https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : నిఖిల్ కోసం టేస్టీ తేజ కి వెన్నుపోటు పొడిచిన గౌతమ్..మనస్తాపానికి గురైన తేజ!

ఎవరైనా ఆ పని చేసి ఉండుంటే ఇంత బాధపడే వాడిని కాదు, నువ్వు చేసావురా అదే నా బాధ అని టేస్టీ తేజా బాగా ఫీల్ అవుతాడు. ఈ విషయంలో గౌతమ్ కూడా తప్పు చేసినట్టు చూసే ఆడియన్స్ కి అనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 10:04 AM IST
    Follow us on

    Bigg Boss Telugu 8 : మెగా చీఫ్ టాస్క్ పూర్తి అయిన తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ ని నిర్వహించాడు. గత సీజన్స్ లో ఎవిక్షన్ పాస్ కోసం గేమ్స్ బీభత్సంగా ఉండేవి. కానీ ఈ సీజన్ లో మాత్రం కేవలం హౌస్ మేట్స్ అభిప్రాయంతోనే ఎవరికి మెగా చీఫ్ దక్కాలి అనే ప్రక్రియ జరిగింది. ఈ ప్రక్రియ లో ఒక పాము ఉంటుంది. ఆ పాము పక్కనే ఏర్పాటు చేసిన టేబుల్ మీద హౌస్ లో కంటెస్టెంట్స్ ఫోటోలతో కూడిన గుడ్లు ఉంటాయి. బిగ్ బాస్ ప్రతీ రౌండ్ కి ఇద్దరిని పిలిచి, వాళ్ళిద్దరిని ఏకాభిప్రాయంతో ఎవరికి అయితే ‘ఎవిక్షన్ పాస్’ దొరకకూడదు అనుకుంటారో, వాళ్ళ ఫోటోతో ఉన్న గుడ్డుని పాము నోట్లో వేయాలి. ముందుగా మెగా చీఫ్ అయిన కారణంగా ప్రేరణ ని బిగ్ బాస్ 5 మందిని ఎంచుకొని ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ నుండి తప్పించాల్సిందిగా ఆదేశిస్తాడు. అప్పుడు ఆమె గౌతమ్, విష్ణు ప్రియ, పృథ్వీ, హరితేజ, గంగవ్వ కి సంబంధించిన గుడ్లను పాము నోట్లో వేస్తుంది.

    హరితేజ గుడ్డుని వేయడానికి ప్రేరణ కాస్త గ్యాప్ ఇచ్చి, అలోచించి వేస్తుంది. ఆ తర్వాత ప్రేరణ ఆమె వద్దకు వెళ్లి మాట్లాడే ప్రయత్నం చేయగా, నువ్వు గ్యాప్ ఇచ్చినప్పుడే నాకు అర్థమైంది, నా గుడ్డునే వేస్తావని, నీ స్నేహితులు ఉన్నారు కదా, వాళ్ళవి వేసే ధైర్యం లేదు, దీనినే ఫెవరిజం అని అంటారు అంటుంది హరి తేజ. అప్పుడు ప్రేరణ వివరించే ప్రయత్నం చేయగా, దయచేసి నాకు కాస్త గ్యాప్ ఇవ్వు, పొరపాటున నీ మీద నోరు జారే ప్రమాదం ఉంది అని అంటుంది హరి తేజ. ఈ సంఘటన జరిగిన కాసేపటికి నిఖిల్, గౌతమ్ ని బిగ్ బాస్ పిలిచి, ఇద్దరు ఏకాభిప్రాయంతో ఒక హౌస్ మేట్ ని ‘ఎవిక్షన్ ఫ్రీ పాస్’ గేమ్ నుండి తప్పించమని ఆదేశిస్తాడు బిగ్ బాస్. ముందుగా నిఖిల్ తన గుడ్డుని తానే పాము నోట్లో వేసుకోవడానికి సిద్ధం అవుతాడు.

    దానికి గౌతమ్ ఒప్పుకోడు, నాతో పాటు వచ్చిన వాడివి, త్యాగాలు చేసుకోవడానికి అసలు ఒప్పుకోను, నీకు అంత త్యాగం చేయాలని అనిపిస్తే బిగ్ బాస్ టైటిల్ ని నాకు త్యాగం చెయ్యి అని నిఖిల్ గుడ్డుని లాక్కొని పక్కన పెడుతాడు. ఆ తర్వాత గౌతమ్ ప్రేరణ ని తప్పించాలని అనుకుంటున్నాను అని అంటాడు. అప్పుడు నిఖిల్ దయచేసి అలా చేయొద్దు ఆమె నామినేషన్స్ లో ఉంది, టేస్టీ తేజ ని చేద్దాం, అతను నామినేషన్ లో లేడు అని అంటాడు. దానికి గౌతమ్ కూడా ఏకీభవించి ఇద్దరు కలిసి టేస్టీ తేజ గుడ్డుని పాము నోట్లో వేసేస్తారు. దీనికి టేస్టీ తేజ బాధపడుతూ అసలు ఏమి గేమ్ ఆడుతున్నావ్ రా అని గౌతమ్ ని అంటాడు. దానికి తేజ ‘ఏమిరా..ఆటలు ఆడి నువ్వు నామినేషన్స్ నుండి సేవ్ అవ్వలేవా?, నీకు ఎందుకు ఎవిక్షన్ పాస్’ అని అంటాడు. ఆ సమయంలో తేజ కామెడీ చేసాడు కానీ, ఆ తర్వాత మాత్రం చాలా బాధపడ్డాడు. ఎవరైనా ఆ పని చేసి ఉండుంటే ఇంత బాధపడే వాడిని కాదు, నువ్వు చేసావురా అదే నా బాధ అని టేస్టీ తేజా బాగా ఫీల్ అవుతాడు. ఈ విషయంలో గౌతమ్ కూడా తప్పు చేసినట్టు చూసే ఆడియన్స్ కి అనిపించింది.