https://oktelugu.com/

Bigg Boss Telugu 8: యష్మీ ని గురి చూసి ఎమోషనల్ గా దెబ్బ కొట్టిన మణికంఠ..దెబ్బకి పాపకు ఫ్యూజులు ఎగిరిపోయాయి!

యష్మీ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి 'నీ ముందు నిఖిల్ వాళ్ళ అమ్మ గారు పంపించిన వంటకం ఉంది, అలాగే మణికంఠ భార్య అతని కోసం పంపించిన వంటకం మరియు మెసేజి ఉంది..ఈ రెండిట్లో ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో' అని అడుగుతాడు బిగ్ బాస్.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 09:17 AM IST

    Bigg Boss Telugu 8(76)

    Follow us on

    Bigg Boss Telugu 8: నిన్నటి ఎపిసోడ్ లో టాస్కులు పెద్దగా ఏమి లేకపోయినప్పటికీ కూడా, హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని, బయట ఆడియన్స్ ని బాగా ఎమోషనల్ అయ్యే రేంజ్ ప్లాన్ వేసాడు బిగ్ బాస్. కన్ఫెషన్ రూమ్ లోకి ఎవరో ఒక కంటెస్టెంట్ ని పిలిచి, హౌస్ లో ఉన్నటువంటి మిగిలిన కంటెస్టెంట్స్ ఇంటి నుండి వాళ్లకు ఇష్టమైన వాళ్ళు తయారు చేసిన వంటకాలను, అలాగే వాళ్ళ నుండి ఒక మెసేజీని వచ్చిందని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్తాడు. వాళ్లకు ఇద్దరి కంటెస్టెంట్స్ కి సంబంధించిన వంటకాలను ఛాయస్ గా చూపించి ఎదో ఒక్కట్టే ఎంచుకోమని చెప్తాడు బిగ్ బాస్. ముందుగా యష్మీ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ‘నీ ముందు నిఖిల్ వాళ్ళ అమ్మ గారు పంపించిన వంటకం ఉంది, అలాగే మణికంఠ భార్య అతని కోసం పంపించిన వంటకం మరియు మెసేజి ఉంది..ఈ రెండిట్లో ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావో నిర్ణయించుకో’ అని అడుగుతాడు బిగ్ బాస్.

    అప్పుడు యష్మీ ‘నిఖిల్ కి ఇవ్వాలని అనుకుంటున్నాను బిగ్ బాస్. ఎందుకంటే వాడు వాళ్ళ అమ్మని బాగా మిస్ అవుతున్నాడు’ అని అంటుంది. అప్పుడు బిగ్ బాస్ ‘మణికంఠ గురించి ఆలోచించాలని అనిపించడం లేదా, అతని భార్య నుండి మెసేజి కూడా వచ్చింది’ అని బిగ్ బాస్ అనగా, యష్మీ దానికి సమాధానం చెప్తూ ‘అతనికి మేమంతా తోడు ఉన్నాము బిగ్ బాస్. ఎప్పుడు బాధ పడినా దగ్గరకు వెళ్లి ఓదారుస్తున్నాము, కావాల్సినంత ప్రేమని ఇస్తున్నాము’ అని అంటుంది. దీనికి మైకంతా చాలా బాధపడుతాడు. ఇక ఆ తర్వాత కాసేపటికి మణికంఠ ని కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తాడు బిగ్ బాస్. మణికంఠ తో మాట్లాడుతూ ‘నీ ముందు పృథ్వీ రాజ్ వాళ్ళ అమ్మ గారి నుండి వచ్చిన వంటకం, మెసేజి ఉంది..అలాగే యష్మీ నాన్న గారి నుండి వచ్చిన వంటకం ఉంది..వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు’ అని అడగగా, మణికంఠ పృథ్వీ రాజ్ ని ఎంచుకొని ఇస్తాడు. దీనికి యష్మీ తెగ ఏడ్చేస్తుంది.

    మణికంఠ తనకు ఆమె చేసిన పనిని గుర్తించుకొని, దెబ్బ చూసి భలే గురి కొట్టాడు అని ఆడియన్స్ కి అనిపించింది. అయితే యష్మీ తో ఆమె తండ్రి చాలా కాలం నుండి మాట్లాడడం లేదు, దూరం పెట్టినట్టుగా ఆడియన్స్ కి నిన్న అర్థమైంది. అయితే యష్మీ ఎందుకో డ్రామాలు చేసి కావాలని మణికంఠ కి చేరాల్సింది చేరనివ్వలేదని అందరికీ అర్థమైంది. ఎందుకంటే మనోడు అసలే డ్రామా కింగ్, తన భార్య నుండి వచ్చిన మెసేజి ని చూస్తే ఇంకా రక్తి కట్టించేస్తాడు, దృష్టిని మొత్తం తన వైపుకు లాగేసుకుంటాడు అనే ఉద్దేశ్యంతోనే ఆమె ఇలా చేసినట్టు తెలుస్తుంది. తన భార్య నుండి వంటకం, మెసేజి వచ్చిందని బిగ్ బాస్ చెప్పగానే, ‘ప్రియ ఇండియా కి వచ్చేసిందా’ అని ఆశ్చర్యపోయి అంటాడు నాగ మణికంఠ, అలాగే ఆమె మణికంఠ కి బదులుగా నిఖిల్ వంటకాన్ని ఎంచుకున్నప్పుడు ‘ఆ మెసేజి నాకు చాలా అవసరం యష్మీ’ అని గట్టిగా అరుస్తాడు.