Horoscope Today: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ఫలితాలతో కొందరి జీవితాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. మంగళవారం ద్వాదశ రాశులపై ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. అలాగే ఈరోజు వృద్ధి యోగం ఏర్పడనుంది. ఈ కారణంగా కొన్ని రాశుల వారికి అనుకోకుండా డబ్బు అందుతుంది. కొందరు ఉద్యోగులు ప్రమోషన్ పొందుతారు. మరికొన్ని రాశుల వారు మాటలను అదుపులో ఉంచుకోవాలి. మేషం నుంచి మీనం వరకు 12 రాశుల ఫలితాల ఈ విధంగా ఉన్నాయి.
మేష రాశి:
వ్యాపారులు బిజీ వాతావరణంలో ఉంటారు. కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాల్సి వస్తుంది. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడుతారు. సాయంత్రం జీవిత భాగస్వామి కోసం సమయాన్ని వెచ్చిస్తారు.
వృషభ రాశి:
ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు చేరుతారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల్లో ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ఆస్తికి సంబంధించిన విషయాల్లో శుభవార్త వింటారు.
మిథున రాశి:
ఉద్యోగులు తోటి వారితో ఉల్లాసంగా ఉంటారు. మానసికంగా ఆందోళనకు గురవుతారు. సాయంత్రం అనుకోకుండా డబ్బు వచ్చి చేరుతుంది. వ్యాపారులకు ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.
కర్కాటక రాశి:
ఉద్యోగులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరిస్తారు. వ్యాపారులకు సోదరుల మద్దతు ఉంటుంది. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు.
సింహారాశి:
సమాజంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టాలని అనుకుంటే ఈరోజు కలిసి వస్తుంది. సాయంత్రం స్నేహితులతో కలిసి ఉల్లాసంగా ఉంటారు. కష్టపడిన వారికి ఈరోజు ఫలితాలు ఉంటాయి.
కన్య రాశి:
వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. కొందరు ధన సహాయం చేస్తారు. భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని కొన్ని విభాగాల్లో ఇన్వెస్ట్ మెంట్ చేస్తారు. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉంటాయి.
తుల రాశి:
జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. ప్రియమైన వారి కోసం బహుమతులు కొంటారు. విలాసాలకు డబ్బు ఖర్చు అవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే నష్టాలు మిగులుతాయి.
వృశ్చిక రాశి:
కుటుంబ సభ్యుల కోసం కొన్ని పనులు పూర్తి చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. వ్యాపారులు కొత్త వ్యక్తులతో ఒప్పందాలుచేసుకుంటారు.
ధనస్సు రాశి:
పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అయితే ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. వివాహానికి అర్హులైతే ప్రతిపాదనలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
మకర రాశి:
మానసికంగా ఒత్తిడికి గురవుతాయి. కొత్త వారితో స్నేహం చేసేటప్పడు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు.
కుంభరాశి:
ప్రత్యర్థుల ఆటంకాలను ఎదురిస్తారు. రిస్క్ తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. వ్యాపారులు కొత్త ప్రణాళికలో చేపడుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం.
మీనరాశి:
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. అదనపు ఆదాయం కోసం చూసేవారు శుభవార్తలు వింటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునేవారు శుభవార్త వింటారు.