https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ కి అన్ని ఓట్లు ఎలా వస్తున్నాయ్ అంటూ అసూయతో రగిలిపోతున్న హౌస్ మేట్స్!

ఎలిమినేషన్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఆరోజు రాత్రి ఆయన ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన చర్చ చాలా ఆసక్తి కరంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్నటువంటి టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిఖిల్, నబీల్, మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. మణికంఠ సేఫ్ జోన్ లో ఉండడం అందరికీ పెద్ద షాక్.

Written By:
  • Vicky
  • , Updated On : October 5, 2024 / 08:58 AM IST

    Bigg Boss Telugu 8(75)

    Follow us on

    Bigg Boss Telugu 8: హౌస్ లో సందర్భం ఏదైనా డ్రామా చేసి ఆడియన్స్ దృష్టిని మొత్తం తనవైపుకు లాగేందుకు ప్రయత్నం చేసే ఏకైక కంటెస్టెంట్ నాగ మణికంఠ. మొదటి రోజు నుండి ఈయన హౌస్ ఉన్న కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో, అలాగే బయట ఉన్నటువంటి ఆడియన్స్ ఎమోషన్స్ తో ఫుట్ బాల్ ఆడుకుంటున్నాడు. ఇంత దారుణమైన కంటెస్టెంట్ ని బిగ్ బాస్ చరిత్రలోనే మనం ఎక్కడా చూసి ఉండము. హౌస్ మేట్స్ అందరూ ఇతని ఎలిమినేషన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళ మనసులో ఉన్న కోపాన్ని కూడా బయటపెట్టేస్తున్నారు. ఇటీవలే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎపిసోడ్ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఎలిమినేషన్ ద్వారా ఆదిత్య ఓం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళిపోయాడు.

    ఆయన ఎలిమినేషన్ సంగతి కాసేపు పక్కన పెడితే, ఆరోజు రాత్రి ఆయన ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్య జరిగిన చర్చ చాలా ఆసక్తి కరంగా మారింది. ఎందుకంటే బిగ్ బాస్ నామినేషన్స్ లో ఉన్నటువంటి టాప్ 3 కంటెస్టెంట్స్ గా నిఖిల్, నబీల్, మణికంఠ సేఫ్ జోన్ లో ఉన్నట్టుగా ప్రకటిస్తాడు. మణికంఠ సేఫ్ జోన్ లో ఉండడం అందరికీ పెద్ద షాక్. ముందుగా ప్రేరణ మాట్లాడుతూ ‘మణికంఠ కి రెండు రోజుల్లో సేవ్ అయ్యే రేంజ్ ఓటింగ్ వచ్చేసిందా’ అని ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కాసేపటికి విష్ణు ప్రియ, మణికంఠ, నబీల్, నిఖిల్, నైనిక ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ముందుగా విష్ణు ప్రియ మాట్లాడుతూ ‘నేను , నైనిక డేంజర్ జోన్ లో ఉన్నాము. బాధ పడాల్సింది, టెన్షన్ పడాల్సింది మేము. కానీ అటెన్షన్ మొత్తం ఈ మణికంఠ కే కావాలి. అసలు వేరే వాళ్లకు ఇవ్వాల్సిన ఒక్క శాతం అటెన్షన్ కూడా వీడు ఇవ్వనివ్వట్లేదు’ అని అంటుంది. అప్పుడు మణికంఠ అమాయకంగా మాట్లాడుతూ ‘అలా కాదురా..నాకు అసలు ఏమి అర్థం కావడం లేదు’ అని అనగానే ‘ఆమ్మో..మళ్ళీ మొదలు పెట్టేసాడు’ అంటూ విష్ణు ప్రియ నవ్వుతుంది.

    అప్పుడు నబీల్ మణికంఠతో మాట్లాడుతూ ‘ఆ సైరెన్ మోగగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ అని అన్నావట కదా మణి..మరి అది అన్నోడివి ఇంకా ఏమి అర్థం కాలేదు నీకు’ అని అడగగా, మణికంఠ దానికి సమాధానం చెప్తూ ‘నా లోకంలో నేను ఉన్నాను రా, అదే సమస్య’ అని అంటాడు. అప్పుడు విష్ణు ప్రియ మాట్లాడుతూ ‘పాపం నైనిక ని చూడు. ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు కప్పలు లాగా మారాయి, ఆమెకు నువ్వు స్కోప్ ఇవ్వడం లేదు, నీ లోకం లోకి మమ్మల్ని లాగేస్తున్నావు, ఆడియన్స్ ని కూడా లాగేసుకున్నావ్ పో’ అని వెళ్ళిపోతుంది విష్ణు ప్రియ. ఇక ఆ తర్వాత సీత మాట్లాడుతూ ‘ఈ అబ్బాయికి మనమంతా ఇంత సపోర్టు చేసి వాడు ఏడుస్తున్నప్పుడు ఓదార్చి, ఇంత చేస్తుంటే చివరికి వాడు మనలని విలన్స్ ని చేసి ఆడియన్స్ కి చూపిస్తున్నాడు’ అని చెప్తుంది. ఆడియన్స్ కి అర్థమైంది ఏమిటంటే మణికంఠ గేమ్ ప్లాన్ మొత్తం హౌస్ మేట్స్ కి అర్థమైపోయింది, ఇక నుండి ఎలా ఆడుతారో చూడాలి.