https://oktelugu.com/

Donald Trump: అమెరికాలో ట్రంప్‌ 2.0.. స్పష్టమైన మెజారిటీతో వైట్‌ హౌస్‌లోకి..

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నికయ్యారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. స్పష్టమైన మెజారిటీతో ఆయన వైట్‌హౌస్‌లో అడుగు పెట్టుబోతున్నారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : November 7, 2024 / 07:45 AM IST

    Donald Trump

    Follow us on

    Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఘన విజయం సాధించారు. నాలుగేళ్ల విరామం తర్వాత మళ్లీ వైట్‌హౌస్‌లో అడుగు పెట్టబోతున్నారు. ఎన్నికల్లో ట్రంప్‌ స్పష్టమైన మెజారిటీ సాధించారు. దీంతో అమెరికాలో ట్రంప్‌ 2.0 పాలన ప్రారంభం కాబోతోంది. విస్కాన్సిన్‌లో గెలుపుతో మేజిక్‌ ఫిగర్‌ 270ను దాటి 277 ఎలక్టోరల్‌ ఓట్లతో జయ కేతనం ఎగురవేశారు. ఇంకా మూడు రాష్ట్రాల్లో ట్రంప్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆయనకు ఇంకా 30కిపైగా ఎలక్టోర్‌ ఓట్లు దక్కే అవకాశం ఉంది. అధికారం చేజిక్కించుకోవడానికి కీలకమైన స్వింగ్‌ రాస్ట్రాల్లోని జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్‌ రాస్ట్రాలను ట్రంప్‌ గెలుచుకున్నారు. మరో మూడు స్వింగ్‌ స్టేట్స్‌లో ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల్లో 277 ఎలక్టోరల్‌ ఓట్లతో ట్రంప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇప్పటిరకు జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్‌ కరోలినా, కాన్సస్, ఆయోవా, మోంటానా, యుటా, నార్త్‌ డకోటా, వయోమింగ్, సౌత్‌ డకోటా, నెబ్రాస్కా, ఓక్లహోమా, టెక్సాస్, ఆర్కాన్సాస్, లూసియానా, ఇండియానా, కెంటకీ, టెన్నెసీ, మిస్సోరి, మిసిసిపి, ఓహాయో, వెస్ట్‌ వర్జీనియా, అలబామా, సౌత్‌ కరోలినా, ఫోరిడా, ఐడహో, విస్కాన్సిన్‌ రాష్ట్రాలు సొంతం చేసుకున్నారు.

    స్వింగ్‌ స్టేట్స్‌లో ఆధిక్యం..
    ఎన్నికల్లో అత్యంత కీలకమైన స్వింగ్‌ స్టేట్స్‌లోని జార్జియా, నార్త్‌ కరోలినా, పెన్సిల్వేనియా రిపబ్లికన్ల వశమయ్యాయి. నవెడా, మిషిగన్, ఆరిజోనాలోనూ ట్రంప్‌ ముందజలో ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ 224 ఎలక్టోర్‌ సీట్లు గెలిచారు. కాలిఫోర్నియా, ఓరెగన్, వాషింగ్‌టన్, న్యూ మెక్సికో, వర్జీనియా, ఇల్లినయీ, న్యూజెర్సీ, మేరీల్యాండ్, వెర్మాంట్, న్యూయార్క్, కనెక్టికట్, డెలవేర్, మసాచుసెట్స్, రోడ్‌ ఐల్యాండ్, కొలరాడో, హవాయి, న్యూహాంప్‌షైర్, మిన్నెసోటా, డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియాను గెలిచారు.

    ట్రంప్‌ గెలిచిన రాష్ట్రాలివే..
    రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రపం సాధించిన రాష్ట్రాలు చూస్తే అలబామా(9), ఆర్కాన్సాస్‌(6), ఫోరిడా(30), జార్జియా(16), ఆయోవా(6), ఐడహో(4), ఇండియానా(11), కాన్సస్‌(6), కెంటకీ(8), లూసియానా(8), మైన్‌(1), మిస్సోరి(10), మిసిసిపి(6), మోంటావా(4), నార్త్‌ కరోలినా(16), నార్త్‌ డకోటా(3), నెబ్రాస్కా(4) ఓహాయో(17), ఓక్లహోమా(7), పెన్సిల్వేనియా(19), సౌత్‌ కరోలిన(9), సౌత్‌ డకోటా(3), టెన్సె(11), టెక్సాస్‌(40), యుటా(6), వెస్ట్‌ వర్జీనియా(4), వయోమింగ్‌(3), విస్కాన్సిన్‌(10).

    కమలా హారిస్‌ గెలిచిన రాష్ట్రాలు..
    ఇక అధికార డెమొక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలా హారిస్‌ గెలిచినా రాష్ట్రాలు చూస్తే.. కాలిఫోర్నియా(54), కొలరాడో(10), కనెక్టికట్‌(7), డీసీ(3), డెలవేర్‌(3), హవాయి(4), ఇల్లినోయీ(19), మసాచుసెట్స్‌(11), మేరిల్యాండ్‌(10), మైన్‌(1), మిన్నెసోటా(10), నెబ్రాస్కా(1), న్యూహ్యాంప్‌షైర్‌(4), న్యూజెర్సీ(14), న్యూమెక్సికో(5), న్యూయార్క్‌(28), ఓరెగాన్‌(8), రోడ్‌ ఐల్యాండ్‌(4), వర్జీనియా(13), వెర్మాంట్‌(3), వాషింగ్‌టన్‌(12), నెవడా(6), మిషిగన్‌(15), మైన్‌(2), ఆరిజోనా(11), అలస్కా(3).