ అయ్యింది. రేపటి నుండి ఆమె నాగార్జున మాటలను మనసులో పెట్టుకొని జాగ్రత్తగా ఆడుతుంది. ఇక యష్మీ సంగతి సరేసరి, ఈమె గురించి సగం సగం చూపిస్తేనే జనాలు చీదరించుకుంటున్నారు, అదే లైవ్ లో ఈమె చేసే పనులు మొత్తాన్ని చూస్తే ఆమె బయటకి వచ్చిన తర్వాత కొట్టినా కొడుతారు,అంతటి సైకో లాగా ప్రవర్తిస్తుంది ఈమె. సీరియల్స్ లో విలన్ గా నటించి జనాలతో ఎంత తిట్టించుకుందో, ఇప్పుడు నిజమైన క్యారక్టర్ తో అంతకు మించి తిట్టించుకుంటుంది. స్టార్ మా టీం ఆమెకి సంబంధించిన అత్యధిక ఫుటేజీ బయటకి రానివ్వకుండా సేవ్ చేస్తున్నారు.