https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : హద్దులు దాటిన ‘మెగా చీఫ్’ ప్రేరణ ఓవర్ యాక్షన్..విష్ణుప్రియ కి నరకం చూపిస్తుందిగా!

మెగా చీఫ్ ఆదేశాలను పాటించడం హౌస్ మేట్స్ కర్తవ్యం, విష్ణు చేయడం లేదు, దానికి మీరు ఏమి చేస్తారో మీకే వదిలేస్తున్న బిగ్ బాస్ అని అంటుంది ప్రేరణ. ఇదంతా చూసిన తర్వాత ఆడియన్స్ కి ప్రేరణ చాలా అతి చేస్తుంది అని అనిపించింది.

Written By:
  • Vicky
  • , Updated On : November 9, 2024 / 10:03 AM IST

    Bigg boss 8 telugu

    Follow us on

    Bigg Boss Telugu 8 : ఈ వారం బిగ్ బాస్ హౌస్ కి మెగా చీఫ్ గా ప్రేరణ ని హౌస్ మేట్స్ అందరూ ఎంచుకున్నారు. మొదటి వారం నుండి ఎంతో కష్టపడి టాస్కులు ఆడుతున్న ఆమె, మెగా చీఫ్ అయ్యేందుకు దగ్గరకు వచ్చి చేజారిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రేరణ ని అభిమానించే వారితో పాటుగా, ఇతర కంటెస్టెంట్స్ కి సంబంధించిన అభిమానులు కూడా ప్రేరణ మెగా చీఫ్ అయితే బాగుంటుంది అని సోషల్ మీడియా లో కోరుకున్నారు. ఎట్టకేలకు ఈ వారం ఆమెకు పరిస్థితులు బాగా కలిసొచ్చాయి, హౌస్ మేట్స్ అందరూ కూడా సహకరించారు, మెగా చీఫ్ అయ్యింది. అయితే ప్రేరణ మెగా చీఫ్ అయ్యాక కాస్త విష్ణు ప్రియ విషయంలో ఓవర్ యాక్షన్ చేసింది అని చూసే ఆడియన్స్ కి అనిపించింది. విష్ణు ప్రియ కి, ప్రేరణ కి మొదటి నుండి ఒకరంటే ఒకరికి పడట్లేదు అనే విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా విష్ణు ప్రియ కి ప్రేరణ అంటే నచ్చదు అని చూసే ఆడియన్స్ కి అనిపిస్తుంది కానీ, ప్రేరణ కి కూడా విష్ణు ప్రియ అంటే అంత పగ ఉందని నిన్నటి ఎపిసోడ్ లోనే తెలిసింది.

    పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రేరణ నిన్న విష్ణు ప్రియ బెడ్ రూమ్ లోకి దూరింది. అక్కడ ఆమె బెడ్ పక్కన పెట్టుకున్న టేబుల్ పై తన మేకప్ కిట్ ఉంది. దీనిని చూసిన ప్రేరణ వాటిని సర్దేసి లోపల పెట్టేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విష్ణు ప్రియ, అసలు ఏమి చేస్తున్నావ్, వాటిని ఎందుకు లోపల పెడుతున్నావ్ అని అడుగుతుంది. ఇలా వస్తువులను ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోకు, శుభ్రంగా పెట్టుకో అంటుంది. నాకు అనుకూలంగా పెట్టుకున్నాను, నీ దగ్గరకి వచ్చి పెట్టలేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావ్, నా ఐ లైనర్ ఎక్కడ ఉంది?, చిరాకు పుట్టించకుండా ఎక్కడ ఉన్నవి అక్కడ పెట్టి అని అంటుంది. ఇక తర్వాత కూడా ఈ విషయం లో వాదన జరగడంతో కోపం తో ఊగిపోయిన విష్ణు ప్రియ తన తానూ ఉండే బెడ్ రూమ్ ని ప్రేరణ మీద కోపంతో కావాలని చెరిపేస్తుంది.

    ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రేరణ విష్ణు ప్రియ ని పని చేయడం లేదని గొడవకి దిగుతుంది. ఈరోజు ఇచ్చిన పనిని నువ్వు చేయలేదు అని ప్రేరణ అనగా, నేను చేశాను కదా ఇందాక రెండు పనులు, నాకు భుజాలు చాలా నొప్పిగా ఉన్నాయి, అయినా కూడా మాటకి ఎదురు చెప్పకుండా పని చేశాను అని అంటుంది విష్ణు. అప్పుడు ప్రేరణ అది ఈరోజు ఇచ్చిన పని కాదు, నిన్న ఇచ్చిన పని, నేటి పని నువ్వు చేయలేదు అని అంటుంది. ఒక్కేరోజు అన్ని చేయడం అంటే నా వల్ల కాదు అని అంటుంది విష్ణు ప్రియ. అయితే పనులు చేయను అంటావ్?, సరే నీ ఇష్టం పో అని వెళ్తుంది ప్రేరణ. అసలు నేను ఒక్క పని కూడా చేయను, ఏమి చేసుకుంటావో చేసుకో అని అంటుంది విష్ణు ప్రియ. మెగా చీఫ్ ఆదేశాలను పాటించడం హౌస్ మేట్స్ కర్తవ్యం, విష్ణు చేయడం లేదు, దానికి మీరు ఏమి చేస్తారో మీకే వదిలేస్తున్న బిగ్ బాస్ అని అంటుంది ప్రేరణ. ఇదంతా చూసిన తర్వాత ఆడియన్స్ కి ప్రేరణ చాలా అతి చేస్తుంది అని అనిపించింది.