Bigg Boss Telugu 8: ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ, మనిషిలో అహంకారం ఉండడం సరికాదు. అహంకారం ఒక మనిషిని సర్వనాశనం చేస్తుంది. పురాణాల నుండి ఇప్పటి వరకు మనమంతా ఎన్నో ఉదాహరణలు చూసాము. అయినప్పటికీ కూడా మనోళ్లు ఎందుకు అహంకారం తో వ్యవహరిస్తారో ఇప్పటికీ అర్థం అవ్వని పరిస్థితి. ఇందుకు ఒక ఉదాహరణగా నిలిచాడు బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ నిఖిల్. ఈయన ప్రస్తుతం టైటిల్ రేస్ లో ఉన్నాడు. 14 వారాలు టాప్ లో ఉంటూ వచ్చిన ఈయనకి పోటీ గౌతమ్ కూడా వచ్చాడు. వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన గౌతమ్ నిఖిల్ తో సమానంగా టాస్కులు ఆడుతూ, టైటిల్ రేస్ కి అతను కూడా అతి చేరువలో ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలుస్తారు అనేది మాత్రం పక్కా, కానీ ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఇప్పటికీ సస్పెన్స్. అయితే ఈరోజు ఎపిసోడ్ నిఖిల్ అహంకారంతో ప్రవర్తించిన తీరు కారణంగా అతని గ్రాఫ్ బాగా పడిపోయే అవకాశాలు ఉన్నాయి.
‘ఓటు ఫర్ అప్పీల్’ టాస్కులో భాగంగా బిగ్ బాస్ నిఖిల్, గౌతమ్ కి మధ్య ఒక టాస్క్ పెడుతాడు. టాస్క్ ఏమిటంటే ఒకరి చొక్కాపై ఒకరు రంగు పోసుకోవాలి. అలా ఎవరి చొక్కా మీద అయితే ఎక్కువ రంగు ఉంటుందో, వాళ్ళు ఈ టాస్కు లో ఓడిపోయి ఓటుని అప్పీల్ చేసుకునే అవకాశం కోల్పోతాడు. ఈ టాస్క్ లో నిఖిల్, గౌతమ్ హోరాహోరీగా తలపడుతారు. ఇన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ తో తలపడిన ఏ కంటెస్టెంట్ కూడా ఫిజికల్ గా అతన్ని నిలువరించలేకపోయారు. కానీ గౌతమ్ మాత్రం నిఖిల్ కి చాలా టఫ్ ఫైట్ ఇస్తాడు. దీనికి ఆవేశంతో ఊగిపోయిన నిఖిల్ నువ్వు నన్ను కొట్టావు అంటూ గౌతమ్ పై నిందలు వేసాడు. రంగులు పూసే క్రమంలో చెయ్యి నీకు తాకి దెబ్బ తగిలి ఉండొచ్చేమో కానీ, కావాలని మాత్రం కొట్టలేదని అంటాడు గౌతమ్.
అప్పుడు నిఖిల్ ‘ఏమో..కొట్టినా కొట్టి ఉండొచ్చు నువ్వు’ అని అంటాడు. అప్పుడు గౌతమ్ ‘కావాలని ఎవరైనా కొడతారా?, ఇందాక నువ్వు నన్ను ఇక్కడి నుండి అక్కడి వరకు ఈడ్చుకొని వెళ్ళావు, నేను నీ మీద ఇలా నిందలు ఏమైనా వేశానా?’ అని అంటాడు గౌతమ్. అప్పుడు నిఖిల్ ‘పొయ్యి కూర్చో బే’ అని అనడంతో గౌతమ్ ‘ఏమన్నావ్? బే నా?, నన్ను ఎలా అంటావ్ ఆ మాట. మొన్ననే నేను ఎదో మాట జారితే ఇంత కోపం వచ్చింది నీకు. ఇప్పుడు ఈ మాట ఎలా అన్నావ్’ అని అంటాడు గౌతమ్. అలా వీళ్లిద్దరి మధ్య పెద్ద యుద్ధమే నడుస్తుంది. ఇన్ని రోజులు నిఖిల్ తన కంటే ఫిజికల్ గా తక్కువ బలం ఉన్నవాళ్ళతో గేమ్స్ ఆడాడు, అందుకే ఆయన అన్ని గెలిచాడు, కానీ ఒక్కసారి సరైన వ్యక్తితో పోటీ తగలడంతో నిఖిల్ అహం దెబ్బతినింది, అందుకే ఆయన అలా రెచ్చిపోయాడని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెట్స్ చేస్తున్నారు.