https://oktelugu.com/

Bigg Boss Telugu 8: డేంజర్ జోన్ లో ప్రేరణ..పుంజుకుంటున్న యష్మీ గ్రాఫ్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే!

డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు. అయితే ఈ 5 మందిలో ప్రేరణ డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే గత 5 వారాల నుండి ఆమెకి నెగటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా ఇప్పటి వరకు ఆమెకి పాజిటివ్ ఎపిసోడ్స్ పడలేదు.

Written By: Vicky, Updated On : November 21, 2024 9:25 am
Bigg Boss Telugu 8(238)

Bigg Boss Telugu 8(238)

Follow us on

Bigg Boss Telugu 8: ఈ వారం జరిగిన నామినేషన్స్ ప్రక్రియ మొదటి వారం నుండి కష్టపడి ఆడుతూ వచ్చిన ఓజీ క్లాన్ సభ్యులకు ఘోరమైన అన్యాయం జరిగింది. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని నామినేట్ చేయమంటే, అందరూ ఓజీ క్లాన్ ని టార్గెట్ చేసి నామినేట్ చేసి వెళ్లారు. పైగా సీత వంటి వారు నిఖిల్ పై దారుణమైన నిందలు వేసి వెళ్ళింది. ఒక్క విష్ణు ప్రియ తప్ప ఈ వారం ఓజీ క్లాన్ కి సంబంధించిన వాళ్లంతా నామినేషన్స్ లోకి వచ్చారు. 5 మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, వీరిలో ఈసారి ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చు. డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఇద్దరు ఎలిమినేట్ అవ్వొచ్చు. అయితే ఈ 5 మందిలో ప్రేరణ డేంజర్ జోన్ లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే గత 5 వారాల నుండి ఆమెకి నెగటివ్ ఎపిసోడ్స్ పడుతూనే ఉన్నాయి. ఈ వారం కూడా ఇప్పటి వరకు ఆమెకి పాజిటివ్ ఎపిసోడ్స్ పడలేదు.

పైగా పృథ్వీ గ్రాఫ్ కొన్ని సందర్భాల కారణంగా బాగా పెరిగింది. ఎప్పుడూ ఓటు వెయ్యని వాళ్ళు కూడా ఈసారి పృథ్వీ కి ఓట్లు వేస్తున్నట్టు సోషల్ మీడియా లో చెప్పుకొచ్చారు నెటిజెన్స్. కాబట్టి ఆయన దాదాపుగా సేఫ్ జోన్ లో ఉన్నట్టే. ఇక చివరి రెండు స్థానాల్లో ఉన్నది మాత్రం యష్మీ, ప్రేరణ. వీరిద్దరిలో యష్మీ గ్రాఫ్ కాస్త పెరిగింది. ఎందుకంటే కొంతమంది రివ్యూయర్స్ పని గట్టుకొని ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడడం వల్ల, ఒక అమ్మాయిని దారుణంగా టార్గెట్ చేస్తున్నారు అనే ఉద్దేశ్యంతో ఈమెకి ఓట్లు బాగా వేశారు. అంతే కాకుండా నిన్న మెగా చీఫ్ టాస్క్ లో కూడా ఈమె చాలా అద్భుతంగా ఆడింది. గ్రూప్ గేమ్స్ కి దూరం గా జరిగి, సోలోగా గేమ్ ఆడి గెలిచింది. ఇది బయట ఆడియన్స్ కి బాగా ప్రొజెక్ట్ అయ్యింది. దీంతో ఆమెకి మరింత ఓట్లు పడే అవకాశం ఉంది.

అలా ప్రేరణ కి ఈ వారం ఎలాంటి పాజిటివ్ జరగలేదు. కానీ మెగా చీఫ్ గా ఉన్నప్పుడు తన ప్రవర్తన కారణంగా హౌస్ మేట్స్ అందరూ బాధపడిన విషయాన్నీ గుర్తు చేసుకుంటూ అందరికీ క్షమాపణలు చెప్తుంది. ఇదొక్కటి ఆమెకు కాస్త పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఆమె మెగా చీఫ్ పోటీల నుండి తప్పుకుంది, మళ్ళీ గేమ్ ఆడే అవకాశం రాదు, ఇది ఆమెకు మామూలు మైనస్ కాదు. అందుకే ప్రేరణ డేంజర్ జోన్ లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. డబుల్ ఎలిమినేషన్ పెడితే ప్రేరణ, యష్మీ ఇద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని, సింగిల్ ఎలిమినేషన్ పెడితే ప్రేరణ ఒక్కటే ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉందని లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం. రాబోయే రోజుల్లో ఇది మారుతుందా లేదా అనేది చూడాలి.