https://oktelugu.com/

Horoscope Today: ఈ రాశుల వారికి శత్రువుల బెడద.. ఈ విషయాల్లో జాగ్రత్త..

వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. కొన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది.

Written By:
  • Srinivas
  • , Updated On : October 9, 2024 / 08:06 AM IST

    Horoscope Today

    Follow us on

    Horoscope Today: గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులపై ప్రభావం పడుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల ప్రకారంగా మనుషుల జీవితాలు ఉంటాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బుధవారం అమ్మవారు సరస్వతి రూపంలో కనిపించనున్నారు. ఈ సందర్భంగా కొన్ని రాశులపై సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అయితే చాలా రాశుల వారికి ఈరోజు ప్రతికూల పరిస్థితులే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం రాశుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే?

    మేష రాశి:
    ఇంట్లోకి అనుకోని ఆదాయం వస్తుంది. కొన్ని పనులు జాగ్రత్తగాచేయాల్సి ఉంటుంది. ఎలాంటి పనులు వాయిదా వేయకుండా ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు ప్రమోషన్ పొందే అవకాశం.

    వృషభ రాశి:
    వ్యాపారులు అనుకోని లాభాలు పొందుతారు. కొన్ని మాటలను అదుపులో ఉంచుకోవాలి. లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. దీంతో మనసు ఆందోళనగా ఉంటుంది.

    మిథున రాశి:
    కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో వాగ్వాదం చేస్తారు. వ్యాపారులను అనుకోని ప్రయాణాలు చేస్తారు. విదేశాల్లో చదివే పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

    కర్కాటక రాశి:
    కొందరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. పాత వివాదాలు ముందుకు వచ్చే అవకాశం. భవిష్యత్ గురించి ఆందోళన చెందుతారు. తల్లిదండ్రులతో ఉల్లాసంగా ఉంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

    సింహారాశి:
    పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తారు. చుట్టూ ఉన్నవారితో జాగ్రత్తగా ఉండాలి. ఇతరుల సంక్షేమం కోసం పాటుపడుతారు. కొన్ని పనుల కారణంగా ఖర్చుల పెరుగుతాయి. అనుకోని ఆదాయం వస్తుంది.

    కన్య రాశి:
    ఉద్యోగులు లక్ష్యాలను పూర్తి చేస్తారు. దీంతో ఉల్లాసంగా ఉంటారు. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతారు. ఉన్నత విద్య చదవాలనుకునే వారికి అవకాశం లభిస్తుంది. పెండింగ్ పనులను పూర్తి చేస్తారు.

    తుల రాశి:
    ఈరాశి ఉద్యోగులను సరస్వతి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. కొందరు ఏర్పాటు చేసుకున్న గమ్యాలను చేరుతారు.కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా ఉంటారు.

    వృశ్చిక రాశి:
    మానసికంగా ఒత్తిడికి గురవుతారు. ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. సాయంత్రం స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి. కొందరు పక్కన ఉన్నవారే మోసగించే అవకాశం ఉంది. పెండింగులో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి.

    ధనస్సు రాశి:
    కష్టపడి పనిచేసిన వారికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులకు సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. కుటుంబ సభ్యుల కోసం ధనం ఖర్చు చేస్తారు. కొత్తగా పనిని ప్రారంభిస్తే ఇతరుల సలహా తీసుకోవాలి.

    మకర రాశి:
    ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. కానీ ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఉద్యోగులు ఎక్కువగా శ్రమపడాల్సి వస్తుంది.కొన్ని పెట్టుబడులపై నష్టాలు వస్తాయి. సామాజిక సేవలో ఎక్కువగా పాల్గొంటారు.

    కుంభరాశి:
    ఏ పని చేసినా దానిపై శ్రద్ధ వహించాలి. ప్రమాదకరమైన పనులకు దూరంగా ఉండాలి. వ్యాపారులు కొంత ఆందోళనతో ఉంటారు. వివాహ ప్రయత్నాలు ప్రారంభం అవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు రాస్తారు.

    మీనరాశి:
    కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా ఉండాలి.