https://oktelugu.com/

Rajini Kanth Vs Gopichand : ఈ దసర కి రజినీకాంత్ తో పోటీ పడుతున్న గోపిచంద్…గెలిచేది ఎవరు..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులు వాళ్ళకంటు ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అందుకే ఒక సినిమా హిట్ అయిన, ప్లాపైన వాళ్లు మాత్రం వాళ్ళ నటనతో ప్రేక్షకులందరిని మెప్పిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 8, 2024 / 04:37 PM IST
    Rajini Kanth Vs Gopichand

    Rajini Kanth Vs Gopichand

    Follow us on

    Rajini Kanth Vs Gopichand :  తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ లాంటి నటుడు మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అక్కడ ఆయనకున్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు.తన నటన ప్రతిభతో ప్రేక్షకులందరినీ మెస్మరైజ్ చేయడంలో తను ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఆయన చేస్తున్న వరుస సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను కూడా సొంతం చేసుకున్నాడు. ఇలాంటి రజనీకాంత్ ప్రస్తుతం ‘వేట్టయన్ ‘ అనే సినిమాని చేశాడు. ఈ సినిమా దసర కానుకగా అక్టోబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని సాధించాలని ఆయన అనుకుంటున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే తెలుగులో పెద్ద హీరోల సినిమాలు రావడం లేదు. కాబట్టి ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ట్రేడ్ పండితులు సైతం ఈ సినిమా మీద మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి మొత్తానికైతే రజనీకాంత్ చేస్తున్న ఈ వేట్టయన్ సినిమా తెలుగులో కూడా సూపర్ సక్సెస్ అవ్వాలని అతని అభిమానులు కోరుకుంటున్నారు…

    ఇక ఇదిలా ఉంటే రజనీకాంత్ కు పోటీగా తెలుగులో స్టార్ హీరోలు ఎవరు రానప్పటికీ గోపీచంద్ లాంటి మీడియం రేంజ్ హీరో రజనీకాంత్ ను ఢీ కొట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన విశ్వం సినిమా అక్టోబర్ 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ రెండు సినిమాలకు మధ్య ఒకరోజు మాత్రమే గ్యాప్ ఉండడంతో రజనీకాంత్ సినిమాకి గోపీచంద్ పోటీని ఇస్తాడా అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి.

    మరి మొత్తానికైతే రజనీకాంత్ నటించిన వేట్టయన్ గోపీచంద్ నటించిన విశ్వం రెండు సినిమాలు ప్రేక్షకుల్లో ఎలాంటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇప్పటికే గోపీచంద్ వరుస ప్లాపులతో ఉన్నాడు. కాబట్టి విశ్వం సినిమా మీద పెద్దగా హైప్ అయితే లేదు.

    కానీ వేట్టయన్ సినిమా మీద మాత్రం ఎంతో కొంత హైప్ అయితే ఉంది. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా అయితే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంటుందో ఆ సినిమాకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చే అవకాశాలైతే ఉన్నాయి. అలాగే ఈ పండుగ సీజన్ ను కూడా క్యాష్ చేసుకునే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. చూడాలి మరి ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ అవుతుంది అనేది…