Bigg Boss Telugu 8: ప్రేరణపై పగతో రగిలిపోయిన పృథ్వీ..ఇద్దరిలో తప్పు ఎవరిది? నయనీ పై ప్రేరణ నోరు పారేసుకోవడం న్యాయమేనా!

తేజా తనకి ఆరోగ్యం బాగాలేకపోయిన కూడా తన వంతు కృషి చేసానని, టాస్కులు కూడా శక్తికి మించి ఆడను అని వాటర్ టాస్క్ లో అదుపు తప్పి క్రింద పడిపోయి ఊపిరి ఆడలేని పరిస్థితి కూడా ఏర్పడిందని తేజా చెప్పుకొచ్చాడు.

Written By: Vicky, Updated On : October 15, 2024 8:03 am

Bigg Boss Telugu 8(113)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న జరిగిన నామినేషన్స్ ఎపిసోడ్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య ఏ స్థాయిలో గొడవలు అయ్యేలా చేసిందో మన కళ్లారా చూసాము. ఈ గొడవల్లో అవినాష్,గౌతమ్, రోహిణి వి హైలైట్ గా నిల్చింది. ఆ తర్వాత ప్రేరణ, పృథ్వీ మధ్య జరిగిన గొడవ ఇంకా హైలైట్ అయ్యింది. అసలు గొడవ ఎక్కడ మొదలైందంటే కిల్లర్ హ్యాట్ ని ప్రేరణ అందుకుంటుంది. రెడ్ బోర్డ్స్ మీద తమకు పాయింట్స్ ఉన్న కంటెస్టెంట్స్ కి నామినేషన్స్ వేసేందుకు గంగవ్వ, నిఖిల్ వస్తాడు. ముందుగా నిఖిల్ టేస్టీ తేజ కి నామినేషన్ వేస్తూ హోటల్ టాస్క్ లో పెద్దగా ఆడినట్టు ఎక్కడా కనిపించలేదని, కామెడీ కూడా పెద్దగా చేయలేదని, వరస్ట్ పెరఫార్మెర్ అవ్వడం వల్లే నీకు బిగ్ బాస్ శిక్ష విధించాడని, కాబట్టి నా నామినేషన్ నీకే అని తేజా కి వేస్తాడు.

తేజా తనకి ఆరోగ్యం బాగాలేకపోయిన కూడా తన వంతు కృషి చేసానని, టాస్కులు కూడా శక్తికి మించి ఆడను అని వాటర్ టాస్క్ లో అదుపు తప్పి క్రింద పడిపోయి ఊపిరి ఆడలేని పరిస్థితి కూడా ఏర్పడిందని తేజా చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత గంగవ్వ పృథ్వీ కి నామినేషన్ వేస్తుంది. నువ్వు ఈ వారం ఆడినట్టు నాకు అసలు అనిపించలేదు, ఇంట్లో పనులు కూడా నువ్వు ఎప్పుడూ చేయవు, ఎంతసేపు ఆ మూలాన కూర్చొని సిగరెట్లు తాగుతుంటావ్ తప్ప, ఈ వారం నువ్వు గేమ్ ఏమి ఆడలేదు అని, నేను మహారాణి పాత్ర పోషిస్తే నా వద్దకు కూడా రాలేదని అంటుంది. అప్పుడు పృథ్వీ దానికి సమాధానం చెప్తూ ‘నేను హౌస్ లో పనులు చేయడం లేదని మీరెలా చెప్తారు. నాకు డైనింగ్ టేబుల్ క్లీన్ చేయమని చెప్పారు, అది నేను చేశాను, నేను చేసే పనులు మీరు చూడలేదు’ అని అంటుంది. అప్పుడు ప్రేరణ నిఖిల్, గంగవ్వ నామినేషన్స్ లో గంగవ్వ నామినేషన్ ని తీసుకొని పృథ్వీ ని నామినేట్ చేస్తుంది. దానికి ప్రేరణ వివరణ ఇస్తూ ‘తేజా కి ఆరోగ్యం బాగాలేకపోయిన తన వైపు నుండి వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నం చేసాడు. కానీ నీకు 100 శాతం బెస్ట్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా ఇవ్వలేదు, అందుకే నేను గంగవ్వ నామినేషన్ ని అంగీకరించి నిన్ను నామినేషన్స్ లోకి పంపిస్తున్నాను’ అని అంటుంది ప్రేరణ. ఆమె పాయింట్ కరెక్ట్ గానే ఉంది, కానీ పృథ్వీ అందుకు బాగా మనస్తాపానికి గురయ్యాడు, ప్రేరణ ని నామినేట్ చేసే వరకు ఊరుకోను అని అంటాడు.

ఆమె హ్యాట్ తీసుకోవడానికి పరిగెత్తినప్పుడల్లా పృథ్వీ అడ్డుపడ్డాడు. మధ్యలో నిఖిల్, యష్మీ పృథ్వీ ని కంట్రోల్ చేసేందుకు చాలా ప్రయత్నం చేసారు, కానీ పృథ్వీ మాత్రం తగ్గలేదు. మీరు మధ్యలో దూరి ఆమెకి సహాయం చేస్తే మీతో కూడా గొడవ పడుతాను అని వార్నింగ్ ఇస్తాడు. పృథ్వీ లాగానే నయనీ పావని కూడా ప్రేరణ ని నామినేషన్స్ లోకి రావాలని కోరుకుంటుంది. అలా పృథ్వీ నయనీ ఇద్దరు కలిసి ప్రేరణ ని అడ్డుకునే ప్రయత్నం చేసారు. ఆ తర్వాత ప్రేరణ నయనీ ని పిలిచి, దయచేసి అడ్డురాకు అని అంటుంది, కానీ నయనీ అందుకు ఒప్పుకోదు, దీంతో ప్రేరణకి కోపం వచ్చి సరే ‘పో’ అని కోపం గా అంటుంది. దీనికి నయనీ పావని నీకు నన్ను అలా అరిచే అర్హత లేదు అంటూ వార్నింగ్ ఇస్తుంది.