Deputy Cm Pawan Kalyan: ఆ తల్లి ఇచ్చిన ధైర్యమే పవన్ కళ్యాణ్ ను హీరోని చేసిందా?

2022 అక్టోబర్ 15న పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటనకు వెళ్లారు. జనవాణి పేరుట ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు గాను విశాఖ వెళ్లారు. ఈ క్రమంలో వేలాదిమందించిన సైనికులు విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు.

Written By: Dharma, Updated On : October 16, 2024 10:06 am

AP Deputy CM Pawan Kalyan 

Follow us on

Deputy Cm Pawan Kalyan: సుదీర్ఘ పోరాటం తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా రాణించగలిగారు.దాదాపు పార్టీ ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత అధికారాన్ని అందుకోగలిగారు. ఈ ఎన్నికల్లోకూటమి కట్టడం ద్వారా అధికారంలోకి రాగలిగారు.తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి రావడంలో కీలక భూమిక పోషించారు. అయితే ఇదంతా ఒక్కరోజులో రాలేదు.ఎన్నెన్నో అవమానాలు, ఇబ్బందులు అధిగమించి పవన్ ముందుకు సాగారు. సుదీర్ఘకాలం పాటు రాజకీయంగా పోరాడారు.ఈ క్రమంలోనాటి గురుతులను నెమరు వేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పండుగ పేరుతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఈ విషయంలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు పవన్ కళ్యాణ్.రాష్ట్రవ్యాప్తంగా వేలాది కిలోమీటర్ల సిసి రహదారులు,తారు రోడ్లు, కాలువల నిర్మాణం చేపట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో పవన్ చాలా విషయాలను ప్రస్తావించారు. గత ఐదేళ్లుగా వైసీపీ పై పోరాటానికి.. ఓ ఘటన స్ఫూర్తిగా నిలిచిన విషయాన్ని ప్రస్తావించారు. ఓ వీర మహిళ పోరాటం తనలో స్ఫూర్తిని రగిలించిందని గుర్తు చేశారు.

* నాడు విశాఖ పర్యటనలో
2022 అక్టోబర్ 15న పవన్ కళ్యాణ్ విశాఖలో పర్యటనకు వెళ్లారు. జనవాణి పేరుట ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకు గాను విశాఖ వెళ్లారు. ఈ క్రమంలో వేలాదిమందించిన సైనికులు విశాఖ ఎయిర్పోర్ట్ లో పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. అయితే దీనిని అడ్డుకున్నారు పోలీసులు. దాదాపు నగర వీధుల్లో జన సైనికులు భారీగా గుమిగూడారు. పవన్ కళ్యాణ్ కు భారీగా నీరాజనాలు పలికారు. అయితే ఈ క్రమంలో పవన్ ర్యాలీని అడ్డుకున్నారు పోలీసులు. మరోవైపు ఈ ర్యాలీ సందర్భంగా ఇలాంటి ప్రభుత్వం విద్యుత్ సరఫరాల సైతం నిలిపివేసింది. ప్రభుత్వ తీరుపై జనసైనికులు, పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తర్వాత మీడియా వాహనంలో జనరేటర్ సాయంతో ఎల్ఈడి లైట్ల వెలుతురులో ర్యాలీ నిర్వహించారు.

* అధినేతకు అండగా
అయితే జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలని పోలీస్ అధికారులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేశారు.ఈ క్రమంలో ఒక్కసారిగా జనసైనికులు రియాక్ట్ అయ్యారు.పవన్ బసచేసిన నోవాటేల్ ఎదుటజనసైనికులు పెద్ద ఎత్తున నిరసన తెలపడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు.అయినా సరే జనసైనికులు వెనక్కి తగ్గలేదు.ఈ క్రమంలో ఓ వీర మహిళ తన రెండేళ్ల చిన్నారితో నిరసన తెలపడం పవన్ కళ్యాణ్ ను ఆకట్టుకుంది. అదే విషయాన్ని తాజాగా ప్రస్తావించారు పవన్. ఆ మహిళతనలో స్ఫూర్తిని నింపారని.. అక్కడ నుంచే వైసిపి విధ్వంసాలపై పోరాటం చేయడం ప్రారంభించామని చెప్పుకొచ్చారు పవన్.