https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : తల్లిదండ్రులు నిఖిల్ ని ఇంతలా అవమానించారా..? డబ్బు లేకపోతే అసలు విలువే లేదా!

ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇక నుండి ఆయనకి సినిమాల్లో కూడా హీరోగా అవకాశాలు వస్తాయో లేదో చూద్దాం.

Written By:
  • NARESH
  • , Updated On : December 15, 2024 / 08:38 AM IST

    Bigg boss Nikhil

    Follow us on

    Bigg Boss Telugu 8 : డబ్బులు లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా విలువ ఉండదు అనేందుకు మన నిజ జీవితాల్లో ఎన్నో ఉదాహరణలు చూసే ఉంటాము. సెలెబ్రిటీలను చూసి వీళ్లకు ఎలాంటి కష్టాలు లేవు అని అనుకుంటే పెద్ద పొరపాటే. వాళ్ళు మన నిజ జీవితం లో అనుభవించిన దానికంటే ఎక్కువ దరిద్రాన్ని అనుభవించి వచ్చారు. ఏ సెలబ్రిటీ జీవితాన్ని కదిలించినా ఫ్లాష్ బ్యాక్ దుఃఖం గానే ఉంటుంది. ఉదాహరణకి నిన్న బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరినీ తమ జీవితంలో బెస్ట్ మూమెంట్స్, అలాగే వరస్ట్ మూమెంట్స్ ని చెప్పుకోండి అని అంటాడు. ఆ సమయం లో నిఖిల్ మాట్లాడిన మాటలు ఉద్యోగం లేని ప్రతీ కుర్రాడికి కనెక్ట్ అవుతుంది. నిఖిల్ సినీ రంగం లోకి రాకముందు ఒక ఆర్కిటెక్ట్ స్టూడెంట్ గా కొనసాగేవాడట. ఒకవేళ నిఖిల్ అదే లైన్ లో వెళ్లి ఉండుంటే ఈరోజు ఆయన జీవితం ఇలా ఉండేది కాదేమో.

    సినిమాల మీద విపరీతమైన ఇష్టం తో ఆర్కిటెక్ట్ చదువుని పక్కన పెట్టేసి సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఉండేవాడు. ఆ సమయంలో ఆయనకి ఒక్క కన్నడ సీరియల్ లో హీరో గా నటించే అవకాశం దక్కింది. అది కూడా మొదటి ఎపిసోడ్ నుండి హీరో కాదట, మధ్యలో ఆ హీరో సీరియల్ మానేయడం వల్ల నిఖిల్ కి అవకాశం వచ్చిందట. ఈ గ్యాప్ మొత్తంలో ఆయన దగ్గర డబ్బులు లేవు. 20 , 30 రూపాయిలు కావాలన్నా కూడా అమ్మానాన్నలను అడగాల్సిందే. అలాంటి రోజుల్లో తల్లిదండ్రులు నిఖిల్ ని చాలా సూటిపోటి మాటలతో మనసు నొచ్చుకునేలా చేశారట. ఇంటికి భారం అయ్యావు, నిన్ను పోషించడమే కాకుండా, డబ్బులు కూడా మేమే ఇవ్వాలా?, ఇంత వయసొచ్చింది నీకు అని అన్నారట. కేవలం నిఖిల్ తల్లిదండ్రులు మాత్రమే కాదు, వయసుకు వచ్చి ఎలాంటి పనిపాట లేకుండా ఉండే ప్రతీ ఒక్కరికి ఇది అనుభవమే.

    అయితే ఆ సమయంలో అప్పటికే నిఖిల్ సీరియల్ ఒప్పుకొని ఉన్నాడు. రోజుకి 2500 రూపాయిలు ఇస్తామని చెప్పారట. అబ్బా చాలులే నెలకి 75 వేల రూపాయిలు వస్తుంది అని అనుకోని ఆనందించాడట. కానీ కేవలం పది రోజుల్లోనే షూటింగ్ అయిపోయిందట. ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. అలాంటి సమయంలో నిఖిల్ కి స్టార్ మా ఛానల్ నుండి ‘గోరింటాకు’ అనే సీరియల్ లో హీరో గా నటించే ఛాన్స్ దక్కింది. ఈ సీరియల్ పెద్ద హిట్ అవ్వడంతో ఇక నిఖిల్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. వరుసగా స్టార్ మా ఛానల్ లో సీరియల్స్, ఈవెంట్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ షో ద్వారా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ఇక నుండి ఆయనకి సినిమాల్లో కూడా హీరోగా అవకాశాలు వస్తాయో లేదో చూద్దాం.