Bigg Boss Telugu 8: బిగ్ బాస్ హౌస్ లో తొలిసారి కసిగా గేమ్స్ ఆడిన విష్ణుప్రియ..పృథ్వీ, ప్రేరణ లాంటోళ్లను కూడా డామినేట్ అయిపోయారుగా!!

నిన్న ఆమె ఎంత కసిగా టాస్కులు ఆడిందంటే, ఈమె ధాటికి ప్రేరణ, పృథ్వీ లాంటి తోపు కంటెస్టెంట్స్ కూడా నిలబడలేకపోయారు. కేవలం అదృష్టం కలిసి రాక నిన్న ఆమె ఆ రెండు ఎపిసోడ్స్ లో ఓడిపోయింది కానీ, టాస్కులు మాత్రం వాళ్ళిద్దరి కంటే స్పీడ్ గా ఆడింది.

Written By: Vicky, Updated On : November 7, 2024 7:56 am

Bigg Boss Telugu 8(207)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో మంచి పాపులర్ ఫేస్ గా ప్రీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ గా విష్ణుప్రియ మాత్రమే ఉందని మన అందరికీ తెలిసిందే. ఈమెకు ఉన్న ఫ్యాన్ బేస్ కారణంగానే ఇన్ని రోజులు గేమ్ పెద్దగా ఆడకపోయినా కూడా ఎలిమినేట్ అవ్వకుండా కొనసాగుతూ వచ్చింది. టైటిల్ కొట్టేంత సత్తా ఉన్నప్పటికీ కూడా, ఈమె గేమ్ విషయంలో కసిగా కాకుండా చాలా కూల్ గా ఆడుతూ, తనకి అనిపించింది చేసుకుంటూ వచ్చింది. పృథ్వీ వెనుక తిరగడం ఎవరికీ ఇష్టం లేకపోయినా, ఆమె నిజంగానే ప్రేమిస్తుంది అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ కోణంలో కూడా ఆడియన్స్ నుండి సపోర్టు పొందింది. అయితే ఎంతసేపు ఈ లవ్ ట్రాక్ ఒక్కటేనా, హౌస్ లో ఉన్నందుకు కనీసం ఒక్క గేమ్ అయినా ఆడాలి కదా అని విష్ణు ప్రియ ని తిట్టేవాళ్లే ఎక్కువగా ఉంటారు. విష్ణు ప్రియ నుండి ఆడియన్స్ ఎలాంటి గేమ్ ని అయితే ఆశించారో, అలాంటి గేమ్ నిన్న ఆడి చూపించింది.

నిన్న ఆమె ఎంత కసిగా టాస్కులు ఆడిందంటే, ఈమె ధాటికి ప్రేరణ, పృథ్వీ లాంటి తోపు కంటెస్టెంట్స్ కూడా నిలబడలేకపోయారు. కేవలం అదృష్టం కలిసి రాక నిన్న ఆమె ఆ రెండు ఎపిసోడ్స్ లో ఓడిపోయింది కానీ, టాస్కులు మాత్రం వాళ్ళిద్దరి కంటే స్పీడ్ గా ఆడింది. ‘కీ పట్టు..కంటెండర్ షిప్ కొట్టు’ టాస్క్ లో విష్ణు ప్రియ పృథ్వీ కంటే వేగంగా గోడని బద్దలు కొట్టి కీ ని సంపాదించింది. వెంటనే బాక్స్ ని తెరిచి, కర్ర పట్టుకొని హౌస్ లోపలకి పరుగులు తీసి మరో తాళం కోసం కుండలు బద్దలు కొట్టింది. ఇంత వేగంగా పృథ్వీ కూడా చేయలేకపోయాడు. పృథ్వీ కి ఆరోగ్యం సరిగా లేదు, అతని చేతులకు కూడా దెబ్బలు తగిలాయి, అందుకే ఆయన కాస్త స్లో అయ్యాడు అని అనుకున్నప్పటికీ , ఆ తర్వాత టాస్క్ లో ఈమె ప్రేరణ కంటే వేగంగా ఆడడంని గమనిస్తే విష్ణు ప్రియ లో ఇంత టాలెంట్ ఉందా అని అనిపిస్తుంది. బరువు టాస్క్ లో ఆమె ప్రేరణ కంటే ముందుగా బ్యాగ్ పట్టుకొని ఇసుక గుహలను దాటింది.

అదే విధంగా ఆమె ప్రేరణ కంటే ముందుగా స్విమ్మింగ్ పూల్ దాటింది, ఆమె కంటే ముందుగా బ్యాగులు కూడా టేబుల్ మీదకు విసిరేసింది. కానీ చివర్లో రెప్పపాటు సమయంలో ఆమె ఓడిపోయింది. ఇంత కసిగా, ఇంత బాగా విష్ణు ప్రియ ఆడగలదు అని నిన్ననే ఆడియన్స్ కి అర్థమైంది. ఇంత దూకుడుతో ఆమె మొదటి వారం నుండి టాస్కులు ఆడుంటే ఇప్పుడు కచ్చితంగా ఆమె టైటిల్ రేస్ లో ఉండేది కదా, అనవసరంగా సమయాన్ని మొత్తం వృధా చేసింది అంటూ సోషల్ మీడియా లో ఈమెకు ఓట్లు వేసేవాళ్ళు బాధపడ్డారు. కనీసం ఈ మిగిలిన 5 వారాలు అయినా ఆమె పృథ్వీ జపం మానేసి, ఇదే విధంగా టాస్కులు ఆడితే కచ్చితంగా టాప్ 3 కంటెస్టెంట్స్ లో ఒకరిగా మిగిలే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన విష్ణు ప్రియ ముగ్గురుతో సమానంగా డేంజర్ జోన్ లో ఉన్నింది. నిన్నటి ఎపిసోడ్ తో ఆమె డేంజర్ జోన్ నుండి బయటపడి ఓటింగ్ లో ముందుకెళ్లింది.