Bigg Boss Telugu 8: హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్, చూసే ఆడియన్స్ కి ఇప్పటి వరకు ఈ సీజన్ లో అర్థం అవ్వని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది నాగ మణికంఠ మాత్రమే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇతను బిగ్ బాస్ హౌస్ లోకి తన విచారకరమైన బ్యాక్ గ్రౌండ్ ని చెప్పుకొని లోపలకు అడుగుపెడతాడు. తన తల్లి చనిపోయిందని, తన తండ్రి దూరం పెట్టేశాడని, ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకొని అమెరికా లో స్థిరపడినప్పుడు, నాకు ఒక పాప పుట్టిందని, కానీ సంపాదన లేదని నాకు నా భార్య కి ప్రతీ రోజు గొడవలు జరిగేవని, నన్ను ఆమె వెళ్ళిపోమని చెప్పడంతో ఇక్కడికి వచ్చి తనని తానూ నిరూపించుకోవాలని అనుకున్నానని, తన భార్యని, కూతురిని తిరిగి రప్పించుకోవాలని, ఇలా ఒక్కటా రెండా ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్ చెప్పి ఇన్ని రోజులు ఆడియన్స్ నుండి ఆ సానుభూతి యాంగిల్ తోనే ఓట్లు రప్పించుకుంటూ ముందుకెళ్లాడు. ఒకానొక దశలో ఆయన తన భార్య ని కూడా విలన్ ని చేసి ఆడియన్స్ కి చూపించాడు.
బిగ్ బాస్ టైటిల్ కొడితేనే ఆమె తన దగ్గరకు తిరిగి వస్తుంది అనే రేంజ్ లో చెప్పుకొచ్చాడు. ఎవరైనా తానూ ప్రేమించిన అమ్మాయి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతాడా?, పోనీ అతని చెప్పింది మొత్తం నిజమా అంటే అది కూడా కాదు, మొత్తం బూటకమే అని నిన్నటి ఎపిసోడ్ లో తేలిపోయింది. నిన్న హౌస్ మేట్స్ కి తమ ఇంటి నుండి వచ్చిన వంటకాలను, వాళ్ళు ప్రేమగా పంపిన మెసేజిలు వచ్చాయి. మణికంఠ కి తన భార్య శ్రీప్రియ నుండి వచ్చిన వంటకం,మెసేజి వచ్చినట్టు చెప్తాడు బిగ్ బాస్. యష్మీ కారణంగా అది ఆయనకు అందకుండా పోతుంది. తన భార్య నుండి ఇవి వచ్చాయి అని చెప్పగానే మణికంఠ ‘ప్రియ ఇండియా కి వచ్చేసిందా’ అని ఆశ్చర్యపోతూ అంటాడు మణికంఠ. దీనిని గమనించిన ఆడియన్స్ కి ఇన్ని రోజులు మనల్ని ఇతను బకరా చేశాడా?, అతని చెల్లెలు ఏమో బయట మణికంఠ చెప్పేది మొత్తం అబద్దాలే అని అంటుంది, భార్య తో దూరం గా ఉన్నాను అంటూ సినిమా కథని చెప్పినట్టు చెప్పాడు, ఆమెతో విడిపోతున్న రేంజ్ లో బిల్డప్ ఇచ్చాడు.
కానీ అక్కడ ఆమె నుండి వంటకాలు, ఆమె ప్రేమగా పంపిన మెసేజ్ కూడా వచ్చింది. దీనిని ఎవరైనా ఎలా అర్థం చేసుకోవాలి?, మణికంఠ ఒక్కడే ఆడియన్స్ ని, హౌస్ మేట్స్ ని బకరాలను చేశాడా?, లేకపోతే తన భార్యతో కలిసి అందరినీ బకరాలను చేశాడా అనేది అర్థం కావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే తన భార్య ని కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు విలన్ ని చేసి చూపించాడు మణికంఠ, ఇప్పుడు ఆమెనే అతని కోసం బయట కష్టపడుతుంది, ఈమధ్య కొన్ని ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చింది, చూస్తుంటే వీళ్లిద్దరు కలిసి ఆడియన్స్ ని మోసం చేసినట్టుగా అనిపిస్తుంది. దీని గురించి క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.