https://oktelugu.com/

Bigg Boss Telugu 8: నబీల్ కి వెన్నుపోటు పొడిచేందుకు గ్రౌండ్ సిద్ధం చేసిన మణికంఠ..కారణం లేకుండా గొడవలు పెట్టుకొని డ్రామాలు!

ప్రతీ సందర్భం లో డ్రామాని క్రియేట్ చేసి, హౌస్ మొత్తం ఇతన్ని టార్గెట్ చేస్తున్నారని జనాలకు అనిపించేలా చేయడం, దాని ద్వారా సానుభూతి పొందడం, నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం, ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ప్రారంభం లో ఇతనికి సపోర్టు చేసేవారిలో సగం మందికి పైగా ఇతని ఆట తీరుని అర్థం చేసుకొని ఓట్లు వేయడం మానేశారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 2, 2024 / 08:55 AM IST

    Bigg Boss Telugu 8(62)

    Follow us on

    Bigg Boss Telugu 8: నాగ మణికంఠ..ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టగానే ఆడియన్స్ కి ఇతన్ని చూస్తే చాలా జాలి కలిగింది. ఆ జాలి కారణంగా ఇతనెవరో అంతకు ముందు ఎవరికీ పరిచయం లేకపోయినా కూడా మొదటి రోజు నుండే ఓటు బ్యాంక్ ఏర్పడింది. ఇదేదో బాగా వర్కౌట్ అయ్యింది అని మనోడు అనుకొని ఉండొచ్చు. మొదటి రోజు నుండి నేటి వరకు ఆయన సింపతీ యాంగిల్ లోనే గేమ్స్ ఆడుతూ వచ్చాడు కానీ, మిగిలిన యాంగిల్ లో గేమ్స్ ఆడేందుకు ప్రయత్నమే చేయలేదు. ప్రతీ సందర్భం లో డ్రామాని క్రియేట్ చేసి, హౌస్ మొత్తం ఇతన్ని టార్గెట్ చేస్తున్నారని జనాలకు అనిపించేలా చేయడం, దాని ద్వారా సానుభూతి పొందడం, నామినేషన్స్ నుండి సేవ్ అవ్వడం, ఇదే జరుగుతూ వచ్చింది. అయితే ప్రారంభం లో ఇతనికి సపోర్టు చేసేవారిలో సగం మందికి పైగా ఇతని ఆట తీరుని అర్థం చేసుకొని ఓట్లు వేయడం మానేశారు.

    కానీ ఇతన్ని ఇప్పటికీ నమ్మే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టే ఇంకా ఆయన హౌస్ లో సేవ్ అవుతూ వస్తున్నాడు. ఇతని అసలు రంగుని వాళ్ళు గమనించలేకపోతున్నారు, కానీ వాళ్లకు కూడా నిన్నటి ఎపిసోడ్ తో ఒక క్లారిటీ వచ్చేసింది. హౌస్ లో ఇతను ఎవరితో అయితే క్లోజ్ గా ఉంటాడో, వాళ్ళతో బాగా తిరిగి నామినేషన్స్ పాయింట్స్ ని వెతుక్కొని నామినేట్ చేస్తాడు. మొదటి వారం లో విష్ణు ప్రియా ని అలాగే చేసాడు, ఆ మరుసటి వారం యష్మీ కి కూడా అదే విధమైన వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడు నబీల్ తో గత కొంతకాలంగా క్లోజ్ గా తిరుగుతున్నాడు. ఆయనకు వచ్చే వారం నామినేషన్ వేయడానికి ఇప్పటి నుండే గ్రౌండ్ తయారు చేసుకున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో చిన్న విషయాన్ని పెద్దది చేస్తూ నబీల్ తో గొడవ పడిన తీరు ఆయనకు సపోర్ట్ చేసేవాళ్లకు కూడా చిరాకు కలిగించేలా చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే కాంతారా టీం వారు వంట గండిలో వంట చేసుకుంటున్నారు. అందుకు కావాల్సిన సరుకులు ఆ సభ్యులందరూ హడావుడి గా తీసుకొస్తున్నారు.

    ఎందుకంటే వంట గదిలో టైం లిమిట్ ఉంటుంది కాబట్టి. సీత మణికంఠకు అక్కడున్న బుట్ట ని తీసుకొని రమ్మంటుంది. నబీల్ తన పని తాను చేసుకుంటూ, అదిగో ఆ బుట్టని తీసుకోచ్చేయ్ అని మణికంఠ తో అంటాడు. దీనికి మణికంఠ ‘నాతో మైక్రో మ్యానేజ్మెంట్ చేయాలని అనుకోకు నబీల్’ అని అంటాడు. దీనికి నబీల్ కి కోపం వచ్చేస్తుంది, ఎదో స్నేహితుడు కదా అనే చనువుతో మామూలుగా చెప్పిన దానికి ఇతను ఇన్ని అర్థాలు ఎందుకు తీసాడు అని అర్థం కాక నబీల్ జుట్టు పీక్కున్నాడు. అప్పుడు నిఖిల్ నిన్న రాత్రే చెప్పా కదా నీకు, తర్వాతి టార్గెట్ నువ్వే అని, వచ్చే వారం నీకే నామినేషన్ వేస్తాడు చూడు అని నబీల్ నిఖిల్ తో అంటాడు. మణికంఠ మెంటాలిటీ ని బాగా గమనిస్తే, వచ్చే వారం అదే జరిగేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు.