https://oktelugu.com/

Bigg Boss Telugu 8: తారాస్థాయికి చేరుకున్న గౌతమ్, నిఖిల్ గొడవలు..బయటకి వెళ్లి కొట్టుకుందాం అంటూ బిగ్ బాస్ డోర్లు బద్దలు!

మంచి స్నేహితులుగా ఉన్నటువంటి గౌతమ్, నిఖిల్..బిగ్ బాస్ హౌస్ లో మాత్రం యష్మీ అనే అమ్మాయి కోసం భద్ర శత్రువులుగా మారిపోయారు. యష్మీ కి నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్ కి కూడా యష్మీ అంటే ఇష్టమే కానీ బయటకి చెప్పకుండా ఆమెని తన వెనుక తిప్పుకునేలా చేస్తున్నాడు.

Written By:
  • Vicky
  • , Updated On : November 4, 2024 / 08:05 AM IST

    Bigg Boss Telugu 8(198)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో జరిగిన మంచి టాస్కులు ఒక నాలుగు చెప్పమంటే ఆడియన్స్ కి కూడా కష్టమే కానీ, హౌస్ మేట్స్ మధ్య ఎన్ని గొడవలు జరిగాయి అని అడిగితే మాత్రం చాలానే ఉంటాయి. టాస్కులకు కావాల్సిన మెటీరియల్స్ తయారు చేయడానికి ఎక్కువ బడ్జెట్ అవుతుంది, ఎందుకు వృధా అని బిగ్ బాస్ అనుకున్నాడో ఏమో కానీ, గొడవలతోనే టీఆర్ఫీ రేటింగ్స్ ని రప్పించుకుందామని చూస్తున్నాడు. ఈ గొడవల్ని చూసే ఆడియన్స్ కి మెంటల్ టెన్షన్. ఎంటర్టైన్మెంట్ కోసం ఒక గంటపాటు ఈ షోని చూద్దాం అని టీవీ ఆన్ చేసే ఆడియన్స్ కి పెద్ద తలపోటు వచ్చేలా చేస్తుంది ఈ సీజన్. అందుకే ఈ సీజన్ మంచి టీఆర్ఫీ రేటింగ్స్ తో మొదలై, ఇప్పుడు ఫ్లాప్ కి డిజాస్టర్ కి మధ్యలో ఊగిసలాడుతుంది. వీకెండ్ ఎపిసోడ్స్ కి కూడా 4 టీఆర్ఫీ రేటింగ్స్ వస్తున్నాయంటే, ఈ సీజన్ ఎంత డిజాస్టర్ ఫ్లాప్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

    ఇదంతా పక్కన పెడితే బయట మంచి స్నేహితులుగా ఉన్నటువంటి గౌతమ్, నిఖిల్..బిగ్ బాస్ హౌస్ లో మాత్రం యష్మీ అనే అమ్మాయి కోసం భద్ర శత్రువులుగా మారిపోయారు. యష్మీ కి నిఖిల్ అంటే ఇష్టం, నిఖిల్ కి కూడా యష్మీ అంటే ఇష్టమే కానీ బయటకి చెప్పకుండా ఆమెని తన వెనుక తిప్పుకునేలా చేస్తున్నాడు. అయితే వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చిన గత సీజన్ కంటెస్టెంట్ గౌతమ్, యష్మీ తో కాస్త క్లోజ్ అయ్యి, ఆమెకి ఒకరోజు ప్రపోజ్ చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్నప్పటి నుండి నిఖిల్ కి గౌతమ్ అంటే నచ్చడం లేదు. చిన్న గొడవని కూడా కావాలని పెద్దది చేసుకుంటూ వెళ్తున్నాడు నిఖిల్. స్మార్ట్ ఫోన్ వెర్సస్ స్మార్ట్ ఛార్జర్స్ అనే టాస్క్ వద్ద వీళ్లిద్దరికీ గొడవ మొదలు అవుతుంది. అక్కడి నుండి నిఖిల్ కి గౌతమ్ అంటే పట్టరాని కోపం.

    గౌతమ్ పేరు ఎత్తితేనే మండిపడిపోతున్నాడు. అంతే కాకుండా గత వారం మొత్తం గౌతమ్ మీద నిఖిల్ ఎంత అసూయ చూపించాడో మన అందరం చూస్తూనే ఉన్నాం. పృథ్వీ, యష్మీ తో కూర్చొని గౌతమ్ మీద ఎన్నో సెటైర్లు, జోకులు వేసుకున్నారు. వాటర్ టాస్క్ లో గొడవ జరిగినప్పుడు గౌతమ్ నిఖిల్ ని ఎదో బూతు మాట అన్నాడని పదే పదే రుద్దే ప్రయత్నం చేసాడు నిఖిల్. దానిని నాగార్జున కూడా సమర్ధించడం కొసమెరుపు. ఆ వీడియో ని ఎన్నిసార్లు ప్లే చేసి చూపించినా కూడా గౌతమ్ తిట్టినట్టు ఎవ్వరికి అనిపించలేదు. బూతులు కంట్రోల్ చేసుకున్నాడు, అది కూడా తప్పు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసి చూపించారు. సరే ఇక్కడితో వీళ్లిద్దరి మధ్య గొడవకి ఫుల్ స్టాప్ పడింది అని అందరూ అనుకున్నారు. కానీ ఈరోజు జరగబోయే నామినేషన్స్ లో వీళ్ళ మధ్య గొడవ హద్దులు దాటేసింది. నిన్నటి ఎపిసోడ్ చివర్లో ఇద్దరి మధ్య మాటమాట పెరిగి, నేను బయటకి రావడానికి సిద్ధం, నువ్వు కూడా రెడీ నా, బయటకి వెళ్లి నువ్వో నేనో తేల్చుకొని వద్దాం అని నిఖిల్ అంటాడు. డోర్ తియ్యమను, నేను రావడానికి రెడీ అని ఇద్దరు డోర్ వద్దకు వెళ్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ డోర్ తెరిచాడా లేదా అనేది చూడాలి.