Sushmita Sen: సుస్మితాసేన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా వెలుగొందారు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన సుస్మితాసేన్ 1994లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది. దాంతో మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమెకు దక్కింది. అదే ఏడాది జరిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో పాల్గొన్న సుస్మితాసేన్ టైటిల్ కైవసం చేసుకుంది. 1996లో దస్తక్ చిత్రంతో హిందీ పరిశ్రమలో అడుగుపెట్టింది.
దస్తక్ చిత్రానికి మహేష్ భట్ దర్శకుడు. తెలుగులో నాగార్జునకు జంటగా రక్షకుడు మూవీ చేసింది. అప్పట్లో ఇది భారీ బడ్జెట్ మూవీ. రక్షకుడు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 1999లో విడుదలైన బీవీ నెంబర్ వన్ మూవీతో సుస్మితాసేన్ కి బ్రేక్ వచ్చింది. సల్మాన్ ఖాన్, కరిష్మా కపూర్, సుస్మితాసేన్ ఈ చిత్రంలో నటించారు. బీవీ నెంబర్ వన్ మంచి వసూళ్లు రాబట్టింది.
2006 తర్వాత సుస్మితాసేన్ కెరీర్ నెమ్మదించింది. ఆమెకు అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి. సుస్మితా సేన్ వివాహం చేసుకోలేదు. అయితే తల్లి మాత్రం అయ్యారు. 2000 లో సుస్మితాసేన్ రీనీసేన్ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. అనంతరం 2010లో అలీషా అనే మరో పాపను దత్తత తీసుకుంది. వీరిద్దరికీ సింగిల్ మదర్ గా సుస్మితా సేన్ ఉన్నారు. అయితే తండ్రి లేకపోవడం వలన పిల్లల పాస్ పోర్ట్ విషయంలో సమస్యలు తలెత్తాయట.
రీనీ, అలీషాలకు పాస్ పోర్ట్ అప్లై చేయగా.. తండ్రి ఎవరు అని అధికారి అడిగాడట. తల్లి పేరు ఉంది కదా? నేను సింగిల్ మదర్. తండ్రి లేడని చెప్పినా సదరు అధికారి వినలేదట. తండ్రి పేరు రాయాల్సిందే అన్నారట. అప్పుడు సుస్మితాసేన్ కోర్టు కి వెళ్లారట. సుస్మితాసేన్ ఈ విషయంలో లీగల్ ఫైట్ చేయడంతో పాస్ పోర్ట్ ఆఫీస్ కి కోర్ట్ నుండి లెటర్ వెళ్లిందట.
మీరు చట్టాలను వ్యతిరేకిస్తున్నారు. సింగిల్ మదర్ పిల్లలకు పాస్ పోర్ట్ విషయంలో తండ్రి పేరు ఉండాల్సిన అవసరం లేదని కోర్ట్ ఆ లెటర్ లో తెలియజేసిందట. అప్పుడు తన పిల్లలకు పాస్ పోర్ట్ వచ్చిందట. ఇండియాలో ఇప్పటికీ తండ్రి లేకుండా పాస్ పోర్ట్ పొందడం సులభం కాదని సుస్మితాసేన్ అసహనం వ్యక్తం చేసింది.
అసలు చట్టాలు ఏం చెబుతున్నాయి?
చాలా మంది సింగిల్ మదర్స్/పేరెంట్స్ తమ పిల్లల పాస్ పోర్ట్ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సెక్యూరిటీ రీజన్స్ చూపుతూ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. భారతదేశ చట్టం ప్రకారం సింగిల్ మదర్ దత్తత తీసుకున్న పిల్లల కోసం పాస్ పోర్ట్ కొరకు అప్లై చేయవచ్చు. తండ్రి పేరు ఉండాల్సిన అవసరం లేదు.
పిల్లలను దత్తత తీసుకున్నట్లు లీగల్ ఆర్డర్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్ ప్రూఫ్ వంటి డాక్యూమెంట్స్ సమర్పించాల్సి ఉంటుంది. భర్తను కోల్పోయిన తల్లి సైతం ఆయన డెత్ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేయడం ద్వారా పిల్లలకు పాస్ పోర్ట్ పొందవచ్చు. భారత ప్రభుత్వం ఈ మేరకు చట్టం చేసింది. సమస్య అంతా అధికారుల వద్దే ఉంది. సుస్మితాసేన్ వంటి మోస్ట్ పాపులర్ సెలెబ్రిటీనే లీగల్ ఫైట్ చేయాల్సి వచ్చింది. ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
సుస్మితాసేన్ పిల్లలను ఎందుకు దత్తత తీసుకుంది?
కాగా సుస్మితాసేన్ వివాహం చేసుకోలేదు. అయితే పలువురితో ఆమె డేటింగ్ చేసింది. కెరీర్ బిగినింగ్ లో ప్రొడ్యూసర్, నటుడు అయిన రణదీప్ హుడాతో ఆమె రిలేషన్ లో ఉంది. అనంతరం అతనికి బ్రేకప్ చెప్పింది. వయసులో తనకంటే చిన్నవాడైన మోడల్ రోహన్ షావల్ తో ఆమె చాలా కాలం సహజీవనం చేసింది. 2021లో అతనికి కూడా బ్రేకప్ చెప్పింది. ప్రముఖ బిజినెస్ మాన్. ఐపీఎల్ లో చక్రం తిప్పిన లలిత్ మోడీ సైతం సుస్మితాసేన్ ఎఫైర్ నడిపింది. ప్రస్తుతం ఆమె సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది.