https://oktelugu.com/

Bigg Boss Telugu 8: హౌస్ కి కొత్త ‘మెగా చీఫ్’ గా ప్రేరణ..కానీ వచ్చే వారం ఆమెకి ఆ విషయం లో అగ్ని పరీక్ష..ఫెయిల్ అయితే టాప్ 5 నుండి అవుట్!

ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ వచ్చే వారం రోహిణి,అవినాష్,టేస్టీ తేజా ని నామినేషన్స్ లోకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రోహిణి మీద అయితే కన్నడ బ్యాచ్ పగబట్టేసింది. ఇప్పుడు ప్రేరణ రోహిణి ని ఒకవేళ నామినేషన్స్ నుండి సేవ్ చేస్తే తనకి స్నేహితులైన యష్మీ, పృథ్వీ, నిఖిల్ తో గొడవలయ్యే అవకాశం ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : November 7, 2024 / 07:48 AM IST

    Bigg Boss Telugu 8(206)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు అద్భుతంగా ఆడే కంటెస్టెంట్స్ లో ఒకరు ప్రేరణ. మగవాళ్ళతో సమానంగా ఈమె ఆడే ఆట తీరుకి ఎవరైనా ఫ్యాన్ అవ్వాల్సిందే. ఆమె పొగరు చాలా మందికి నచ్చదేమో కానీ, గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఆదిపులి లాగా రెచ్చిపోతుంది. ప్రతీ టాస్కులోను ఆమె వందకి 200 శాతం తన వైపు నుండి ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆమె ఇప్పుడు టైటిల్ రేస్ లో ఉంది. అయితే ఎంత బాగా ఆడినప్పటికీ ఆమెకు అదృష్టం కలిసిరాక ఇన్ని రోజులు మెగా చీఫ్ అవ్వలేకపోయిందని ఆమె అభిమానులు బాధపడుతూ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా లో అందుకు సంబంధించిన పోస్టులు మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ వారం ఆమె కష్టానికి అదృష్టం కూడా తోడై హౌస్ కి కొత్త మెగా చీఫ్ అయ్యింది. అయితే ఆమె మెగా చీఫ్ అవ్వడానికి రోహిణి కారణం అని చెప్పక తప్పదు.

    ఎందుకంటే మొదట్లో మూడు సూట్ కేసులు తీసుకున్న వారిలో రోహిణి ఒకరు. సూట్ కేసులు తీసుకున్నందుకు మెగా చీఫ్ కంటెండర్ అవుతుంది. ఆ తర్వాత హరితేజ తో టాస్కు ఆడి గెలిచి తన కంటెండర్ షిప్ ని కాపాడుకుంటుంది. అప్పుడు బిగ్ బాస్ ఆరెంజ్ సూట్ కేసు ని మీకు నచ్చిన వాళ్లకు ఇచ్చి మెగా చీఫ్ కంటెండర్ ని చేయమని చెప్పగా, రోహిణి ప్రేరణ కి అవకాశం ఇస్తుంది. ప్రేరణకి రోహిణి అలాంటి అవకాశం ఇవ్వకపోయి ఉండుంటే ఆమెకి ఎవ్వరూ అలాంటి అవకాశం ఇచ్చేవాళ్ళు కాదు, కంటెండర్ రేస్ లో ముందుకు వెళ్లి ఉండేది కూడా కాదు, ఇప్పుడు మెగా చీఫ్ అయ్యేది కాదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే వచ్చే వారం ఒకవేళ రోహిణి నామినేషన్స్ లోకి వస్తే, ప్రేరణ మెగా చీఫ్ కాబట్టి ఆమెని నూటికి నూరు శాతం నామినేషన్స్ నుండి సేఫ్ చేసే అవకాశం ఉంటుంది.

    ఇప్పటికే హౌస్ మేట్స్ అందరూ వచ్చే వారం రోహిణి,అవినాష్,టేస్టీ తేజా ని నామినేషన్స్ లోకి వేయడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా రోహిణి మీద అయితే కన్నడ బ్యాచ్ పగబట్టేసింది. ఇప్పుడు ప్రేరణ రోహిణి ని ఒకవేళ నామినేషన్స్ నుండి సేవ్ చేస్తే తనకి స్నేహితులైన యష్మీ, పృథ్వీ, నిఖిల్ తో గొడవలయ్యే అవకాశం ఉంది. ప్రేరణ మెల్లగా వాళ్లకు దూరమై రోహిణి,అవినాష్, టేస్టీ తేజ లతో మరింత స్నేహం పెంచుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ వచ్చే వారం యష్మీ నామినేషన్స్ లోకి వచ్చి ఆమెని సేవ్ చేయకపోయినా కూడా ప్రేరణ కి పెద్ద తలనొప్పే. ఎందుకంటే యష్మీ ప్రేరణ ని ఎన్నో సందర్భాలలో నామినేషన్స్ నుండి కాపాడింది. ఆమెకు కష్టం వచ్చినప్పుడల్లా అండగా నిలబడి ప్రేరణ కోసం పోరాడింది. కానీ ప్రేరణ ఒక్కసారి కూడా యష్మీ కోసం నిలబడలేదు. ఇలా ప్రేరణ మెగా చీఫ్ అయ్యినప్పటికీ వచ్చే వారం ఈ అగ్ని పరీక్ష ఎదురుకోక తప్పదు. ఎలాంటి స్టెప్ తీసుకున్నా ఆమెకి నెగటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.