Bigg Boss Telugu 8: చెప్పినట్టుగానే ఈ సీజన్ లో ట్విస్టులు మామూలు రేంజ్ లో లేవు. ముఖ్యంగా మణికంఠ, రోహిణి, గౌతమ్ వంటి కంటెస్టెంట్స్ ఇచ్చిన ట్విస్టులకు ఆడియన్స్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయి. టాప్ 5 లో కచ్చితంగా ఉంటాడు అనుకున్న మణికంఠ, ఆరోగ్యం సహకరించకపోవడంతో తనకి తాను ఎలిమినేట్ అవ్వడం. ఆరోజు ఎలిమినేట్ అవ్వాల్సిన గౌతమ్ గేమ్ చేంజర్ గా నిలిచి, ఆట మొత్తాన్ని మార్చి టైటిల్ రేస్ లోకి రావడం. కమెడియన్స్, వీళ్ళు కేవలం హౌస్ లో ఎంటర్టైన్మెంట్ మాత్రమే ఇవ్వగలరు, టాస్కులు ఆడలేరు అనుకున్న టేస్టీ తేజ, అవినాష్, రోహిణి వంటి వారు విశ్వరూపం చూపించి అద్భుతంగా టాస్కులు ఆడడం వంటివి జరిగాయి. ముఖ్యంగా రోహిణి లో ఇంత సత్తా ఉందా అని హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ఆడియన్స్ కూడా ఆశ్చర్యపోయారు. గత వారం టాస్కులలో ఈమె గెలిచిన తీరు బిగ్ బాస్ హిస్టరీ లోనే ఒక చరిత్ర.
ఈ వారం కూడా ఆమె అదే ఉత్సాహంతో టాస్కులు ఆడుతూ ముందుకు దూసుకుపోతుంది. నిన్న జరిగిన ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులలో రోహిణి రెండు టాస్కుల్లోనూ ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. స్పీడ్, బ్యాలన్స్ అంశాల మీద జరిగిన ఈ టాస్కులలో రోహిణి ఊహించిన దానికంటే అద్భుతంగా ఆడడం సంచాలక్ పాత్రలను పోషించడానికి హౌస్ లోకి అడుగుపెట్టిన అఖిల్,హారికలు కూడా ఆశ్చర్యపోయారు. మొదటి టాస్క్ లో లిమిట్ లెస్ అనే పదాన్ని, క్రమపద్ధతిలో టేబుల్ మీద ‘ఇంద్ర ధనస్సు’ ఆకారం లో అమర్చాలి. స్విమ్మింగ్ పూల్ లో పాదాలకు సంబంధించిన బ్లాక్ ఉంటాయి. వాటిని రాడ్ తో తీసుకొని, కంటెస్టెంట్స్ కి సంబంధించిన టేబుల్స్ వద్దకు వెళ్ళాలి. దీనికే చాలా సమయం పడుతుంది. కానీ రోహిణి అతి వేగంగా ఈ పని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె జెట్ స్పీడ్ లో పాదాలను ఇంద్ర ధనస్సు ఆకారంలో ఉన్న వంతెన లాగా నిర్మించి గంట కొట్టేసింది.
ఈమె తర్వాత గౌతమ్, విష్ణు ప్రియ ఈ టాస్కుని పూర్తి చేయగా, టేస్టీ తేజ మాత్రం పూర్తి చేయలేకపోతాడు. అలా మొదటి టాస్కు పూర్తి అవుతుంది. ఇక రెండవ టాస్కు ‘తూలభారం’ లో కూడా రోహిణి విజయం సాధిస్తుంది. అయితే ఈ టాస్కులో ఆమె విజయం సాధించడానికి సంచాలక్స్ కూడా ఒక కారణం అయ్యారు కానీ, ఇక్కడ ఆమెకి అదృష్టం కలిసి వచ్చిందనే చెప్పాలి. మొదట గౌతమ్ ఈ టాస్కుని పూర్తి చేస్తాడు. కానీ గంట కొట్టడం ఆలస్యం చేస్తాడు. దీంతో రోహిణి అతని చేతిలో ఉన్న గంటని లాక్కొని కొడుతోంది. దీంతో ఆమెని విన్నర్ గా ప్రకటిస్తారు. అంతే కాకుండా రోహిణి కి బరువుని సమతూలయంగా పెట్టేందుకు కావాల్సినంత సమయం ఇచ్చారు సంచాలక్స్, దీనిపై సోషల్ మీడియా లో కాస్త అసంతృప్తి వ్యక్తం అవుతుంది. ఏది ఏమైనా రోహిణి మాత్రం ఈ రెండు టాస్కులు అద్భుతంగానే ఆడింది. మొట్టమొదటి కంటెండర్ అయ్యింది.