హాస్యం పండించే ఒక నటుడి వెనుక ఎంతో బాధలు ఉంటాయి. ఒక నటుడు ఎంత బాధ పడితే అంత హాస్యాన్ని అందించగలడు అని పవన్ కళ్యాణ్ ఒక సినిమా ఫంక్షన్ లో మాట్లాడుతాడు. ఈ మాటలు అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన చెప్పిన మాటలని బాగా పరిశీలించి చూస్తే, ప్రతీ హాస్య నటుడి జీవితంలో ఎన్నో విషాద సంఘటనలు చోటు చేసుకొని ఉంటాయి. విషాదం లేని మనిషి ఈ భూమి మీద ఉండరు అనుకోండి. కానీ వీళ్ళు అంత విషాదాన్ని అనుభవించి కూడా నలుగురికి నవ్వులు పంచుతున్నారు అంటే చాలా గొప్ప విషయం. ఆ జాబితాలోకి ఈ సీజన్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన అవినాష్ కూడా చేరుతాడు. బిగ్ బాస్ అనే రియాలిటీ షో లేకపోతే ఈరోజు అవినాష్ కి జీవితమే ఉండేది కాదు. ఈ విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.
ఒకానొక సమయంలో ఆయన పూర్తిగా అప్పుల్లో మునిగిపోయి, ఆత్మహత్య చేసుకునే ఆలోచనలు కూడా వచ్చాయి. అలాంటి సందర్భంలో అవినాష్ కి యాంకర్ శ్రీముఖి అండగా నిలబడింది. అంతే కాదు అవినాష్ జీవితం లో మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. దానిని ఈరోజు ఎపిసోడ్ లో ఆయన తన తోటి కంటెస్టెంట్స్ తో పంచుకున్నాడు. అవినాష్, అనుజా దంపతులు తమ సంతానం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారట. కొడుకు పుడితే ఆ పేరు పెట్టుకోవాలి, కూతురు పుడితే ఆ పేరు పెట్టుకోవాలని చాలా అనుకున్నారట. వాళ్ళ కోరిక మేరకే బిడ్డ పుట్టింది. కానీ ఆ బిడ్డకి ప్రాణం లేదు. అవినాష్ ఆ బిడ్డకి ఊపిరి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేసాడట, కానీ డాక్టర్లు మాత్రం ఇక లాభం లేదు అని చెప్పారట. ఆ బిడ్డ చూసేందుకు చాలా బొద్దుగా, మంచి రంగుతో ఎంతో ముచ్చటగా ఉన్నాడు అంటూ అవినాష్ తల్చుకొని బాధపడ్డాడు.
అతను ఏడవగానే హౌస్ మేట్స్ అందరూ పైకి లేచి అతని వద్దకు వచ్చారు. ఇన్ని రోజులు ఈ విషయాన్ని చెప్పకుండా దాచుకున్నాను, ఇప్పుడెందుకు చెప్తున్నాను అంటే, నాకు పిల్లలు ఉన్నారని జనాలు అనుకోవచ్చు, అందుకే చెప్తున్నాను అని అన్నాడు. అవినాష్ బాధపడడం ని చూసి ప్రేరణ చాలా మంచి మాటలు చెప్తుంది. ఆమె మాట్లాడుతూ ‘ఏమి బాధపడకు..నీకు త్వరలోనే ఆ బిడ్డ మళ్ళీ తిరిగి వస్తాడు. నా లాంటి కూతురు కూడా నీకు పుడుతుంది. ఒకేసారి డబుల్ బొనాంజా లాగా నీకు కవల పిల్లలు పుడతారు’ అని చెప్పుకొచ్చింది. అయితే అవినాష్ ఈ విషయాన్ని ఓట్ల కోసం ముందు ఎపిసోడ్స్ లోనే చెప్పి సానుభూతి కోసం వాడుకోవచ్చు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఒక్కసారి కూడా ఆయన మాటవరుసకి కూడా ఈ విషయాన్ని ఇన్ని రోజుల బిగ్ బాస్ హౌస్ లో బయటకి చెప్పలేదు. ఇది ఆయన క్యారక్టర్ ఎంత గొప్పదో చెప్తుంది.