https://oktelugu.com/

Bigg Boss Telugu 8: మణికంఠ పై ఇన్ని అభియోగాలా..? నిఖిల్ మణికంఠతో ఇన్ని రోజులు స్నేహంగా ఉన్నట్టు నటించాడా?

ఆడియన్స్ చేత అతి తక్కువ ఓట్లతో సోనియా డేంజర్ జోన్ లో ఉంటుంది. వీళ్లిద్దరి లో హౌస్ లో ఎవరు ఉండాలని అనుకుంటున్నారు అని నాగార్జున అడగగా నిఖిల్, పృథ్వీ రాజ్ మరియు నైనికా మినహా మిగిలిన వాళ్ళందరూ మణికంఠ హౌస్ లో ఉండాలని కోరుకుంటారు.

Written By:
  • S Reddy
  • , Updated On : September 30, 2024 / 08:20 AM IST

    Bigg Boss Telugu 8(53)

    Follow us on

    Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ మణికంఠ ని బాగా టార్గెట్ చేస్తున్నారా ?, అతను నిజంగా ఎవరికీ నచ్చడం లేదా?, లేకపోతే మణికంఠ ని ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోతున్నారా?, సీజన్ ప్రారంభమై నాలుగు వారాలు పూర్తి అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి కానీ, షో ని చూస్తున్న ఆడియన్స్ కి కానీ అర్థం అవ్వని కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది మణికంఠ మాత్రమే. ఇతను ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడో ఎవరికీ అర్థం కాదు, తనని తాను మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడు కానీ, అతని వల్ల అవ్వడం లేదు. నిన్నటి ఎపిసోడ్ లో మణికంఠ ని చూస్తే పాపం చాలా మందికి జాలి వేసింది. శనివారం ఎపిసోడ్ లో అందరూ అతన్ని జీరో అని ముద్రలు వేశారు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో కూడా అంతే గమ్యం లేని వాడని ఒకరు, మ్యానిపులేటివ్ అని ఒకరు, విక్టిమ్ కార్డు వాడే వాడని ఒకరు, ఇలా నెగేటివ్స్ ఉన్నాయో అన్ని మణికంఠ కే వేశారు హౌస్ మేట్స్.

    చివరికి ఆయన సొంత క్లాన్ వాళ్ళు కూడా మణికంఠ ని టార్గెట్ చేయడం తో అతను పాపం ఏడుపుని ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా చూస్తుంటే నెగేటివ్స్ ఎవరికైనా ఇస్తే ఎలా తీసుకుంటారో ఏమో అని భయం తో, చాలా సేఫ్ గా అందరూ మణికంఠ మీద నెగేటివ్స్ వేస్తున్నట్టుగా అనిపించింది. చివరికి అతను స్నేహితుడిగా భావించే నిఖిల్ కూడా మణికంఠ నే ఎంచుకున్నాడు. అయితే నిఖిల్ ఇన్ని రోజులు మణికంఠ తో స్నేహం నటించాడా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే మణికంఠ అత్యధికంగా ప్రేమని చూపేది నిఖిల్ మీదనే. తన బెస్ట్ ఫ్రెండ్ అని అనుకున్నాడు, నిఖిల్ కూడా మణికంఠ ని బెస్ట్ ఫ్రెండ్ అని అనేక సందర్భాలలో చెప్పుకొచ్చాడు. కానీ నేడు మణికంఠ కావాలా?, సోనియా కావాలా అనే ఛాయస్ వచ్చినప్పడు నిఖిల్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా సోనియా వైపే నిలబడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే కంటెస్టెంట్స్ చేత అత్యధికంగా ‘జీరో’ మార్కులు వేయించుకున్న మణికంఠ ని డేంజర్ జోన్ లో పెడుతాడు నాగార్జున.

    అలాగే ఆడియన్స్ చేత అతి తక్కువ ఓట్లతో సోనియా డేంజర్ జోన్ లో ఉంటుంది. వీళ్లిద్దరి లో హౌస్ లో ఎవరు ఉండాలని అనుకుంటున్నారు అని నాగార్జున అడగగా నిఖిల్, పృథ్వీ రాజ్ మరియు నైనికా మినహా మిగిలిన వాళ్ళందరూ మణికంఠ హౌస్ లో ఉండాలని కోరుకుంటారు. నిఖిల్ కి మణికంఠ, సోనియా ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. కానీ అతనికి క్లిష్ట సమయం లో మణికంఠ అవసరం లేదు అనిపించింది. సోనియా వల్ల తన గేమ్ చెడిపోతుంది అనే విషయం నిఖిల్ కి అర్థం అయ్యే ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆయన ఒక సరైన స్టాండ్ తీసుకోలేకపోవడం బాధాకరం. నిన్నటి వరకు సోనియా కి ప్రభావితం అయిన ఆయన, రేపు ఏ అమ్మాయికి అయిన ప్రభావితం అవ్వగలడు, చూడాలి మరి రేపటి నుండి ఇతని ఆట ఎలా ఉంటుంది అనేది.