https://oktelugu.com/

OTT Movies: ఓటిటి ని షేక్ చేస్తున్న తెలుగు చిన్న బడ్జెట్ టాప్ 3 సినిమాలు ఇవే…

తెలుగులో ఉన్న చాలా మంది హీరోలు ఎలాంటి గుర్తింపును అయితే సంపాదించుకున్నారో, అలాంటి గుర్తింపు కోసమే చాలా మంది యంగ్ హీరోలు పరితపిస్తూ అంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 24, 2024 / 09:15 AM IST

    OTT Movies

    Follow us on

    OTT Movies: తెలుగు సినిమా ఆడియన్స్ ప్రస్తుతం వైవిధ్యాన్ని కోరుకుంటున్నారు. ఎందుకంటే రోటీన్ రొట్ట ఫార్ములా సినిమాలను చూడడానికి వాళ్ళు ఆసక్తి అయితే చూపించడం లేదు. కారణం ఏదైనా కూడా వాళ్ళు కొత్త కంటెంట్ ని ఎంకరేజ్ చేస్తూన్నారు. నిజానికి కొత్త స్టోరీ తో వచ్చేది సినిమా గానీ షార్ట్ ఫిలిం గానీ వెబ్ సిరీస్ కావచ్చు ఏదైనా కూడా ప్రేక్షకులు ఆ కంటెంట్ ను ఆదరిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫామ్ లో వస్తున్న చాలా సినిమాలు మంచి విజయాలను సాధిస్తున్నాయి. నిజానికి థియేటర్లో రిలీజ్ అయ్యి మంచి విజయాలను సాధించిన సినిమాలు ఓటిటి ప్లాట్ ఫామ్ లోకి వచ్చి సూపర్ సక్సెస్ లను సాధిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి సమయంలో డైరెక్ట్ గా ఓటిటి లోకి వచ్చిన సినిమాలు కూడా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి… ఇక అందులో భాగంగానే ప్రస్తుతం ఒక మూడు సినిమాలు మాత్రం ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకొని ఆయా ఒటిటి ప్లాట్ ఫామ్స్ ను షేక్ చేస్తున్నాయనే చెప్పాలి. ఇంతకీ ఆ సినిమాలు ఏంటి అంటే…

    ఆయ్

    నార్నే నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమా విపరీతమైన హైప్ ని క్రియేట్ చేసుకొని మంచి విజయాన్ని సాధించింది. నిజానికి ఆగస్టు 15వ తేదీన భారీ చిత్రాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకుడిలో ఒక మంచి అటెన్షన్ ను క్రియేట్ చేయడమే కాకుండా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో కూడా మంచి బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో నితిన్ మరొక సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇంతకుముందు ‘మాడ్ ‘ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన ప్రస్తుతం ఆయ్ సినిమా తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా ఒక టేస్ట్ ఉన్న హీరోగా కూడా ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా ఒటిటి ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ లో మంచి వ్యూయర్ షిప్ ని దక్కించుకుంటూ ఈ సినిమా ముందుకు సాగుతుందనే చెప్పాలి…

    కమిటీ కుర్రాళ్ళు

    ఇక గోదావరి జిల్లాలోని ఒక జాతర ను బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక నిజానికైతే ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడమే కాకుండా 90 స్ కిడ్స్ కి ఒక మెమారబుల్ మూవ్మెంట్ గా కూడా మారిందనే చెప్పాలి. ఇక ఈ సినిమాని చూడడానికి జనం విపరీతమైన ఆసక్తిని కనపరుస్తున్నారు. ఈ సినిమా థియేటర్ లో సూపర్ సక్సెస్ అయినట్టుగానే ఓటిటి ప్లాట్ ఫామ్ లో కూడా విపరీతమైన పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమా ఈటీవీ విన్ లో అవలేబుల్ లో ఉంది…

    బెంచ్ లైఫ్

    తమిళ్ నటుడు అయిన వైభవ్ మెయిన్ లీడ్ లో చేసిన బెంచ్ లైఫ్ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోనే రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని దక్కించుకోవడమే కాకుండా ప్రేక్షకులందరికీ బాగా నచ్చింది. ఇక సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తుంది…