Bigg Boss Telugu 8: ‘నువ్వు నా ఈకతో సమానం’ అంటూ పృథ్వీ పై నోరు పారేసుకున్న మణికంఠ..కంటెంట్ కోసం ‘డ్రామా కంఠ’ తిప్పలు!

మొదటి 5 వారాలు స్కోప్ లేకపోయినా కూడా క్రియేట్ చేసుకొని ఏడుస్తూ డ్రామాలు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేసిన డ్రామాకంఠ 5 వారం లో నాగార్జున ఇచ్చిన బలమైన కోటింగ్ తో కాస్త మారాడు.

Written By: Vicky, Updated On : October 18, 2024 8:17 am

Bigg Boss Telugu 8(128)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రతీ కంటెస్టెంట్ ప్రేక్షకుల మెప్పు పొందేందుకు టాస్కులు ఆడడం, ఎంటర్టైన్మెంట్ ని అందించడం, ఇలా ఎవరికి తోచిన పద్దతిలో వాళ్ళు ఆడియన్స్ ని అలరించే ప్రయత్నం చేసారు. హౌస్ లోకి అడుగు పెట్టిన ప్రతీ కంటెస్టెంట్ తమ సొంత టాలెంట్ తోనే ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్నారు, కానీ ఒక్కడు మాత్రమే డ్రామాలు ఆడి ఫ్యాన్ బేస్ ని పొందాడు. అతను మరెవరో కాదు, డ్రామాకంఠ అలియాస్ మణికంఠ. మొదటి 5 వారాలు స్కోప్ లేకపోయినా కూడా క్రియేట్ చేసుకొని ఏడుస్తూ డ్రామాలు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేసిన డ్రామాకంఠ 5 వారం లో నాగార్జున ఇచ్చిన బలమైన కోటింగ్ తో కాస్త మారాడు. ఆ వారం అతను నామినేషన్స్ లోకి కూడా రాకపోవడంతో చాలా కూల్ గా టాస్కులు ఆడుతూ, మణికంఠ లో ఇంత మార్పా అని తోటి కంటెస్టెంట్స్ కూడా ఆశ్చర్యపోయేలా చేసాడు.

నాగార్జున కూడా వీకెండ్ ఎపిసోడ్ లో ఇతని పై ఒక ప్రత్యేకమైన వీడియో తయారు చేయించి వేస్తాడు. బయట ఎలాగో తనకి సానుభూతి వర్కౌట్ అయ్యింది, నాగార్జున కూడా తనని ఆకాశానికి ఎత్తేసాడు, ఇక డ్రామా కంఠ లో ఓవర్ కాంఫిడెన్స్ ఎక్కువ అయిపోయింది. ఈ వారం తాను గేమ్ ఆడకపోయినా సేఫ్ అయిపోతాను అనే ధీమా అతనిలో వచ్చేసింది. దీంతో ఆయన ఈ వారం ఏర్పాటు చేసిన టాస్క్ లో ఫిజికల్ గా ఆడలేనని, తోపులాటలో తనకి ఏదైనా జరిగితే నా పెళ్ళాం బిడ్డలు ఏమైపోతారో అంటూ డ్రామా కంఠ పెర్ఫార్మన్స్ మొదలు పెట్టాడు. రాయల్ క్లాన్ వద్దకు కూడా వెళ్లి తనని గేమ్ నుండి తీసివేయాల్సిందిగా బ్రతిమిలాడుతాడు. ఇదంతా పక్కన పెడితే రాత్రి పృథ్వీ మణికంఠ తో చాలా మర్యాదగా హౌస్ లో తనకి మణికంఠ కి మధ్య జరిగిన చిన్న సమస్య గురించి మాట్లాడేందుకు వస్తాడు. ఉదయం నేను నిన్ను మంచి నీళ్లు తీసుకొని రమ్మంటే నువ్వు తీసుకొని రాలేదు, కానీ ఇప్పుడు నన్ను నువ్వు చెప్పులు వెతికి పెట్టమంటున్నావు, నేను సైలెంట్ గా ఉంటే నాకు మెచ్యూరిటీ లేదంటున్నావు, ఎందుకు అలా అన్నావు?, మెచ్యూరిటీ లేదని నీకు ఎందుకు అనిపించింది అని అడుగుతాడు. అప్పుడు డ్రామాకంఠ నువ్వు ఉదయం చాలా యాటిట్యూడ్ తో అడిగావు, అది నాకు నచ్చలేదు, అందుకే నీకు మంచి నీళ్లు ఇవ్వలేదు అని అంటాడు.

అలా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంటుంది. పృథ్వీ చాలా మర్యాదగా మాట్లాడుతుండగా, డ్రామాకంఠ గొంతు పైకి లేపుతాడు. నాపై గొంతు లేపకు అని పృథ్వీ అనగా, నువ్వేమైనా నా గర్ల్ ఫ్రెండ్ వా, లేదా నా అన్నవా, తమ్ముడివా నీతో మర్యాదగా మాట్లాడడానికి, లేదా పైన నుండి దిగి వచ్చావా అంటూ డ్రామా కంఠ అనవసరమైన గొడవ పెట్టుకొని పెద్ద డ్రామా క్రియేట్ చేసాడు. ఈ క్రమం లో డ్రామా కంఠ ‘నువ్వు నా ఈకతో సమానం’ అని అరుస్తాడు. అప్పుడు పృథ్వీ నువ్వు నాకు చీమతో సమానం అని అంటాడు. అలా ఈ వారం మొత్తం టాస్కులు ఆడకపోయినా కూడా, ఉద్దేశపూర్వకంగా మణికంఠ అనే వ్యక్తి పృథ్వీ తో గొడవపడి కావాల్సినంత కంటెంట్ ని రప్పించుకున్నాడు.