Hardik Pandya: మైదానంలో దుందుడుకు స్వభావాన్ని కలిగి ఉన్నప్పటికీ.. తన తోటి ఆటగాళ్లతో మాత్రం సరదాగా ఉంటాడు. నవ్వులు పూయిస్తాడు. చిలిపి సంభాషణలతో ఆకట్టుకుంటాడు.. ఆటతీరుతో కూడా సంచలనాలు సృష్టిస్తుంటాడు. ఇటీవల బంగ్లాదేశ్ జట్టుతో టి20 సిరీస్ జరిగినప్పుడు.. బంతి గమనాన్ని అంచనా వేసి కొట్టిన షాట్.. సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అతడి స్వాగ్, స్టైల్ ను క్రికెట్ ప్రపంచానికి సరికొత్తగా పరిచయం చేసింది. జట్టు అవసరాల దృష్ట్యా ఎలాంటి పని అయినా చేస్తాడు కాబట్టే.. అతడిని కోట్లాది అభిమానులకు దగ్గరగా చేసింది. అయితే మొదటినుంచి దూకుడు ఆటతీరుతో ఆకట్టుకునే హార్దిక్.. వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నిస్తాడు.. కానీ వివాదాలు మాత్రం అతడి వెంట తిరుగుతున్నాయి. తాజాగా హార్దిక్ పాండ్యాకు ఒక దారుణమైన అవమానం జరిగింది. ఇది అతని అభిమానులను కలవరపాడుకు గురిచేస్తున్నది.
డొమెస్టిక్ క్రికెట్లోకి.
ఐదు సంవత్సరాల తర్వాత హార్దిక్ పాండ్యా దేశవాళీ క్రికెట్లకు ఎంట్రీ ఇచ్చాడు. నంబర్ 23 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టు తరఫునుంచి అతడు మైదానంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ టోర్నీలో మేటి ఆటగాళ్లు కూడా ఆడుతున్నారు. అయితే జాతీయ జట్టులో ఆడే అవకాశం లభించినప్పుడు.. ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్ ఆడాలని ఇటీవల బీసీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆటగాళ్లు తప్పనిసరిగా దేశవాళి క్రికెట్ ఆడాల్సి వస్తున్నది. బరోడా జట్టు తరఫునుంచి హార్దిక్ కెప్టెన్ గా కాకుండా ఆటగాడిగా రంగంలోకి దిగడం చర్చకు దారితీస్తోంది.
ఎందుకిలా చేస్తున్నారు
బరోడా జట్టుకు కృనాల్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. ఇతడు హార్థిక్ పాండ్యాకు సోదరుడు. కృనాల్ ను కెప్టెన్ గా నియమించడం పట్ల హార్దిక్ పాండ్యా అభిమానులు కలవర పాటుకు గురవుతున్నారు. టి20 జట్టుకు హార్దిక్ పాండ్యా కెప్టెన్ ను చేయాల్సి ఉండగా.. సూర్య కుమార్ యాదవ్ ను తీసుకొచ్చారని.. ఇప్పుడు డొమెస్టిక్ క్రికెట్ లోనూ అలానే చేస్తున్నారని.. అతడిపై కావాలని ఇలా చేస్తున్నారని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. జట్టు కోసం 100% ఎఫర్ట్ పెట్టే హార్దిక్ పాండ్యా విషయంలో ఇలా చేయడం సరికాదని వారు ధ్వజమెత్తుతున్నారు. ” టి20 వరల్డ్ కప్ లో అతను సత్తా చాటాడు. తన వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా అతడు ఏమాత్రం ఆట మీద నిగ్రహాన్ని కోల్పోలేదు. పైగా నూటికి నూరు శాతం అద్భుతమైన ప్రతిభ చూపించాడు. అందువల్లే టీం ఇండియా గెలిచింది. కానీ అతడి సేవలను జట్టు అంతగా ఉపయోగించుకోలేకపోతోంది.. అతడికి విరివిగా అవకాశాలు కల్పించలేకపోతోంది.. చూడబోతే అతడిని తీవ్రంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇలా ఎన్ని కుట్రలు పన్నినా అతడికి ఏం కాదు. అతడు స్వయంప్రకాశితం. ఎలాగైనా తన ప్రతిభను నిరూపించుకుంటాడు. ఎలాగైనా అవకాశాలు కల్పించుకుంటాడని” హార్దిక్ అభిమానులు సామాజిక మాధ్యమాలలో వ్యాఖ్యానిస్తున్నారు.