https://oktelugu.com/

Nagarjuna: కొండా సురేఖ కి 100 కోట్లు పరువు నష్టం దావా వేసిన నాగార్జున..క్షమాపణలు చెప్పిన వదిలేది లేదంటూ వార్నింగ్!

నాంపల్లి హై కోర్టు లో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసాడు. ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరాడు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం దావా దాదాపుగా 100 కోట్ల రూపాయిలు ఉందట. రీసెంట్ గా ఆయన మీడియా తో మాట్లాడుతూ 'నా కుటుంబ గౌరవం ని భంగం కలిగించే పరిస్థితి వస్తే నేను సింహం లాగా పోరాడుతాను.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 09:13 AM IST

    Nagarjuna(11)

    Follow us on

    Nagarjuna: మంత్రి కొండా సురేఖ ఇటీవల సమంత పై, అక్కినేని కుటుంబం పై తీవ్రమైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటన పై తెలుగు సినిమా ఇండస్ట్రీ భగ్గుమన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కినేని ఫ్యామిలీ ఈ వ్యాఖ్యలపై చాలా తీవ్ర స్థాయిలో స్పందించింది. నాగార్జున కాస్త సాఫ్ట్ గానే కౌంటర్ ఇచ్చినా, ఆయన సతీమణి అమల చాలా ఘాటైన కౌంటర్ ఇచ్చింది. ఇక చిన్న కొడుకు అక్కినేని అఖిల్ అయితే మంత్రి అని కూడా చూడకుండా ఇలాంటోళ్ళు సమాజం లో బ్రతికాడు అర్హులు కాదంటూ ట్విట్టర్ లో పెద్ద ట్వీట్ వేసాడు. అది ఇప్పుడు సెన్సేషనల్ గా మారింది. అలాగే సినీ ఇండస్ట్రీ నుండి చిరంజీవి , వెంకటేష్, రామ్ చరణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, నాని , రకుల్ ప్రీత్ సింగ్ ఇలా ప్రతీ ఒక్కరు చాలా తీవ్రంగా ఖండించారు. నాగార్జున ఈ విషయాన్నీ అంత తేలికగా వదిలేలా అనిపించడం లేదు.

    ఇటీవలే ఆయన నాంపల్లి హై కోర్టు లో కొండా సురేఖ పై పరువు నష్టం దావా వేసాడు. ఆమె పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుని కోరాడు. ఇదంతా పక్కన పెడితే నాగార్జున కొండా సురేఖ పై వేసిన పరువు నష్టం దావా దాదాపుగా 100 కోట్ల రూపాయిలు ఉందట. రీసెంట్ గా ఆయన మీడియా తో మాట్లాడుతూ ‘నా కుటుంబ గౌరవం ని భంగం కలిగించే పరిస్థితి వస్తే నేను సింహం లాగా పోరాడుతాను. వివాదం తర్వాత కొండా సురేఖ సమంత కి క్షమాపణలు చెప్పారు, కానీ మా కుటుంబానికి మాత్రం ఆమె క్షమాపణలు చెప్పలేదు. అందుకే మేము పరువు నష్టం దావా కేసు వేసాము. ఇప్పుడు ఆమె క్షమాపణలు చెప్పినా మాకు అవసరం లేదు, కేసు వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు. మాకు కోర్టు నుండి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ వివాదం లో మాకు ఇండస్ట్రీ మొత్తం అండగా నిలబడింది. ఇది ఎప్పటికీ మర్చిపోలేను, మా నాన్న గారు సంపాదించిన గౌరవం అలాంటిది, సపోర్టు గా నిల్చిన ప్రతీ ఒక్కరికి కృతఙ్ఞతలు తెలియచేస్తున్నాను’ అంటూ నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు.

    మరోపక్క సోషల్ మీడియా లో నాగార్జున పై కాంగ్రెస్ పార్టీ కి ఎందుకు ఇంత పగ?, నిరాధారమైన ఆరోపణలు బహిరంగంగా ఒక మంత్రి చేయడం అనేది చిన్న విషయం కాదు. అంత పెద్ద తప్పు చేసి నాగార్జున కుటుంబానికి క్షమాపణలు చెప్పకపోవడం ఏమిటి?, మరీ ఇంత పొగరా?, పరువు నష్టం దావా కేసు వేసిన తర్వాత కూడా కొండా సురేఖ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాలని అనుకోలేదు, ఇంత ద్వేషం ఒక మనిషి పై పనికి రాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి వివాదం ఎక్కడ దాకా వెళ్లి ఆగుతుంది?, నాగార్జున కి కోర్టులో న్యాయం దొరుకుతుందా లేదా అనేది చూడాలి.