https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హౌస్ నుండి ప్రేరణ, అవినాష్ అవుట్.. ప్రేరణకి దారుణమైన అన్యాయం చేసిన బిగ్ బాస్!

వీళ్లిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ 3 గా మిగిలారు. మిగిలిన ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ రేపు జరగబోతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2024 / 09:22 PM IST
    Follow us on

    Bigg Boss Telugu 8  : ఈ సీజన్ బిగ్ బాస్ 8 ఎట్టకేలకు చివరి రోజుకి చేరుకుంది. రేపు సాయంత్రం 7 గంటల నుండి బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ కాబోతుంది. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ సగానికి పైగా నేడు పూర్తి చేసారు. ఈ ఎపిసోడ్ లో అవినాష్ 5 వ స్థానంలోనూ, ప్రేరణ 4 వ స్థానంలోనూ ఎలిమినేట్ అయ్యారట. టాప్ 4 కంటెస్టెంట్స్ హౌస్ లో ఉన్నప్పుడు బిగ్ బాస్ సూట్ కేసు ఆఫర్ చేశారట. చాలా సేపటి వరకు నాగార్జున నలుగురిలో ఎవరో ఒకరు సూట్ కేసు తీసుకునేలా ఒప్పించడానికి ప్రయత్నం చేశారట. కానీ ఎవ్వరూ ఈ ఆఫర్ కి ఒప్పుకోలేదు. కనీసం అవినాష్ కి ఈ ఆఫర్ వచ్చేలా చేసి ఉన్నా బాగుండేది, అతనికి కాస్త సహాయపడేది అని సోషల్ మీడియా లో ఈ విషయం తెలుసుకున్న నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    ఇదంతా పక్కన పెడితే ప్రేరణ నాల్గవ స్థానంలో ఎలిమినేట్ అవ్వడంపై సోషల్ మీడియా లో నెటిజెన్స్ నుండి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. కారణం యూట్యూబ్ పోల్స్ పోల్స్ దగ్గర నుండి ఇంస్టాగ్రామ్ పోల్స్ వరకు ప్రతీ దాంట్లోనూ ప్రేరణ టాప్ 3 స్థానం లో కొనసాగింది. అలాంటి అమ్మాయి నాల్గవ స్థానం లో ఎలిమినేట్ అవ్వడం ఏమిటి అని ప్రేక్షకులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ విశ్లేషకులు చెప్పేది ఏమిటంటే నబీల్ ని తక్కువ అంచనా వేయొద్దు అని మొదటి నుండి చెప్తూనే ఉన్నామని, నబీల్ కి తెలుగు ఆడియన్స్ నుండి సపోర్టు తక్కువ ఉండొచ్చు గాక, కానీ నార్త్ ఇండియా లో అతనికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని, ఒక్కసారి అతని ఇంస్టాగ్రామ్ అకౌంట్ ని ఓపెన్ చేసి చూసి అతని రీచ్ ని చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాక్ అవుతుందని అంటున్నారు.

    నబీల్ కేవలం టాప్ 3 స్పాట్ లోనే కాదు, టాప్ 2 లేదా టైటిల్ విన్నర్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదని, రేపు బిగ్గెస్ట్ ట్విస్ట్ కి సిద్ధం అవ్వండి అంటూ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నబీల్ సోదరుడు వరంగల్ మొత్తం తన తమ్ముడికి ఓట్లు వేసేలా చాలా కష్టపడ్డాడని, యూట్యూబ్ కమ్యూనిటీ పోల్స్ కి ఈసారి అతి పెద్ద ఛాలెంజ్ గా ఫలితం ఉండబోతుందని టాక్. అయితే చాలా మంది అభిప్రాయం ఏమిటంటే, ప్రేరణ మీద ఏర్పడిన నెగటివిటీ కి ఆమె ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండడమే ఎక్కువ, ఎప్పుడో వెళ్లిపోవాల్సింది, కేవలం ఆమెకు ఉన్నటువంటి అతి పెద్ద పీఆర్ టీం కారణంగానే ఇంత దూరం నెట్టుకొచ్చింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీళ్లిద్దరు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్ టాప్ 3 గా మిగిలారు. మిగిలిన ఎపిసోడ్ కి సంబంధించిన షూటింగ్ రేపు జరగబోతుంది.