Bigg Boss Telugu 8 : విష్ణు ప్రియ కోసం రక్తం చిందించిన హౌస్ మేట్స్..మొట్టమొదటి మహిళ ‘మెగా చీఫ్’!

మరో పక్క గంగవ్వ ని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్ టీం మేపుతుంది. ఆమె ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, పైగా కుదురుగా ఒక మూలాన కూర్చోకుండా కంటెస్టెంట్స్ మీద ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటుంది.

Written By: NARESH, Updated On : October 26, 2024 9:15 am

Vishnupriya as the first female 'Mega Chief'

Follow us on

Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ హిస్టరీ లోనే అదృష్టవంతురాలు ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లో ఎలాంటి గేమ్స్ ఆడనప్పటికీ కూడా ప్రతీ వారం సేవ్ అవ్వడం, పృథ్వీ చుట్టూ తిరుగుతున్నప్పటికీ జనాలు దానిని అంగీకరించడం వంటివి విష్ణు ప్రియ కే చెందింది. ఈమె స్థానంలో మరో కంటెస్టెంట్ ఉండుంటే మూడవ వారం లోనే ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. కానీ విష్ణు ప్రియ మాత్రం టాప్ 5 వరకు వెళ్లేలా ఉంది. ఇదంతా పక్కన పెడితే క్విజ్ టాస్క్ లో తప్ప, ఈ వారం మొత్తం ఆమె ఆడిన టాస్కులు ఒకటి, రెండైనా చెప్పగలరా..?, కానీ హౌస్ కి ఈ సీజన్ లో ఆమె మొట్టమొదటి మహిళ మెగా చీఫ్ గా నిల్చింది. ఈ వారం టాస్కులు ఒక్కొక్కరు ఎలా ఆడారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఓజీ క్లాన్ లో నిఖిల్, పృథ్వీ ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఆడారు. అందులో ఎలాంటి సందేహం లేదు.

వాళ్ళిద్దరి ఆట తీరు చూసేవాళ్లకు భయం వేసింది. కాళ్ళు, చేతులు విరిగిపోతాయేమో అని అనుకున్నారు. అంతలా గేమ్ ఆది ఓజీ క్లాన్ ని గెలిపించారు. కానీ ఆ కష్టానికి ఫలితం అనుభవించింది మాత్రం విష్ణు ప్రియ. మరో విశేషం ఏమిటంటే నేను 9వ వారం వరకు మెగా చీఫ్ అవ్వను, 9 వ వారం కచ్చితంగా అవుతాను అని విష్ణు ప్రియ అనేక సందర్భాలలో చెప్పుకొచ్చింది. అనుకున్నట్టుగానే ఆమె 9వ వారం లోనే మెగా చీఫ్ అయ్యింది. ఇది ఎలా సాధ్యం?, ఇలాంటివి చూసినప్పుడే బిగ్ బాస్ షో స్క్రిప్టెడ్ అని అనిపిస్తూ ఉంటుంది. ప్రతీ విషయం లో తింగరిగా వ్యవహరించే విష్ణు ప్రియ, మెగా చీఫ్ గా హౌస్ మొత్తాన్ని ఎలా మ్యానేజ్ చేస్తుంది అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్స్ లోకి వచ్చిన ఆమె, మూడవ స్థానంలో కొనసాగుతుందట. ఇంత చెత్తగా గేమ్ ఆడినప్పటికీ కూడా ఆమె మూడవ స్థానం లో కొనసాగుతుంది అంటే, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ప్రీ ఫ్యాన్ బేస్ ఉన్న కంటెస్టెంట్స్ ని హౌస్ లోకి తీసుకొని రావడం వల్ల, అసలైన గేమర్స్ కి అన్యాయం జరుగుతుంది. ఉదాహరణకు సీత అన్ని విధాలుగా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగేందుకు విష్ణు ప్రియ కంటే అర్హురాలు. కానీ ఆమెకు ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఎలిమినేట్ అయ్యింది. విష్ణు ప్రియ ఏమి ఆడకపోయినా కూడా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఇది అన్యాయం కదా, మరో పక్క గంగవ్వ ని కూడా తీసుకొచ్చి బిగ్ బాస్ టీం మేపుతుంది. ఆమె ఒక్క టాస్క్ కూడా ఆడలేదు, పైగా కుదురుగా ఒక మూలాన కూర్చోకుండా కంటెస్టెంట్స్ మీద ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటుంది.