https://oktelugu.com/

Bigg Boss Telugu 8: అవినాష్ ‘అశ్వథామ 2.0’ అని పిలిచినందుకు కోపంతో మైక్ విరగొట్టిన గౌతమ్..టాస్క్ నుండి తప్పుకున్న అవినాష్!

ఈ టాస్కు నిన్నటి ఎపిసోడ్ లో ప్రసారం అవ్వలేదు కదా, ప్రోమో కదా వేశారు, అప్పుడే చూసినట్టు చెప్తున్నారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ టాస్కుని నిన్ననే నిర్వహించారు, లైవ్ చూసేవారికి అర్థం అవుతుంది, నేటి ఎపిసోడ్ లో ఈ టాస్క్ టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ టాస్కులో భాగంగా అవినాష్ మెహబూబ్, టేస్టీ తేజా, పృథ్వీ రాజ్, నిఖిల్, నబీల్ ని నవ్వించే ప్రయత్నం చేస్తాడు.

Written By:
  • Vicky
  • , Updated On : October 9, 2024 8:24 am
    Bigg Boss Telugu 8(96)

    Bigg Boss Telugu 8(96)

    Follow us on

    Bigg Boss Telugu 8: కమెడియన్స్ వృత్తి కామెడీ చేయడమే..కామెడీ చేస్తున్న సందర్భంలో వాళ్లకు అవతల వ్యక్తులు సహకరించి ఫ్రీ స్పేస్ ఇవ్వాలి. అప్పుడే కామెడీ వర్కౌట్ అయ్యి ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ దక్కుతుంది. బిగ్ బాస్ సీజన్ 8 లో అది లోపించడం వల్లే వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా హరి తేజ, రోహిణి, టేస్టీ తేజా, ముక్కు అవినాష్ వంటి ఎంటెర్టైనెర్స్ ని తీసుకొచ్చింది బిగ్ బాస్ టీం. అయితే హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ వీళ్లకు సహకరించడం లేదు. ఉదాహరణకి నిన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరికీ ఒక ఫన్ టాస్క్ ఇస్తాడు. ఈ టాస్కులో హౌస్ మేట్స్ నోట్లో నీళ్లు నింపుకొని ఉండాలి. మిగిలిన కంటెస్టెంట్స్ తమ కామెడీ టైమింగ్ తో వాళ్ళను నవ్వించి నోట్లో ఉన్న నీళ్లను ఊసేలా చేయాలి.

    ఈ టాస్కు నిన్నటి ఎపిసోడ్ లో ప్రసారం అవ్వలేదు కదా, ప్రోమో కదా వేశారు, అప్పుడే చూసినట్టు చెప్తున్నారు ఏమిటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ టాస్కుని నిన్ననే నిర్వహించారు, లైవ్ చూసేవారికి అర్థం అవుతుంది, నేటి ఎపిసోడ్ లో ఈ టాస్క్ టెలికాస్ట్ అవ్వబోతుంది. ఇదంతా పక్కన పెడితే ఈ టాస్కులో భాగంగా అవినాష్ మెహబూబ్, టేస్టీ తేజా, పృథ్వీ రాజ్, నిఖిల్, నబీల్ ని నవ్వించే ప్రయత్నం చేస్తాడు. నవ్వించడం లో భాగంగా అవినాష్ గౌతమ్ సీజన్ 7 లో ‘అశ్వథామ 2.0’ గా ఎంట్రీ ఇచ్చే సన్నివేశాన్ని గుర్తు చేస్తూ కామెడీ చేస్తాడు. దీనికి గౌతమ్ చాలా సీరియస్ అవుతాడు. ఎందుకు అలా పిలుస్తావు అంటూ రెచ్చిపోయాడు.

    ఇంకా ఆయన మాట్లాడుతూ ‘అది సీజన్ 7 లో జరిగింది. మాటికొస్తే దానిని గుర్తు చేస్తూ నాకు కోపం తెప్పించకండి బ్రో,నన్ను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా కావాలంటే’ అని అంటాడు. దానికి అవినాష్ స్పందిస్తూ ‘నేను ఈ టాస్క్ ప్రారంభంలోనే చెప్పాను, ఎవరూ తప్పుగా అర్థం చేసుకోకండి అని అన్నాను’ అని అంటాడు అవినాష్. ‘నేను మీకు ఇంతకు ముందే అలా చెప్పాను , పిలవొద్దని, నేను హౌస్ లోకి అడుగుపెట్టేముందు కూడా నాగ్ సార్ నన్ను అశ్వథామ అని పిలిస్తే, అలా పిలవకండి సార్, నేను సోలో బాయ్ అని చెప్పాను. దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది, నేను వచ్చినప్పుడు చాలా మంది అంటుంటే, వాళ్లకు కూడా చెప్పాను’ అని అంటూ మైక్ తీసి విసిరికొట్టి వెళ్ళిపోతాడు. దీంతో అవినాష్ బిగ్ బాస్ నేను ఈ టాస్క్ చేయడం లేదు అని చెప్పి వెళ్ళిపోతాడు. బహుశా గౌతమ్ కి సహజంగానే కోపం వచ్చి ఉండొచ్చు, కానీ సరదా సందర్భంలోనే అవినాష్ కామెడీ చేసాడు కాబట్టి, గౌతమ్ కూడా సరదాగా తీసుకొని ఉండుంటే సరిపోయేది, ఏదైనా సీరియస్ సంఘటన జరిగినప్పుడు, లేదా అసందర్భంగా అలా అవినాష్ మాట్లాడి ఉండుంటే కచ్చితంగా అవినాష్ దే తప్పు, కానీ ఈ విషయం లో మాత్రం గౌతమ్ చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యాడు అని అనిపించింది. మీరు కూడా ఆ వీడియో చూసేయండి.