Bigg Boss Telugu 8: రివెంజ్ నామినేషన్ అంటూ వచ్చిన విష్ణు ప్రియ కి క్లాస్ పీకిన బిగ్ బాస్..ఇంత అతి కంటెస్టెంట్ బిగ్ బాస్ హిస్టరీ లోనే లేదు!

కేవలం వీకెండ్ ఎపిసోడ్స్ లో డ్యాన్స్ వేయడానికి మాత్రమే ఈమె ఉంది. హౌస్ లోకి అడుగుపెట్టక ముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ అవ్వడంతో ఈమె కారణంగా మిగతా కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది.

Written By: Vicky, Updated On : October 16, 2024 9:26 am

Sushmita Sen(1)

Follow us on

Bigg Boss Telugu 8: దేనికైనా ఒక హద్దు ఉంటుంది, ఎంత తింగరి తనమైన చూసే ప్రేక్షకులకు ఒక స్టేజి వరకు ఎంటర్టైన్మెంట్ గానే ఉంటుంది. కానీ ఆ స్టేజి దాటిన తర్వాత ఎవరికైనా చిరాకు వేయడం సహజం. ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లో అలా ఆడియన్స్ కి చిరాకు కోపం రప్పిస్తున్న కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా అంటే అది విష్ణు ప్రియనే అని చెప్పడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. క్యారక్టర్ పరంగా మంచి అమ్మాయే అని అందరికీ ఒక అవగాహన వచ్చింది కానీ, హౌస్ లో ఉండేందుకు ఈమె ఏమాత్రం అర్హురాలు కాదు, ఈమెకంటే సీత అన్ని విధాలుగా బెటర్ అని ఆడియన్స్ కి ఇప్పుడు అనిపిస్తుంది. టాస్కులు ఆడే విషయం లో అందరికంటే వీక్, ఎంటర్టైన్మెంట్ ని అందించలేదు, హౌస్ లో ఉన్నంతసేపు పృథ్వీ చుట్టూ ప్రదిక్షణలు చేస్తూ, అతనికి ముద్దులు పెట్టుకుంటూ తిరగడమే కానీ, ఈమె హౌస్ లో ఎందుకు ఉందో ఆమెకి కూడా క్లారిటీ లేదు.

కేవలం వీకెండ్ ఎపిసోడ్స్ లో డ్యాన్స్ వేయడానికి మాత్రమే ఈమె ఉంది. హౌస్ లోకి అడుగుపెట్టక ముందే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కంటెస్టెంట్ అవ్వడంతో ఈమె కారణంగా మిగతా కంటెస్టెంట్స్ కి అన్యాయం జరుగుతుంది. నిన్న ఈమె నయనీ పావని మీద ఎంత దారుణమైన సిల్లీ నామినేషన్ వేసిందంటే, ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ కూడా అలాంటి నామినేషన్ వేయలేదు అని చెప్పొచ్చు. ఆమె బిగ్ బాస్ తో మాట్లాడుతూ ‘నేను నయనీ పావని మీద రివెంజ్ నామినేషన్ వెయ్యాలి అనుకుంటున్నాను బిగ్ బాస్. తను నన్ను నామినేట్ చేయాలనుకుంది, నేను ఇప్పుడు ఆమెని నామినేట్ చేయాలని అనుకుంటున్నాను’ అని వీకెండ్ లో నాగార్జున తో ఎలా తింగరి తనంతో మాట్లాడుతుందో, అదే తింగరితనం యాంగిల్ లో బిగ్ బాస్ తో చెప్తుంది.

అప్పుడు బిగ్ బాస్ విష్ణు ప్రియకి వార్నింగ్ ఇస్తూ ‘రివెంజ్ నామినేషన్స్ చేయడానికి వీలు లేదు , కచ్చితంగా ఎదో ఒక బలమైన కారణం చెప్పాల్సి ఉంటుంది’ అని అంటాడు. అప్పుడు విష్ణు ప్రియ అప్పటికప్పుడు పాయింట్స్ ని వెతుక్కొని నయనీ పావని ని హోటల్ టాస్క్ లో నువ్వు పెద్దగా ఆడినట్టు నాకు కనిపించలేదు, అందుకే నిన్ను నామినేట్ చేస్తున్నాను అని నామినేట్ చేస్తుంది. సీరియస్ గా ఉండాల్సిన విషయాల్లో కూడా విష్ణు ప్రియ ఇలా ప్రవర్తించడం పై నాగార్జున కనీసం ఈ వారంలో అయినా ఆమెకి క్లాస్ పీకుతాడో లేదో చూడాలి. ప్రతీ వారం నాగార్జున విష్ణు ప్రియ కి క్లాస్ పీకుతాడేమో అని ప్రేక్షకులు ఆశగా ఎదురు చూడడం, కానీ ఆయన మాత్రం ఈమెతో ముచ్చట్లు ఆడడం చాలా కామన్ అయిపోయింది. కనీసం ఈ వారం అయినా ఆయన స్క్రిప్ట్ ని మార్చి విష్ణు ప్రియ కి బలమైన కోటింగ్ ఇస్తాడో లేదో చూడాలి.