https://oktelugu.com/

Bigg Boss Telugu 8: సోలో జపం చేస్తూ ఓవర్ యాక్షన్ చేసిన గౌతమ్..కంటెంట్ కోసం పృథ్వీతో అనవసరమైన గొడవ!

గౌతమ్ మాత్రం సోలోగా ఆడేందుకే ఇష్టపడుతున్నాడు. అవసరం వచ్చినప్పుడు, తనకి న్యాయం అనిపించినప్పుడు కంటెస్టెంట్స్ కి సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకి నిన్న టాస్క్ మొదలయ్యే ముందు ప్రేరణ తనకు సౌకర్యంగా ఉండే డ్రెస్ వేసుకోలేదు.

Written By: Vicky, Updated On : November 21, 2024 10:30 am
Bigg Boss Telugu 8(237)

Bigg Boss Telugu 8(237)

Follow us on

Bigg Boss Telugu 8: వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టి టాప్ 5 లోకి రావడమే చాలా కష్టం, అలాంటిది గౌతమ్ కృష్ణ టైటిల్ రేస్ లోకి అడుగుపెట్టాడంటే ఆయన్ని జనాలు ఏ రేంజ్ లో ఇష్టపడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గౌతమ్ లో ఆడియన్స్ ఎక్కువగా ఇష్టపడేందుకు కారణం , అతను సోలో గా గేమ్ ఆడడమే. తనకి హౌస్ లో చాలా మంది స్నేహితులు ఉన్నారు, కానీ గౌతమ్ మాత్రం సోలోగా ఆడేందుకే ఇష్టపడుతున్నాడు. అవసరం వచ్చినప్పుడు, తనకి న్యాయం అనిపించినప్పుడు కంటెస్టెంట్స్ కి సహాయం చేస్తున్నాడు. ఉదాహరణకి నిన్న టాస్క్ మొదలయ్యే ముందు ప్రేరణ తనకు సౌకర్యంగా ఉండే డ్రెస్ వేసుకోలేదు. ఈలోపే బిగ్ బాస్ తన టీ షర్ట్ రాబోతుంది అని ప్రకటన చేస్తాడు. ఏ క్షణం లో అయినా ఆమె టీ షర్ట్ లోపలకు పడొచ్చు.

అందుకే ఆమె తానూ బట్టలు మార్చుకొని వచ్చే వరకు టీ షర్ట్ ని ఎవరైనా కాపాడండి అని కోరుకుంటుంది. కానీ ఎవ్వరూ కూడా ఆమె టీ షర్ట్ ని సేవ్ చేసేందుకు ముందుకు రారు. ఆ సమయంలో గౌతమ్ ముందుకు వస్తాడు. నేను కాపాడుతాను నీ టీ షర్ట్ ని, వెళ్లి బట్టలు మార్చుకొని రా అని అంటాడు. ఇలాంటి మంచి లక్షణాలే గౌతమ్ కి ఆడియన్స్ లో ఫాలోయింగ్ పెరిగేలా చేస్తుంది. ఇదంతా పక్కన పెడితే ఆయనలో నెగేటివ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ గేమ్ ఊబిలో ఆయన పడిపోయాడు. నిన్న పృథ్వీ టీ షర్ట్ ని నిఖిల్, నబీల్ సేవ్ చేస్తారు. ఇది గమనించిన గౌతమ్ ‘గ్రూప్ గేమ్ కి ఇదే నిదర్శనం’ అని అంటాడు. మొదటి నుండి వీళ్ళు హౌస్ లో ఇలాగే ఒకరి కోసం ఒకరు నిలబడుతున్నారు కాబట్టి గౌతమ్ అలా అనుకోవడం లో కూడా తప్పు లేదు.

కానీ నిన్న హాట్ స్టార్ లో లైవ్ చూసిన ప్రతీ ఒక్కరికి గౌతమ్ కావాలని గొడవ పెట్టుకున్నట్టు అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే టీ షర్ట్ టాస్క్ లో చివరికి నిఖిల్, రోహిణి మిగులుతారు. వీరిలో ఎవరికీ మెగా చీఫ్ కంటెండర్ అయ్యే అర్హత ఉందో చెప్పాలంటూ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని అడుగుతాడు. దానికి గౌతమ్ రోహిణి కి సపోర్టు చేస్తూ ‘వైల్డ్ కార్డ్స్ హౌస్ లోకి వచ్చినప్పటి నుండి ఓజీ క్లాన్ వాళ్ళు ఎన్నో వ్యూహాలు వేసి మమ్మల్ని పంపించేయాలని అనుకున్నారు. అందుకే నేను రోహిణి సపోర్ట్ చేయాలనీ అనుకుంటున్నా’ అని అంటాడు గౌతమ్. ఇక్కడి నుండి అసలు గొడవ మొదలు అవుతుంది. ఆ అంశాన్ని పైకి తీసుకొని రాకుండా, కేవలం రోహిణి ని సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి ఉండుంటే అక్కడితో అయిపోయేది. కానీ గౌతమ్ అనవసరంగా గొడవ పెట్టుకోడానికే ఆ టాపిక్ తీసినట్టు అనిపిస్తుంది. ఇలాంటివి గౌతమ్ తగ్గించకపోతే, కచ్చితంగా ఆయన గ్రాఫ్ డౌన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.