Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ ఫినాలే లో బోలెడన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయి. ఈ సీజన్ కి ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రాబోతున్నాడని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అందులో ఎలాంటి నిజం లేదని , ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడని ఖరారు అయ్యింది. రామ్ చరణ్ చేతుల మీదుగానే సీజన్ టైటిల్ విన్నర్ కప్ అని ఎత్తబోతున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో రామ్ చరణ్ కి అనేక మంది అభిమానులు ఉన్నారు. రేపు వీళ్ళు రామ్ చరణ్ ని చూడగానే ఎంత ఉత్సాహపడుతారో చూడాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు, మొదటి ఎపిసోడ్ నుండి ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన ప్రతీ కంటెస్టెంట్ తో రామ్ చరణ్ కాసేపు సరదాగా మాట్లాడబోతున్నాడు.
కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, విజయ్ సేతుపతి కూడా ఈ ఫినాలే కి రాబోతున్నాడు. విజయ్ సేతుపతి తమిళం లో బిగ్ బాస్ సీజన్ 8 కి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. గత 7 సీజన్స్ కి కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా, ఈ సీజన్ నుండి విజయ్ సేతుపతి హోస్టింగ్ బాధ్యతలను అందుకున్నాడు. ఆయన హోస్టింగ్ కి అక్కడ మంచి మార్కులే పడ్డాయి. అంతే కాకుండా వచ్చే వారం ప్రముఖ కన్నడ హీరో ఉపేంద్ర నటించిన UI చిత్రం విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం ఆయన ఫినాలే ఎపిసోడ్ కి విచ్చేసాడట. అలాగే నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం ‘డాకు మహారాజ్’ టీం కూడా ఈ ఈవెంట్ కి వచ్చారట. కానీ హీరో బాలయ్య మాత్రం రాలేదు. అదే విధంగా సాయి ధరమ్ తేజ్ కూడా ఒక అతిథిగా వచ్చాడట.
రీసెంట్ గానే ఆయన నటించిన ‘సంబరాల ఎటి గట్టు’ అనే చిత్రానికి సంబంధించిన టీజర్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ టీజర్ కి ప్రొమోషన్స్ లో భాగంగా ఆయన వచ్చినట్టు సమాచారం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ టీం కూడా వచ్చిందట. అల్లు అర్జున్ కాకుండా శ్రీలీల, సుకుమార్ వంటి వారు వచ్చినట్టు తెలుస్తుంది. యంగ్ హీరోయిన్ నబ్బా నటేష్ డ్యాన్స్ పెర్ఫార్మన్స్ కి సంబంధించిన షూట్ కూడా పూర్తి అయ్యిందట. ఇకపోతే రేపు రామ్ చరణ్ చేతుల మీదుగా ఎవరు టైటిల్ కొట్టబోతున్నారు అనే దానిపై సస్పెన్స్ వీడినట్టే. నిఖిల్ టైటిల్ విన్నర్ గా నిలిచాడని, గౌతమ్ రన్నర్ గా నిలిచాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రేపు మధ్యాహ్నం లోపు సోషల్ మీడియా లో రానుంది. ప్రస్తుతం ప్రేరణ, అవినాష్ ఎలిమినేట్ అవ్వగా, హౌస్ లో నిఖిల్, గౌతమ్, నబీల్ మిగిలారు.