https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : గౌతమ్ పై నిందలేసి తన గొయ్యి తానే తవ్వుకున్న నిఖిల్..వరస్ట్ సంచాలక్ ప్రేరణ వల్లే నిఖిల్ విన్ అయ్యాడా?

ఈ సీజన్ బిగ్ బాస్ చివరి వారం లోకి అడుగుపెట్టింది. ఈ చివరి వారం లో కంటెస్టెంట్స్ అందరికీ ఆడియన్స్ కి ఓటుని అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ పెట్టిన కొన్ని టాస్కులు మంచి హీట్ వాతావరణంలో జరిగాయి.

Written By:
  • Vicky
  • , Updated On : December 7, 2024 / 08:23 AM IST

    Nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ చివరి వారం లోకి అడుగుపెట్టింది. ఈ చివరి వారం లో కంటెస్టెంట్స్ అందరికీ ఆడియన్స్ కి ఓటుని అప్పీల్ చేసే అవకాశం కల్పిస్తూ బిగ్ బాస్ పెట్టిన కొన్ని టాస్కులు మంచి హీట్ వాతావరణంలో జరిగాయి. ముఖ్యంగా నాగార్జున నుండి గోల్డన్ టికెట్ సంపాదించిన నిఖిల్, గౌతమ్ మరియు రోహిణి మధ్య పెట్టినా కేక్ టాస్క్, ఆ తర్వాత నిఖిల్ కి గౌతమ్ కి మధ్య పెట్టిన రంగుల టాస్క్ చూసేందుకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ముఖ్యంగా కేక్ టాస్క్ ని గౌతమ్ చాలా ఆసక్తికరంగా మార్చేశాడు. అలా మార్చినందుకు హౌస్ మేట్స్ అందరూ అతన్ని రెండు గంటల పాటు పొగుడుతారు. ఇది లైవ్ చూసినవాళ్లకు తెలుస్తుంది. ఇక రంగుల టాస్క్ లో నిఖిల్, గౌతమ్ ఇద్దరూ కూడా పులి, సింహం లాగా తలపడ్డారు. కానీ నిఖిల్ తన నోరుని అదుపు తప్పించి గౌతమ్ పై లేనిపోని నిందలు వేసాడు.

    ఫిజికల్ టాస్కులలో పొరపాటున దెబ్బలు తగలడం సహజం. గౌతమ్ కి సీజన్ 7 లో అలాంటివి చాలానే జరిగాయి, కానీ ఒక్కసారి కూడా అవతల కంటెస్టెంట్స్ మీద నిందలు వేయలేదు. ఈ సీజన్ లో కూడా జరిగింది కానీ వాటిని తన గేమ్ కోసం వాడుకోలేదు. ఇలాంటి అద్భుతమైన లక్షణాలు ఉండడం వల్లనే, అతను వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అయినప్పటికీ జనాలు అతన్ని టాప్ 2 వరకు తీసుకొచ్చారు. నిన్న జరిగిన టాస్కులో మొట్టమొదటిసారి నిఖిల్ గౌతమ్ పై ఫిజికల్ అయ్యాడు. అతన్ని ఎలా పడితే అలా ఈడ్చుకొని వెళ్ళాడు, ఆ తర్వాత ఇష్టమొచ్చినట్టు అవతలకు తోసాడు. కానీ గౌతమ్ ఆట ఫ్లోలో చెంప మీద చెయ్యి చేసుకుంటే అది కావాలని చేసినట్టు రుద్దే ప్రయత్నం చేసాడు నిఖిల్. ఇది ఆయనకి చాలా నెగటివ్ ఎపిసోడ్ గా మారింది, అదే విధంగా గౌతమ్ కి చాలా పాజిటివ్ అయ్యింది.

    సాధారణంగానే మంచి ఓటింగ్ ఉన్న గౌతమ్ ఈ ఎపిసోడ్ తో వేరే లెవెల్ కి వెళ్ళిపోయాడు. ఇక శనివారం రోజు అక్కినేని నాగార్జున కచ్చితంగా గౌతమ్ ని టార్గెట్ చేస్తాడు. అలా చేస్తే మాత్రం గౌతమ్ చేతిలో అధికారికంగా కప్ పెట్టినట్టే, వచ్చే వారం వరకు కూడా ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఇదంతా పక్కన పెడితే నిన్న జరిగిన రంగుల టాస్క్ లో గౌతమ్ స్పష్టంగా రెండు రౌండ్స్ గెలుస్తాడు. మొదటి రౌండ్ లో అయితే గౌతమ్ గెలిచాడని చిన్న పిల్లవాడికి కూడా అర్థం అవుతుంది . కానీ సంచాలక్ ప్రేరణ నిఖిల్ ని విన్నర్ ని చేసే ప్రయత్నం చేసింది. అదే విధంగా రెండవ రౌండ్ లో కూడా గౌతమే గెలుస్తాడు. కానీ ప్రేరణ ఉద్దేశపూర్వకంగా నిఖిల్ ని విన్నర్ గా ప్రకటిస్తుంది. కేవలం ప్రేరణ బయాస్ గా ఉండడం వల్లే నిన్న గౌతమ్ ఓటు అప్పీల్ చేసుకోలేకపోయాడు.