https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : పృథ్వీ వర్సస్ నభీల్ గొడవలో తప్పు ఎవరిది..? పృథ్వీ నిజంగానే నభీల్ ని మోసం చేశాడా?

అసలు ఈ గేమ్ లో డీల్ పెట్టుకోవాలని అనుకోవడం నభీల్ చేసిన తప్పు, దానిని అంగీకరించడం కూడా పృథ్వీ చేసిన తప్పే, ఇద్దరు చివరికి ఎర్రోళ్ళు అయిపోయారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : November 9, 2024 / 10:08 AM IST

    Prithvi vs Nabeel

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో మొదటి నుండి కన్నడ బ్యాచ్ అని పిలవబడే ప్రేరణ, నిఖిల్, యష్మీ, పృథ్వీ మంచి స్నేహితులుగా కొనసాగుతూ ఉన్నారు. వీళ్ళతో నభీల్ కూడా చాలా స్నేహంగా ఉండేవాళ్ళు కానీ, ముఖ్యమైన సమయాల్లో నభీల్ వీళ్ళు నభీల్ ని అసలు పట్టించుకోరు. ఉదాహరణకి ఈ వారం మెగా చీఫ్ ని ఎంచుకునే ప్రక్రియ లో నిఖిల్, యష్మీ కేవలం ప్రేరణ, పృథ్వీ మెగా చీఫ్స్ అవ్వాలని వాళ్ళ బాక్సులలో మూటలు వేశారు కానీ నభీల్ ని అసలు పట్టించుకోలేదు. దీనికి ముందు నభీల్ పృథ్వీ తో ఒక డీల్ పెట్టుకుంటాడు, నేను ముందుగా బయటకి వస్తే నీకు సపోర్టు చేస్తాను, నువ్వు ముందుగా బయటకి వస్తే నాకోసం సపోర్టు చెయ్యి, మెగా చీఫ్ అయితే మన ఇద్దరిలో ఎవరో ఒకరు అవ్వాలి అని అంటాడు నభీల్. అయితే ఈ డీల్ పృథ్వీ సీరియస్ గా పాటించలేదు. అతనిది పోతే పోయింది, బయటకి వచ్చిన తర్వాత డీల్ ప్రకారం నాకు సపోర్టు చేస్తాడు అని చాలా తెలివిగా ఆలోచిస్తాడు పృథ్వీ.

    నిఖిల్ , యష్మీ ఇద్దరు కలిసి నభీల్ బాక్సులో మూటలు వేస్తున్నప్పుడు పృథ్వీ వాళ్ళను ఆపే ప్రయత్నం అసలు చేయలేదు. ఒకవేళ పృథ్వీ నభీల్ ని టార్గెట్ చేయకండి అని బలంగా నిఖిల్, యష్మీ లకు చెప్పి ఉండుంటే వాళ్లిద్దరూ నభీల్ ని టార్గెట్ చేయలేదు. మీ ఇష్టం ఏదైనా చేసుకోండి, ఒకవేళ నభీల్ బయటకి వచ్చినా నన్ను సపోర్టు చేస్తాడు అని అంటాడు పృథ్వీ. ఇక ఆ తర్వాత నిఖిల్, యష్మీ, హరితేజ నభీల్ ని ఎక్కువగా టార్గెట్ చేసి, అతని బాక్సులో ఎక్కువ మూటలు వేసి మెగా చీఫ్ రేస్ నుండి తప్పిస్తాడు. నభీల్ బయటకి వచ్చిన తర్వాత పృథ్వీ అతనితో మాట్లాడుతూ ‘బయటకి వస్తే సపోర్టు చేస్తాను అన్నావు కదా, ఆ మాట మీదనే కట్టుబడి ఉన్నావా’ అని అడుగుతాడు. నభీల్ దానికి సమాధానం ఇస్తూ ‘ఇప్పుడు నేను ఆ డీల్ కి కట్టుబడి లేను, పరిస్థితులు నాకు అనుకూలించలేదు,రిస్క్ చేయలేను’ అని అంటాడు.

    ఇక ఆ తర్వాత నభీల్ ని పృథ్వీ పై ఎక్కువ ఫోకస్ చేస్తూ అతని బాక్సులో మూటలు వేస్తూ ఉంటాడు. నిఖిల్ అతన్ని బ్లాక్ చేస్తే, అవతల వైపుకు వెళ్లి పృథ్వీ మీద వేస్తాడు. దీనికి పృథ్వీ ఫైర్ అవుతాడు. నా మీద ఎందుకు వేస్తున్నావ్ అని పెద్దగా కోపం తెచ్చుకొని అరుస్తాడు. ఆ తర్వాత పృథ్వీ బయటకి వచ్చాక నభీల్ తో పెద్ద గొడవ పెట్టుకుంటాడు. ఈ గొడవలో పృథ్వీ ని కంట్రోల్ చేయడానికి అవినాష్, నిఖిల్ చాలా ప్రయత్నం చేస్తారు, కానీ వాళ్ళ మాటలను లెక్క చేయడు. నభీల్ డీల్ ని ఉల్లంగించాడు అనే కోపాన్ని మొత్తం పృథ్వీ తనపై మూటలు వేసాడు అనే కారణంగా చూపిస్తాడు. అసలు ఈ గేమ్ లో డీల్ పెట్టుకోవాలని అనుకోవడం నభీల్ చేసిన తప్పు, దానిని అంగీకరించడం కూడా పృథ్వీ చేసిన తప్పే, ఇద్దరు చివరికి ఎర్రోళ్ళు అయిపోయారంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు.