https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : 4 వారాలకు ఇంత రెమ్యూనరేషనా..? అది భరించలేకనే సోనియా ని ఎలిమినేట్ చేశారా?

ఎలిమినేషన్ లక్షలాది మంది ప్రేక్షకులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లో ఈమె కంటెస్టెంట్స్ పై నోరు జారే విధానం, అలాగే టాప్ కంటెస్టెంట్స్ ని తన గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఆటలను మొత్తం చెడగొట్టే తీరు, ఇవన్నీ చూసి ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగింది. అంతే కాదు విష్ణు ప్రియా ని అడల్ట్ జోక్స్ నాపై వెయ్యొద్దు అని చెప్పుకొచ్చిన ఈమె, హౌస్ లో నిఖిల్ ,పృథ్వీ లతో దాదాపుగా అడల్ట్ కంటెంట్ నే ఇచ్చింది.

Written By:
  • Vicky
  • , Updated On : September 30, 2024 / 08:24 AM IST

    Bigg Boss Telugu 8(54)

    Follow us on

    Bigg Boss Telugu 8: నెగటివ్ అయినా,పాజిటివ్ అయినా ఈ సీజన్ లో కేవలం నాలుగు వారాల్లోనే బోలెడంత కంటెంట్ ఇచ్చి తనదైన మార్కు ని ఏర్పాటు చేసుకున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది సోనియా నే అని చెప్పొచ్చు. ఈమె ఎలిమినేషన్ లక్షలాది మంది ప్రేక్షకులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. హౌస్ లో ఈమె కంటెస్టెంట్స్ పై నోరు జారే విధానం, అలాగే టాప్ కంటెస్టెంట్స్ ని తన గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఆటలను మొత్తం చెడగొట్టే తీరు, ఇవన్నీ చూసి ఆడియన్స్ కి చాలా చిరాకు కలిగింది. అంతే కాదు విష్ణు ప్రియా ని అడల్ట్ జోక్స్ నాపై వెయ్యొద్దు అని చెప్పుకొచ్చిన ఈమె, హౌస్ లో నిఖిల్ ,పృథ్వీ లతో దాదాపుగా అడల్ట్ కంటెంట్ నే ఇచ్చింది. వాళ్ళ శరీరం పై ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తూ , ‘సిగరెట్ మానెయ్..నువ్వు ఏది కోరితే అది ఇస్తాను’ వంటి డైలాగ్స్ నిఖిల్ తో కొడుతూ, ఇలా ఆద్యంతం అడల్ట్ కంటెంట్ నే ఇచ్చింది.

    ఇదంతా గమయించిన ఆడియన్స్ ఈమె నామినేషన్స్ లోకి రాగానే బయటకి పంపేయాలి అని బలంగా నిర్ణయించుకున్నారు. ఒక విధంగా ఈమెని యష్మీ నామినేషన్స్ సమయంలో రోస్ట్ చేసేసింది అనే చెప్పాలి. ఆ ప్రభావం కూడా ఈమె ఎలిమినేట్ అవ్వడానికి ఒక కారణం అవ్వొచ్చు. సోషల్ మీడియా లో నెటిజెన్స్ ‘మిషన్ సోనియా ఎలిమినేషన్’ అనే ట్యాగ్ తో పోస్టులు వేశారంటే ఈమె ఎంత నెగటివిటీ ని సంపాదించుకుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఈమె బోలెడంత కంటెంట్ ఇస్తుంది, దాని వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ వస్తుందని బిగ్ బాస్ ఈమెని సేవ్ చేసేందుకు వెయ్యని ఎత్తు లేదు. ఓటింగ్ లో చివరి ఇద్దరు కంటెస్టెంట్స్ కి సరిసమానమైన ఓటింగ్ వచ్చి ఉండుంటే కచ్చితంగా సోనియా ని ఎలిమినేట్ చేసేవారు కాదు. కానీ బాటమ్ లో ఉన్నటువంటి ఆదిత్య,సోనియా మధ్య భారీ ఓటింగ్ తేడా ఉంది.

    అందుకే వేరే గత్యంతరం లేక హౌస్ మేట్స్ చేత డేంజర్ జోన్ లోకి వచ్చిన మణికంఠ ని, ఆడియన్స్ చేత అతి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా ని నిల్చోబెట్టి వీళ్ళిద్దరిలో ఎవరు హౌస్ లో ఉండాలో తేల్చండి అని కంటెస్టెంట్స్ ని అడగగా, బిగ్ బాస్ టీం కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ కి ఓటు వేస్తారు, అతన్ని ఎలిమినేట్ చేసి సోనియా ని సేవ్ చెయ్యొచ్చు లే అనుకున్నారు. కానీ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ టీం ప్లాన్ ని అట్టర్ ఫ్లాప్ చేసారు. అయితే సోనియా రెమ్యూనరేషన్ కూడా చాలా భారీగానే ఉందట, ఒక వారానికి గాను ఆమెకు మూడు లక్షల రూపాయిలు ఇచ్చారట. అంటే నాలుగు వారాలకు కలిపి 12 లక్షలు. రాబోయే వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్స్ కోసం బిగ్ బాస్ యాజమాన్యం చాలానే ఖర్చు చేసింది, కాబట్టి సోనియా ఇంకా ఎక్కువ రోజులు కొనసాగితే అదనపు భారం పెరుగుతుందని ఎలిమినేట్ చేసి ఉండొచ్చని మరికొందరు అంటున్నారు.