https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సోనియా పై మోజుతో తన క్లాన్ సభ్యులకు నిఖిల్ ఘోరమైన అన్యాయం..వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన సీత..వైరల్ అవుతున్న వీడియో!

కాసేపటి క్రితమే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రారంభం లో నిఖిల్, సోనియా మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నిఖిల్ బాధపడుతూ అభయ్ కి సోనియా గురించి చెప్పుకుంటాడు. కాసేపటి తర్వాత సోనియా కూడా అభయ్ కి నిఖిల్ మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన వెర్షన్ చెప్పుకుంటూ ఉంటుంది. ఈ గొడవ కారణంగా నిఖిల్ బాగా డిస్టర్బ్ అవుతాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 03:45 PM IST

    Bigg Boss Telugu 8(30)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ ఒక అబ్బాయి, అమ్మాయి మోజులో పడితే అతని జీవితం సర్వనాశనం అవుతుంది అనడానికి ఇటీవల ఎన్నో సంఘటనలు మనకు ఉదాహరణగా నిలిచాయి. రీసెంట్ గా జానీ మాస్టర్ వ్యవహారం అలాంటిదే. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ కూడా సోనియా మోజులో పడి తన ఆటని మొత్తం సర్వనాశనం చేసుకుంటున్నాడు. అతను తగ్గిపోవడమే కాకుండా, తన టీం లో కష్టపడిన వారికి కూడా నిఖిల్ అన్యాయం చేస్తున్నాడు. సోనియా జపం చేస్తూ, ఆమెకు బాడీ గార్డ్ గా వ్యవహరిస్తూ, అతన్ని అభిమానించే ప్రేక్షకుల చేత కూడా తిట్టించుకుంటున్నాడు. హౌస్ లో అడుగుపెట్టినప్పటి నుండి నిఖిల్ లో అన్ని మంచి లక్షణాలే ఉన్నాయి. ఒక విన్నర్ కి ఉండాల్సిన లక్షణాలన్నీ నిఖిల్ లో ఉన్నాయి. ఆయనలో ఉన్న ఏకైక నెగటివ్ సోనియా కి అసిస్టెంట్ గా మారడమే.

    కాసేపటి క్రితమే నేటి బిగ్ బాస్ ఎపిసోడ్ కి సంబంధించిన రెండవ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమో ప్రారంభం లో నిఖిల్, సోనియా మధ్య చిన్న గొడవ జరిగింది. ఆ తర్వాత నిఖిల్ బాధపడుతూ అభయ్ కి సోనియా గురించి చెప్పుకుంటాడు. కాసేపటి తర్వాత సోనియా కూడా అభయ్ కి నిఖిల్ మీద చాలా ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన వెర్షన్ చెప్పుకుంటూ ఉంటుంది. ఈ గొడవ కారణంగా నిఖిల్ బాగా డిస్టర్బ్ అవుతాడు. ఇంతలోపే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరిని హాల్ లోకి రమ్మంటాడు. అందరూ వచ్చిన తర్వాత ‘ప్రభావతి 2.0 టాస్క్ లో బిగ్ బాస్ హౌస్ లోకి ఒక ఎర్ర గుడ్డుని వదిలాడు. అది మీలో ఎవరి దగ్గర ఉంది’ అని అడుగుతాడు బిగ్ బాస్. మా దగ్గర ఉంది అని నిఖిల్ అంటాడు. అప్పుడు బిగ్ బాస్ ‘ఎవరి దగ్గరైతే ఈ ఎర్ర గుడ్డు ఉంటుందో, వాళ్ళు చీఫ్ కంటెండర్ గా నిలుస్తారు. అత్యధిక గుడ్లు ఉన్న క్లాన్ కి నిఖిల్ చీఫ్ కాబట్టి, అతను నేరుగా కంటెండర్ అయ్యాడు. అతని దగ్గర ఉన్న ఎర్ర గుడ్డుని తన క్లాన్ లో ఎవరికైతే ఇస్తాడో, వాళ్ళు రెండవ కంటెండర్ గా నిలుస్తారు’ అని అంటాడు. అందరూ ఊహించినట్టుగానే నిఖిల్ ఆ ఎర్ర గుడ్డుని సోనియా కి ఇస్తాడు. విష్ణు ప్రియా, సీత కోపం తో ఆ సమయంలో నిఖిల్ వైపు చూస్తారు.

    అనంతరం సీత దగ్గరకు వెళ్లి నిఖిల్ వివరించే ప్రయత్నం చేయగా, సీత ఏడుస్తూ ‘దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపో..నాకేమి చెప్పొద్దు..నేను వినను..నువ్వు వెళ్తావా?, లేకపోతే నన్నే లేచి వెళ్ళిపోమంటావా’ అని అనగా, నిఖిల్ లేచి వెళ్ళిపోతాడు. సోనియా తో అతనికి చిన్నపాటి గొడవ జరిగింది కాబట్టి, ఇప్పుడు ఆమెని కంటెండర్ చేయకపోతే ఆ గొడవ మరింత పెరుగుతుంది, ఆమెతో రిలేషన్ చెడిపోతుంది అనే ఉద్దేశ్యంతో నిఖిల్ ఆమెకి ఎర్ర గుడ్డు ని ఇచ్చి ఉండొచ్చు. కానీ ఎంతో కష్టపడి ఆడి, గెలుపుకి కారణమైన సీతకు కంటెండర్ అయ్యే అవకాశం ఇవ్వకపోవడం అన్యాయమే కదా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అనుకుంటున్నారు.