https://oktelugu.com/

Horoscope Today: ఈ నాలుగు రాశుల వ్యాపారులు జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే?

కొన్ని వార్తలు నిరుత్సాహపరుస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మనసు ఆందోళనకరంగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 8, 2024 / 08:47 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: కొన్ని రాశుల ప్రకారం వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు. గ్రహాల మార్పు కారణంగా మంగళవారం సౌభాగ్య యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశుల వారికి ఉల్లాసంగా గడుపుతారు. మరికొన్ని రాశుల వ్యాపారులు విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు చంద్రుడు ధనస్సు రాశిలో సంచరించనున్నాడు. ఈ సందర్భంగా మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

    మేష రాశి:
    కొన్ని వార్తలు నిరుత్సాహపరుస్తాయి. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మనసు ఆందోళనకరంగా ఉంటుంది.

    వృషభ రాశి:
    రాజకీయాల్లో ఉండేవారికి అనుకూల వాతావరణం. వ్యాపారులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆస్తికి సంబంధించి ఓ విషయం కొలిక్కి వస్తుంది.

    మిథున రాశి:
    జీవిత భాగస్వామితో విభేదాలు ఉంటాయి. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు. విహారయాత్రలకు ప్లాన్ చేరస్తారు. సోమరితనాన్ని వీడిన తరువాతే కొన్ని పనులు పూర్తవుతాయి.

    కర్కాటక రాశి:
    వ్యాపారులు కొత్త ప్లాన్లు వేస్తారు. ఉద్యోగులకు పై అధికారుల నుంచి విభేదాలు ఉండే అవకాశం. మాటలను అదుపులో ఉంచుకోవాలి. సాయంత్రం ఉల్లాసంగా ఉంటారు. జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేస్తారు.

    సింహారాశి:
    వ్యాపారులు లాభాలను కోల్పోవాల్సి వస్తుంది. కొత్త పెట్టుబడులపై కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. మానసికంగా గందరగోళంగా ఉంటారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    కన్య రాశి:
    ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఉన్నత విద్య కోసం ఆరాటపడుతారు. ఏదైనా ఆస్తి కొనుగోలు చేయాల్సి వస్తే జాగ్రత్తగా ఉండాలి. కొత్త వ్యక్తులతో ఎక్కువగా మాట్లాడకుండా ఉండాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

    తుల రాశి:
    సాయంత్రి ప్రయాణాలు ఉంటాయి. ఆహ్లదకరమైన వాతావరణంలో గడుపుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడుతారు. ఎవరికైనా సాయం చేయడానికి ముందుకు వస్తారు. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

    వృశ్చిక రాశి:
    కుటుంబ సభ్యులతో వాగ్వాదం ఉండే అవకాశం. ఆర్థిక పరిస్థితి దిగజారవచ్చు. దూర ప్రయరణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో సరదాగా ఉంటారు. ఆదాయం పెరుగుతుంది. వ్యయాలు కూడా ఉంటాయి.

    ధనస్సు రాశి:
    స్నేహితుల సాయంతో ఉద్యోగాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత స్నేహితులను కలుస్తారు. సాయంత్రం ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారులు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి.

    మకర రాశి:
    ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. తల్లిదండ్రుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిపాలవుతారు. కుటుంబంతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెడుతారు.

    కుంభరాశి:
    జీవితభాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగులు కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విహారయాత్రలకు ప్లాన్ చేరస్తారు. మాటలను అదుపులో ఉంచుకోవాలి.

    మీనరాశి:
    ఆర్థిక లావాదేవీలపై పట్టు సాధిస్తారు. ప్రయాణాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. విహార యాత్రలకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా ఉంటారు. కొన్ని విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.