https://oktelugu.com/

Jani Master: ఒక్కో పాటకు జానీ మాస్టర్ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..? ఇండియాలోనే నెంబర్ 1 అనొచ్చు!

2009 వ సంవత్సరం లో జానీ మాస్టర్ నితిన్ హీరో గా నటించిన 'ద్రోణా' చిత్రం ద్వారా మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్ గా మారాడు. అంతకు ముందు ఆయన సుమారుగా 7 ఏళ్ళ పాటు అనేక మంది కొరియోగ్రాఫర్స్ కి అసిస్టెంట్ గా పని చేసాడు. పలు సినిమాల్లో ఈయన్ని గ్రూప్ డ్యాన్సర్స్ లో ఒకడిగా చూడొచ్చు. అలా ఎంతో కష్టపడి, వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ జానీ మాస్టర్ ఇంతటి స్థాయికి ఎదిగాడు.

Written By:
  • Vicky
  • , Updated On : September 20, 2024 / 03:28 PM IST

    Jani Master(2)

    Follow us on

    Jani Master: ప్రముఖ కొరియా గ్రాఫర్ జానీ మాస్టర్ పేరు ప్రస్తుతం నేషనల్ వైడ్ గా ఎలా ట్రెండ్ అవుతుందో మనం గత కొద్దిరోజులుగా చూస్తూనే ఉన్నాం. ఆయన టీం లో అసిస్టెంట్ గా ఒకప్పుడు పనిచేసిన శ్రేష్టి వర్మ, ఇటీవలే నార్సింగి పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడు అని, మతం మార్చుకొని పెళ్లి చేసుకోమని వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. పోలీసులు జానీ మాస్టర్ పై ‘పోస్కో’ చట్టం క్రింద కేసు ని నమోదు చేసి, గోవా లో అరెస్ట్ చేసి హైదరాబాద్ కి తరలించిన సంగతి తెలిసిందే. నేడు ఉప్పరపల్లి కోర్టు లో ఆయన్ని ప్రవేశపర్చగా, కోర్టు ఆయనకీ 14 రోజుల పాటు చంచల్ గూడా జైలులో రిమాండ్ విధించింది. ఈ ఘటన ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. రెండు సార్లు నేషనల్ అవార్డుని సంపాదించి, పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్న జానీ మాస్టర్ కెరీర్, ఈ సంఘటన ద్వారా తలక్రిందులైంది.

    2009 వ సంవత్సరం లో జానీ మాస్టర్ నితిన్ హీరో గా నటించిన ‘ద్రోణా’ చిత్రం ద్వారా మొట్టమొదటిసారి కొరియోగ్రాఫర్ గా మారాడు. అంతకు ముందు ఆయన సుమారుగా 7 ఏళ్ళ పాటు అనేక మంది కొరియోగ్రాఫర్స్ కి అసిస్టెంట్ గా పని చేసాడు. పలు సినిమాల్లో ఈయన్ని గ్రూప్ డ్యాన్సర్స్ లో ఒకడిగా చూడొచ్చు. అలా ఎంతో కష్టపడి, వచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటూ జానీ మాస్టర్ ఇంతటి స్థాయికి ఎదిగాడు. ఇతను వేరే లెవెల్ కి వెళ్ళడానికి సహాయపడింది మాత్రం రామ్ చరణ్. ఇతనిలో అద్భుతమైన టాలెంట్ ని గుర్తించి తన ప్రతీ సినిమాలోనూ కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ఇచ్చాడు. అలా జానీ మాస్టర్ సక్సెస్ జర్నీ కొనసాగింది. ఇది ఇలా ఉండగా జానీ మాస్టర్ ఒక్కో పాటకు కొరియోగ్రఫీ కోసం తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో ఇప్పుడు సోషల్ మీడియా లో లీక్ అయ్యిని.

    ఒక్కో పాట కోసం ఆయన 50 లక్షల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటాడట. ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇండియా లో ఇప్పటి వరకు ఏ కొరియోగ్రాఫర్ కూడా తీసుకోలేదు. ఒక సినిమాలో ఆరు పాటలకు జానీ మాస్టర్ కొరియాగ్రఫీ చేస్తే 3 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఆయనకీ ఇవ్వాలన్నమాట. అయితే జానీ మాస్టర్ కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాదు, చిన్న హీరోలకు, మీడియం రేంజ్ హీరోలకు కూడా అనేక సాంగ్స్ కొరియోగ్రఫీ చేసాడు. కొన్ని సినిమాల కోసం ఆయన ఒక్క రూపాయి రెమ్యూనరేషన్ కూడా తీసుకోకుండా పని చేసిన సందర్భాలు కూడా ఉన్నాయట. చిన్న సినిమాలకు ఆయన కేవలం 10 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ మాత్రమే ఛార్జ్ చేస్తాడట. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, జానీ మాస్టర్ పలు టీవీ షోస్ కి న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించాడు.