Bigg Boss Telugu 8: గౌతమ్ ని కొట్టిన నిఖిల్..అనాయ్యంగా టార్గెట్ చేసిన నిఖిల్, నబీల్..ఇంత అసూయ ఎందుకు?

మెహబూబ్ పదే పదే కొట్టావు అని గట్టిగా అనడం తో, గౌతమ్ కి కోపం వచ్చేస్తుంది. నేను కొట్టలేదురా, అనవసరం గా లేని పోనివి నా మీద వెయ్యకు అని ఆవేశంలో తన చేతిలో ఉన్న నిఖిల్ ని పక్కకి విసురుతాడు.

Written By: Vicky, Updated On : October 18, 2024 8:13 am

Bigg Boss Telugu 8(127)

Follow us on

Bigg Boss Telugu 8: నిన్న బిగ్ బాస్ హౌస్ లో జరిగిన ‘ఓవర్ స్మార్ట్ ఫోన్స్ VS ఓవర్ స్మార్ట్ ఛార్జర్స్’ టాస్క్ ఎంత రసవత్తరంగా సాగిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ టాస్క్ లో ఆడ, మగ అని తేడా లేకుండా కంటెస్టెంట్స్ దారుణంగా ఫిజికల్ అయ్యారు. అందరికి దెబ్బలు బాగా తగిలాయి. ముఖ్యంగా నిన్న వాష్ రూమ్ లో నిఖిల్, గౌతమ్ మధ్య జరిగిన ఫైటింగ్ పెద్ద సెంసీషల్ టాపిక్ గా మిగిలింది. అసలు ఈ గొడవ ఎలా జరిగిందంటే రాయల్ క్లాన్ సభ్యులు, ఓజీ క్లాన్ కి చెందిన పాట్ ని పగలగొట్టడంతో బిగ్ బాస్ రాయల్ క్లాన్ కి ఓజీ క్లాన్ లో ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీసి వేసే పవర్ ని ఇస్తాడు. ఎవరిని తియ్యాలి అని రాయల్ క్లాన్ వాళ్ళు ఆలోచించుకుంటున్న సమయంలో ‘డ్రామాకంఠ’ అలియాస్ మణికంఠ రాయల్ క్లాన్ అనుమతి లేకుండా వాష్ రూమ్ లోకి దూరుతాడు.

అతనితో పాటు విష్ణు ప్రియ కూడా వెళ్తుంది. వీళ్ళు లోపలకి వెళ్లడాన్ని గమనించిన రాయల్ క్లాన్ సభ్యులు వాళ్ళను ఆపేందుకు పరుగులు తీస్తారు. ఓజీ క్లాన్ వాళ్ళు మణికంఠ, విష్ణు ప్రియ ని కాపాడేందుకు పరుగులు తీస్తారు. వాష్ రూమ్ లో ఇరు క్లాన్ సభ్యులు ఒకరిని ఒకరు ఆపుకునే క్రమం లో పెద్ద ఎత్తున ఫిజికల్ అయ్యారు. మణికంఠ ని బయటకి వచ్చేయమని నిఖిల్,పృథ్వీ తదితరులు పెద్ద ఎత్తున పిలుస్తారు. అతను బయటకి వస్తే ఈ గోల అంతా ఉండదు కాబట్టి, కానీ డ్రామాకంఠ బయటకి రాడు . ఈ క్రమం లోనే గౌతమ్, నిఖిల్ కి మధ్య పెనుగులాట జరుగుతుంది. ముందుగా నిఖిల్ గౌతమ్ ని పట్టుకుంటాడు. గౌతమ్ నిఖిల్ ని విడిపించుకుని క్రమం లో నిఖిల్ మెడ మీదకు చెయ్యి పెడుతాడు. నిఖిల్ ఆ సమయం లో గౌతమ్ ని ఈడ్చుకొని వెళ్లి సోఫాలో పడేస్తాడు. ఆ తర్వాత గౌతమ్ నిఖిల్ ని చాలా బలంగా పట్టుకుంటాడు. ఈ ప్రక్రియ లో మెహబూబ్ నువ్వు కావాలని కొడుతున్నావు అని అంటాడు. దానికి గౌతమ్ నేను కొట్టలేదు అని అంటాడు.

మెహబూబ్ పదే పదే కొట్టావు అని గట్టిగా అనడం తో, గౌతమ్ కి కోపం వచ్చేస్తుంది. నేను కొట్టలేదురా, అనవసరం గా లేని పోనివి నా మీద వెయ్యకు అని ఆవేశంలో తన చేతిలో ఉన్న నిఖిల్ ని పక్కకి విసురుతాడు. దీనికి కోపగించుకున్న నిఖిల్ పైకి లేచి గౌతమ్ మొఖం మీద కొట్టి, అతని మెడ పట్టుకొనియు బయటకి ఈడ్చుకొని వెళ్తాడు. గౌతమ్ చేసినవి మొత్తం ఆటలో భాగం, అతను కావాలని నిఖిల్ మీద ఫిజికల్ అవ్వలేదు, కాదు నిఖిల్ మాత్రం ఉద్దేశపూర్వకంగానే కొట్టాడు. ఇది చాలా పెద్ద తప్పు, నిఖిల్ కి రెడ్ కార్డు ఇచ్చి బయటకి పంపే అవకాశం కూడా ఉంది. మరి నాగార్జున ఈ వీకెండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.