Homeఎంటర్టైన్మెంట్Bigg Boss Telugu 8: ఒక్క ఉప్పు ప్యాకెట్ ధర 50 వేల రూపాయిలు..కంటెస్టెంట్స్ కి...

Bigg Boss Telugu 8: ఒక్క ఉప్పు ప్యాకెట్ ధర 50 వేల రూపాయిలు..కంటెస్టెంట్స్ కి ఫ్యూజులు ఎగిరే ట్విస్ట్!

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ఎంట్రీ తర్వాత ఎంత ఆసక్తికరంగా మారిందో అందరికీ తెలిసిందే. షోకి ఒక కొత్తదనం వచ్చింది, ఇది కదా అసలు బిగ్ బాస్ షో అంటే అని ఆడియన్స్ అనుకుంటున్నారు. నిన్న నామినేషన్స్ ఎపిసోడ్ ఎంత హీట్ వాతావరణం మధ్య జరిగిందో అందరికీ తెలిసిందే. నేటి ఎపిసోడ్ లో కూడా ఆ నామినేషన్స్ కొనసాగనున్నాయి. ఇది ఇలా ఉండగా కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమోలో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి ఇచ్చిన ట్విస్ట్ మామూలుగా అనిపించలేదు. ముందుగా ప్రోమో ప్రారంభం లో గంగవ్వ, గౌతమ్, విష్ణు ప్రియ, పృథ్వీ, హరి తేజ,టేస్టీ తేజా కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. విష్ణు ప్రియ మాట్లాడుతూ ‘మా నాన్నమ్మ నా పెళ్లి కోసం కూర్చొని ఎన్ని పూజలు చేస్తుందో’ అని అంటుంది. అప్పుడు గంగవ్వ ‘మరి చేసుకోవచ్చు కదా’ అని అనగా, దానికి విష్ణు ప్రియ సమాధానం చెప్తూ ‘నాకు తగ్గ వీరుడు, సూరుడు, ధీరుడు దిగాలి కదా’ అంటుంది.

దానికి టేస్టీ తేజా ‘ఎమ్మా..! నేను ధీరుడు, సూరుడు లాగా అనిపించడం లేదా నీకు?’ అని అంటాడు. అప్పుడు విష్ణు ప్రియ ‘నువ్వు ధీరుడు,సూరుడు, సున్నండ’ అని వెక్కిరిస్తుంది. టేస్టీ తేజా, అవినాష్, హరి తేజ, గంగవ్వ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ కంటెంట్ మామూలుగా ఇవ్వడం లేదు. అలా సరదాగా సాగిపోతుండగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని లివింగ్ ఏరియా లోకి రమ్మని పిలుస్తాడు. మీ దగ్గర ఉన్న రేషన్ మొత్తాన్ని స్టోర్ రూమ్ లో పెట్టేయండి అని ఆదేశిస్తాడు బిగ్ బాస్. స్టోర్ రూమ్ లో పెట్టిన తర్వాత మళ్ళీ కొత్తగా రేషన్ తీసుకునే అవకాశం ఇస్తాడు బిగ్ బాస్. ఓజీ క్లాన్ కి రేషన్ ని మ్యానేజ్ చేసే పవర్ ఉండడం తో, ఆ క్లాన్ కి సంబంధించిన సభ్యులు నిఖిల్, నబీల్ సూపర్ మార్కెట్ లోకి వెళ్లారు.

రెండు నిమిషాల సమయం లో 16 మందికి కావాల్సిన రేషన్ ని తీసుకున్నారు కానీ, ఆ హడావుడిలో ఉప్పు ప్యాకెట్స్, టమోటాలు మర్చిపోతారు. ఉప్పు, టమోటా లేకుండా వంటలు ఎలా చేసుకుంటారు చెప్పండి..?, అందుకే నబీల్ బిగ్ బాస్ ని కెమెరా వద్దకు వెళ్లి ఒక్క ఉప్పు ప్యాకెట్ ఇవ్వండి బిగ్ బాస్ అని అంటాడు. హౌస్ మేట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేయమని అడుగుతాడు. హౌస్ మేట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు. దానికి స్పందించిన బిగ్ బాస్ ‘ఒక్కో ఉప్పు ప్యాకెట్ 50 వేల రూపాయిలు అవుతుంది’ అని అంటాడు. కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత మెగా చీఫ్ డబ్బులు కట్ అయినా పర్వాలేదు, ఉప్పు ప్యాకెట్ కావాలని తీసుకుంటాడు. దీంతో ప్రైజ్ మనీ 38 లక్షల రూపాయిల నుండి 37,500 రూపాయలకు పడిపోతుంది. ఇక ఆ తర్వాత హౌస్ లో ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

 

Bigg Boss Telugu 8 | Day 37 - Promo 2 | Groceries with a Twist 😳 | Nagarjuna | Star Maa

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...

The Odyssey : ‘ది ఒడిస్సీ’ లో క్రేజీ రోల్ ని మిస్ చేసుకున్న మన హీరో.. పెద్ద...

రీసెంట్ గా భారీ అంచనాల నడుమ విడుదలైన క్రిస్టోఫర్ నోలన్ 'ది ఒడిస్సీ' చిత్రం , బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ వసూళ్ల సునామీ ని సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తుందో మన...

Lenin Movie : 11వ రోజు ఊహించని రికార్డు నెలకొల్పిన ‘లెనిన్’.. ఇప్పట్లో ఈ సునామీ ఆగేలా లేదు..

Lenin Movie : అక్కినేని అఖిల్ హీరో గా నటించిన 'లెనిన్' చిత్రం వసూళ్లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని కైవసం చేసుకున్న...

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...
Oktelugu Epaper
Exit mobile version