https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ సానుభూతి డ్రామా కోసం సొంత చెల్లి జీవితాన్ని రోడ్డున పడేసాడుగా..పెళ్లి కూడా క్యాన్సిల్..వైరల్ అవుతున్న వీడియో!

తన తండ్రిని, చెల్లిని, భార్య ని అందరిని విలన్స్ ని చేసి చూపించాడు. ఇతనికి 30 ఏళ్ళ వయస్సు ఉంటుంది. ఏది మాట్లాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. బిగ్ బాస్ హౌస్ లో అందరూ టాస్కులు ఆడి, తోటి కంటెస్టెంట్స్ తో కోట్లాది గెలవాలని అనుకుంటారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 / 08:13 AM IST

    Bigg Boss Telugu 8(95)

    Follow us on

    Bigg Boss Telugu 8: సాధారణంగా మన ఇంట్లో ఉన్న సమస్యలను మన స్నేహితులకు చెప్పుకోవడానికే ఆలోచిస్తుంటాం మనం. కానీ మణికంఠ అనే వ్యక్తి కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు తనకి సానుభూతి దక్కడం కోసం బిగ్ బాస్ సీజన్ 8 లో వాడుకున్నాడు. అది కూడా అతను తన సమస్యలను చెప్పుకోవడం మాత్రమే చేయలేదు. తన తండ్రిని, చెల్లిని, భార్య ని అందరిని విలన్స్ ని చేసి చూపించాడు. ఇతనికి 30 ఏళ్ళ వయస్సు ఉంటుంది. ఏది మాట్లాడితే ఎలాంటి సమస్యలు వస్తాయి అనే ఇంకిత జ్ఞానం కూడా లేదు. బిగ్ బాస్ హౌస్ లో అందరూ టాస్కులు ఆడి, తోటి కంటెస్టెంట్స్ తో కోట్లాది గెలవాలని అనుకుంటారు.

    కానీ ఇతను వేరే, భయంకరమైన ఆటని ఆడుతున్నాడు. బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలాంటి చీప్ గేమ్ ఆడలేదు. ఇతని మెంటలోడు, బ్రెయిన్ పనిచేయడం లేదు, అందువల్ల ఏది పడితే అది మాట్లాడేస్తున్నాడు అని జనాలు అనుకోడానికి కూడా లేదు. హౌస్ లో ఫన్ చేయాల్సిన సమయం లో ఫన్ చేస్తున్నాడు, నామినేషన్స్ లో సరైన పాయింట్స్ పెడుతున్నాడు, తన తోటి కంటెస్టెంట్స్ ఎలా అయితే ఉంటున్నారో, అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కానీ సందర్భానికి తగ్గట్టుగా, గొడవ అయ్యేందుకు ఏమాత్రం ఆస్కారం లేనప్పటికీ, గొడవలు పెట్టుకొని, తన హౌస్ మొత్తం టార్గెట్ చేస్తున్నట్టుగా జనాలకు చూపిస్తున్నాడు. ఇంత దరిద్రంగా ఆటని ఇప్పటి వరకు ఎవరైనా ఆడారా చెప్పండి..?, హౌస్ మేట్స్ అందరూ అతన్ని టార్గెట్ చేయడం కాదు, అతనే వాళ్లందరినీ టార్గెట్ చేస్తున్నాడు. రీసెంట్ గా ఈయన సోదరి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.

    ఆ ఇంటర్వ్యూ లో ఈమె మణికంఠ గురించి మాట్లాడిన కొన్ని మాటలు చూస్తే అసహ్యించుకోక తప్పదు. యష్మీ మణికంఠ ని డేంజరస్ కంటెస్టెంట్ అని ఎన్నోసార్లు అనింది. నిజం చెప్పాలంటే ఆమె చాలా తక్కువ అనింది, మణికంఠ చెల్లి మాట్లాడిన ఈ మాటలు చూస్తే ఇంకా ఎక్కువే తిట్టొచ్చు అని మీకు కూడా అనిపిస్తుంది. ఈ ఇంటర్వ్యూ లో యాంకర్ ఆమెను ఒక ప్రశ్న అడుగుతూ ‘మణికంఠ ఇంట్లో విషయాలు తీసుకెళ్లి వీధిలో పెట్టాడు, ఇది అవసరమా అని మాకు అనిపించింది..దాని వల్ల మీ వ్యక్తిగత జీవితంపై ప్రభావం పడిందా?’ అని అడగగా, దానికి మణికంఠ సొందరి సమాధానం ఇస్తూ ‘నేను కూడా చాలా బాధపడ్డాను. ఇంట్లో విషయాలు చెప్పకుండా ఉండాల్సింది. దాని వల్ల మా వ్యక్తిగత జీవితంపై చాలా ప్రభావం పడింది. నాకు ఇటీవలే నిశ్చితార్థం జరిగింది. మా అత్తయ్య గారి ఫ్యామిలీ కి ఫోన్ కాల్స్ వచ్చాయి, ఇలాంటి కుటుంబం నుండి ఆ అమ్మాయిని ఎందుకు తెచ్చుకున్నారని, కట్టే కట్టే కోసం అడుక్కొని తెచ్చుకున్నారు అన్నాడు అతను, అంట లౌ క్లాస్ ఫ్యామిలీ అమ్మాయి మనకెందుకు అని అన్నారని, మా అత్తయ్య నాతో చెప్పింది. వేరే వాళ్ళు ఆమె స్థానం లో ఉండుంటే నా పెళ్లిని ని క్యాన్సిల్ చేసేవారు. కానీ ఆమె నాకోసం నిలబడింది, ఎంతోమందితో పోరాడింది, నన్ను బాగా అర్థం చేసుకుంది’ అంటూ ఎంతో ఎమోషనల్ గా ఆమె మాట్లాడింది. మణికంఠ సానుభూతి నాటకాలకు ప్రభావితమై అతనికి ఓటు వేసేవారు ఒక్కసారి ఈ వీడియో చూడండి. దయచేసి ఇలాంటి దొంగ కంటెస్టెంట్స్ కి ఓట్లు వేసి గెలిపించకుండా, నిజాయితీగా ఉన్నవాళ్లను గెలిపించండి.