Homeఆంధ్రప్రదేశ్‌Dhanunjaya Reddy: వర్దెల్లి మురళిని కాదని.. ధనుంజయ రెడ్డి వైపు జగన్ ఎందుకు మొగ్గాడు.. సాక్షి...

Dhanunjaya Reddy: వర్దెల్లి మురళిని కాదని.. ధనుంజయ రెడ్డి వైపు జగన్ ఎందుకు మొగ్గాడు.. సాక్షి లో జరుగుతున్న పరిణామాలేంటి?

Dhanunjaya Reddy: సాక్షిలో చేసే కంటే ముందు మురళి ఆంధ్రజ్యోతిలో కొనసాగాడు. అల్లం నారాయణ, కే శ్రీనివాస్, మురళి లాంటి వాళ్లంతా సెంట్రల్ డెస్క్ లో పనిచేసేవాళ్ళు. నాడు ఆంధ్రజ్యోతి ఎడిటర్ గా రామచంద్ర మూర్తి ఉండేవారు. రామచంద్ర మూర్తి హెచ్ఎంటివి కి వెళ్లిపోయిన తర్వాత.. మురళి తన ప్రయాణాన్ని సాక్షి వైపు మళ్ళించారు. సుదీర్ఘకాలం సాక్షికి ఎడిటర్ గా ఉన్నారు. ఎడిటర్ స్థానంలో ప్రతి ఆదివారం గణతంత్రం పేరుతో వ్యాసాలు రాసేవారు. అవి జగన్ కు పూర్తి అనుకూలంగా.. చంద్రబాబు, రామోజీరావు, రాధాకృష్ణకు వ్యతిరేకంగా ఉండేది.. ఇవి ఎవరు చదువుతారు? ఇందులో జర్నలిస్టు కోణం ఏముంది? అనే ప్రశ్నలకు తావు లేకుండా మురళి వ్యాసాల పరంపర మొన్నటిదాకా సాగిపోయింది. ఇక ఇటీవల ఎన్నికల్లో జగన్ ఓటమిపాలయ్యాడు. 11 సీట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కి కత్తెరలు వేశాడు. సజ్జల భార్గవ్ ను దూరం పెట్టాడు. తెరపైకి కొత్త పొలిటికల్ అడ్వైజర్ ను తీసుకున్నాడు. ఇది జరిగిన కొద్ది రోజులకే సజ్జల రామకృష్ణారెడ్డికి బాగా దగ్గరైన మురళిని ఎడిటర్ స్థానం నుంచి తొలగించి..ఎడిటోరియల్ బోర్డు సభ్యుడుగా నియమించాడు. ఎడిటర్ గా ధనుంజయ రెడ్డిని నియమించాడు..

జగన్ క్యాంపులో మనిషే.

ధనుంజయ రెడ్డి ఈనాడులో తన పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించాడు. మెరిట్ క్యాండెట్. బాగా రాయగలడు, చదువరి కూడా. గతంలో సాక్షిలో ఉన్నప్పుడు రెసిడెంట్ ఎడిటర్ గా కొనసాగాడు. సాక్షి ప్రతి బుధవారం భవిత అనే ఎడ్యుకేషన్ మ్యాగ్జిన్ ని పబ్లిష్ చేసేది. దానికి హెడ్ గా ధనుంజయ రెడ్డి ఉండేవాడు. అప్పట్లో భవిత ఈనాడు ప్రతిభను బీట్ చేసింది. కొద్దిరోజులు సాక్షి అదే టెంపో ను కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. ఏమైందో తెలియదు గాని భవితను పక్కన పెట్టింది. దానిని పూర్తిగా వెబ్ ఎడిషన్ కు పరిమితం చేసింది. ఇక మురళి స్థానంలో ధనుంజయ రెడ్డి ఎడిటర్ గా బాధ్యతలు స్వీకరించారు. సహజంగా ఏపీలో అధికారంలో లేదు కాబట్టి సాక్షికి గవర్నమెంట్ యాడ్స్ రావడం కష్టం. దానిపై ఆశలు కూడా వదులుకోవాల్సిందే. తెలంగాణలో ఇప్పటికైతే ఇబ్బంది లేదు.. రేవంతుడు ఈనాడు, జ్యోతికి ఇచ్చినట్టే సాక్షికి కూడా జాకెట్ యాడ్స్ ఇస్తున్నాడు.. సాక్షిలో ఇప్పటివరకైతే కత్తిరింపులు, ఉద్యోగుల కోతలైతే లేవు. మున్ముందు ఏం చేస్తారో తెలియదు గాని.. ఇప్పటికైతే ఉద్యోగుల విషయంలో ఉక్ ఉదారతనే చూపుతున్నారు. సాక్షి ఎడిటర్ పోస్ట్ కంటే ముందు ధనుంజయ రెడ్డి ఏపీ ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టులో కొనసాగాడు.. జగన్ కు అత్యంత దగ్గర ఫోల్డ్ లో పనిచేశాడు. జగన్ నమ్మే వ్యక్తుల్లో ధనుంజయ రెడ్డి కూడా ఒకడు. అందువల్లే సాక్షి బాధ్యతలు అతని మీద పెట్టారని తెలుస్తోంది. చూడాలి మరి సాక్షిని ధనుంజయ రెడ్డి ఏం చేస్తారో!

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version