https://oktelugu.com/

Border Gavaskar Trophy : టీమిండియాలోకి అతడు వస్తున్నాడు.. ఆస్ట్రేలియా జట్టుకు ఇక నిద్రలేని రాత్రులే..

ప్రస్తుతం టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో మూడు టెస్టుల సిరీస్ ఆడుతోంది. ఇప్పటికే బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఎనిమిది టికెట్ల తేడాతో ఓటమిపాలైంది.

Written By:
  • NARESH
  • , Updated On : October 26, 2024 9:06 am

    Border Gavaskar Trophy

    Follow us on

    Border Gavaskar Trophy : పూణే వేదికగా జరుగుతున్న రెండవ టెస్టులోనూ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది. న్యూజిలాండ్ జట్టు బౌలింగ్ ను ఎదుర్కోలేక ఆపసోపాలు పడుతోంది. న్యూజిలాండ్ జట్టుతో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత టీమిండియా దక్షిణాఫ్రికాలో టి20 సిరీస్ ఆడుతుంది. అనంతరం నవంబర్లో బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ నిమిత్తం ఆస్ట్రేలియా బయలుదేరుతుంది. గత రెండు సీజన్లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించింది. ఈ క్రమంలో ఈసారి కూడా విజయం సాధించి హ్యాట్రిక్ దక్కించుకోవాలని రోహిత్ సేన భావిస్తోంది. న్యూజిలాండ్ జట్టుపై ఆడుతున్న టీమిండియా.. బౌలింగ్ విభాగంలో ఆశించినత స్థాయిలో ప్రదర్శన చూపించడం లేదు.. పేస్ బౌలర్ బుమ్రా సత్తా చాటడం లేదు.. సిరాజ్ ఆశించినంత స్థాయిలో ఆడక పోవడంతో అతడిని పక్కన పెట్టారు. పేస్ బౌలింగ్ కు సహకరించే ఆస్ట్రేలియా మైదానాలపై భారత బౌలర్లు ఇలాంటి ప్రదర్శన చేస్తే మాత్రం దారుణమైన పరాభవం తప్పదు. ఈ క్రమంలో టీమిండియా బౌలింగ్ విభాగానికి కొత్త శక్తి ఇచ్చేలా.. సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీ జట్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. షమీ మోకాలికి ఇటీవల సర్జరీ చేయించుకున్నాడు. అందువల్లే అతడు టి20 వరల్డ్ కప్, అంతకుముందు జరిగిన ఐపిఎల్ కు దూరమయ్యాడు. వన్డే వరల్డ్ కప్ లో షమీ అద్భుతమైన ప్రదర్శన చూపించాడు. ముఖ్యంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో అత్యుత్తమంగా బౌలింగ్ వేశాడు. మోకాలి సర్జరీ చేయించుకున్న తర్వాత కోలుకున్న షమీ.. బెంగాల్ జట్టు తరుపున రంజీ క్రికెట్ ఆడనున్నాడు. ఇదే విషయాన్ని బెంగాల్ జట్టు కోచ్ లక్ష్మీ రతన్ శుక్లా పేర్కొన్నాడు.

    ఆస్ట్రేలియా జట్టుకు నిద్రలేని రాత్రులే

    ” షమీ బెంగాల్ జట్టు తరఫున ఆడతాడు. అయితే కేరళతో జరిగే మ్యాచ్ కు అతడు అందుబాటులో ఉండే అవకాశం లేదు. త్వరలోనే అతడు జట్టుతో కలుస్తాడు. కర్ణాటక, మధ్యప్రదేశ్ జట్లతో జరిగే కీలక మ్యాచ్ లలో అతడు ఆడుతాడు. షమీ అద్భుతమైన బౌలర్. జట్టుకు అతడి సేవలు అత్యంత అవసరం. ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందు అతడు రెండు మ్యాచ్ లు ఆడతానని నాతో చెప్పాడు. అతడు కనుక తన ఫామ్ దొరకబుచ్చుకుంటే ఆస్ట్రేలియాకు నిద్రలేని రాత్రులే” అని లక్ష్మీకాంత్ వ్యాఖ్యానించాడు. మోకాలి సర్జరీ తర్వాత కోలుకున్న షమీ నెట్ ప్రాక్టీస్ చేస్తున్నాడు.. తద్వారా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని పేర్కొన్నాడు. కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గత రెండు సీజన్లలో భారత్ విజేతగా నిలిచింది. ఈసారి కూడా విజయం సాధించి.. హ్యాట్రిక్ దక్కించుకోవాలని భావిస్తోంది. సిరాజ్ అంతంతమాత్రంగా ప్రదర్శన చేస్తున్న నేపథ్యంలో.. అతడి స్థానంలో షమీ కి అవకాశం ఇచ్చే పరిస్థితి కనిపిస్తోందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.