https://oktelugu.com/

Bigg Boss 8 Telugu: ఏ టాస్క్ ఆడని ఆదిత్య ఓం సేవ్ అవ్వడానికి వెనుక ఇంత కథ ఉందా..? మామూలు మాఫియా కాదుగా!

ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు, కానీ ఆయన సేవ్ అయ్యి శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతాడు. ఇది హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద టాస్క్. అసలు ఏ టాస్కు ఆడని ఈయనకి ఎవరు ఓట్లు వేశారు రా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 15, 2024 / 08:52 AM IST

    Bigg Boss Telugu 8(12)

    Follow us on

    Bigg Boss 8 Telugu: మన చిన్నతనం లో ఉన్నప్పుడు విడుదలైన ‘లాహిరి లాహిరి లాహిరి’ చిత్రంలోని ఆదిత్య ఓం కి, ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఆదిత్య ఓం కి మధ్య ఉన్న వ్యత్యాసం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అప్పట్లో ఆయన ఎంతో యాక్టీవ్ గా ఉండేవాడు, ఎంతో ఎనర్జీ తో డైలాగ్స్ చెప్పేవాడు, ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ వేసేవాడు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం హీరో రామ్ ఎలా ఉండేవాడో, అప్పట్లో ఆదిత్య ఓం అలా ఉండేవాడు. కానీ ఆయన ఆన్ స్క్రీన్ పర్సనాలిటీ కి, ఆఫ్ స్క్రీన్ పర్సనాలిటీ కి ఇంత తేడా ఉంటుందని ప్రేక్షకులు కలలో కూడా ఊహించలేదు. ఆదిత్య ఓం ఈ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టబోతున్నాడు అనే వార్త రాగానే ఆయనే టైటిల్ విన్నర్ అని అందరూ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు.

    ఎందుకంటే చాలా కాలం నుండి ప్రేక్షకులకు ముఖ పరిచయం ఉన్నోడు అని. కానీ హౌస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అసలు ఈయనని బిగ్ బాస్ టీం వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, అనవసరంగా వాళ్లకు డబ్బులు బొక్క, ఒక్క టాస్కు ఆడలేడు, ఎంటర్టైన్మెంట్ అందించలేడు, మౌనం గా ఒక మూలాన కూర్చుంటాడు. ఆయన వాలకం చూస్తుంటే అసలు బిగ్ బాస్ హౌస్ లోకి రావడం తనకి ఇష్టమే లేదని, బిగ్ బాస్ టీం వాళ్ళే ఆయనని బ్రతిమిలాడి హౌస్ లోకి తీసుకొచ్చినట్టుగా ఉంది. హౌస్ లో జరిగే ఏ సంఘటనకు కూడా తనకు సంబంధం లేదు అన్నట్టుగానే ఉంటున్నాడు. ఆదిత్య ఓం కి దాదాపుగా 50 ఏళ్ళు ఉంటుంది. ఆయన గత సీజన్ లో శివాజీ లాగా పెద్దరికం తీసుకొని హౌస్ ని ఒక ఆట ఆదుకుంటాడు అనే అంచనాలు ఉండేవి ఆయన మీద. కానీ మనిషి చూస్తే చాలా మెతకగా ఉన్నాడు, ఇంకా బిగ్ బాస్ గేమ్ లోకి ఆయన అడుగుపెట్టలేదు. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్ లోకి వచ్చిన శేఖర్ బాషా తో పాటుగా వస్తాడు ఆదిత్య ఓం.

    అందరూ ఆదిత్య ఓం ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు, కానీ ఆయన సేవ్ అయ్యి శేఖర్ బాషా ఎలిమినేట్ అవుతాడు. ఇది హౌస్ మేట్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా పెద్ద టాస్క్. అసలు ఏ టాస్కు ఆడని ఈయనకి ఎవరు ఓట్లు వేశారు రా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ట్వీట్స్ వేశారు. కానీ ఆయన బలమైన పీఆర్ టీం ని సెటప్ చేసుకొని దిగాడు అని తర్వాత తెలిసింది. మహారాష్ట్ర లోని కొన్ని కన్సల్టెన్సీల ద్వారా ఆదిత్య ఓం కి భారీ ఎత్తున ఓటింగ్ పడుతుంది. కేవలం ఒకటి రెండు వారాలు కాదు, ఆ కన్సల్టెన్సీలు ఆదిత్య ఓం ని 9 వారాల వరకు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ చేయగలవు, కాబట్టి ఆదిత్య ఓం అసలు ఏమి ఆడకుండా హౌస్ లో గమ్ముగా కూర్చున్నా కూడా ఆయన 9 వారాలు కొనసాగుతారు అన్నమాట.