Bigg Boss Telugu 8 : ఎన్నో ట్విస్టులు, ఎమోషన్స్, ఫైట్స్ మధ్య సాగిన బిగ్ బాస్ సీజన్ 8 సరిగ్గా మరో వారం రోజుల్లో ముగియబోతుంది. ప్రేక్షకులకు ఇది చాలా విచారకరమైన వార్త. ఎందుకంటే మూడు నెలలుగా అందరూ ఈ షోకి బాగా అలవాటు పడ్డారు. సీజన్ 7 స్థాయిలో పెద్ద బ్లాక్ బస్టర్ సీజన్ గా ఈ సీజన్ నిలబడలేదు కానీ, పర్వాలేదు అనే రేంజ్ లో హిట్ అయ్యింది. అయితే ఈ 14వ వారం లో ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరు అనే దానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది. సోషల్ మీడియా పోల్స్ ప్రకారం అయితే రోహిణి, నబీల్, విష్ణుప్రియ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. కానీ అధికారిక పొలింగ్స్ లో ప్రేరణకి అందరికంటే తక్కువ ఓట్లు పడ్డాయా అనే అనుమానం మొదలైంది. ఎండికంటే ఈ సీజన్ పూర్తి అవ్వగానే ఓంకార్ ‘ఇస్మార్ట్ జోడి’ సీజన్ 3 ప్రారంభం కాబోతుంది.
ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో ని మనమంతా చూసాము. అయితే ఓంకార్ తన ప్రతీ సీజన్ లోనూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ జోడీని తీసుకుంటూ వచ్చాడు. అలా ఈ సీజన్ లో మూడవ వారం ఎలిమినేట్ అయినా అభయ్ ని, అతని సతీమణి ని తీసుకున్నాడు. అదే విధంగా నిన్నటి ఎపిసోడ్ లో ముఖ్య అతిథిగా విచ్చేసి తన షోని ప్రమోట్ చేసుకున్న ఓంకార్, ప్రేరణకి తన భర్త శ్రీపాద్ తో కలిసి వచ్చే అవకాశం కల్పించాడు. అందుకు కారణం ప్రేరణ చెప్పిన అద్భుతమైన సమాధానం వల్లనే. ఎందుకంటే నిన్న ఆమెకి ఒకరితో కలిసి డ్యాన్స్ చేసే సందర్భం వస్తుంది. అప్పుడు ఒకరిని శ్రీపాద్ లాగా ఊహించుకోమని చెప్తే, శ్రీపాద్ స్థానాన్ని ఎవ్వరూ తీసుకోలేరు అని ప్రేరణ అంటుంది. ఈ విషయంలో ప్రేరణ ఓంకార్ కి చాలా నచ్చింది, మీలాంటోళ్ళు ఈ షోలోకి వస్తే చాలా విలువలు జనాలకు తెలుస్తాయి అని ఓంకార్ అంటాడు.
అంటే ‘ఇస్మార్ట్ జోడి 3’ లో ప్రేరణ, శ్రీపాద్ జంట కూడా పాల్గొనబోతుంది అన్నమాట. ఏ గేమ్ షో కి అయినా ఎపిసోడ్స్ ని రెండు వారాల ముందే షూట్ చేస్తారు. అది ఆనవాయితగా వస్తుంది. మరి ప్రేరణ ఈ షోలో పాల్గొనబోతుంది అంటే, వచ్చే వారం కచ్చితంగా ఆమె షూటింగ్ లో పాల్గొనాలి. అంటే ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వబోతుందా అనే అనుమానాలు ప్రేక్షకుల్లో తలెత్తాయి. ఈ వారం ఎలిమినేట్ అయ్యి ఆమె బయటకి వస్తేనే వచ్చే ‘ఇస్మార్ట్ జోడి 3’ మొదటి ఎపిసోడ్ లో కనిపిస్తుంది. అందుకే బిగ్ బాస్ స్పెషల్ గా ఆమె పెళ్లి వీడియో ప్రోమో వేశాడా?, ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వబోతుంది అనే ఉద్దేశ్యంతోనే ఈ ఆఫర్ ఆమెకి ఇప్పించాడా అనేది మరి కాసేపట్లో తెలియనుంది. ఈరోజు ఉదయం 10 గంటల నుండి శనివారం ఎపిసోడ్ మొదలు కానుంది.